త్వరలో 100 కే సచివాలయాలలో వారసత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్

త్వరలో 100 కే సచివాలయాలలో వారసత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్

వారసత్వంగా సంక్రమించే ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక అప్డేట్ వెలువరించింది. ఇకపై వారసత్వ ఆస్తులను గ్రామ వార్డు సచివాలయాలలో నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు త్వరలో అవకాశం కల్పించనుంది.

అయితే వీరికి మాత్రమే సచివాలయంలో చేస్తారు

ఆస్తి యజమాని మరణించిన విషయంలో వారసులకు సంక్రమించే ఆస్తులకు మాత్రమే గ్రామ వార్డు సచివాలయాలలో రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది.

మిగిలిన అన్ని రకాల రిజిస్ట్రేషన్లు యధావిధిగా సబ్ రిజిస్టార్ కార్యాలయాలలోనే కొనసాగుతాయి.

ఏకాభిప్రాయం తప్పనిసరి

తల్లిదండ్రులు మరణించిన అనంతరం వారసులు ఏకాభిప్రాయంతో ఆస్తి భాగాలు చేసుకుని వచ్చి గ్రామ వార్డు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ సంప్రదిస్తే వీరికి రిజిస్ట్రేషన్ పూర్తి చేయడం జరుగుతుంది. అయితే ఇందుకు అందరి ఏకాభిప్రాయం తప్పనిసరి.

రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత?

వారసత్వ ఆస్తులను గ్రామ వార్డు సచివాలయాలలో రిజిస్టర్ చేయాలంటే ఆస్తి విలువ ఒకవేళ 10 లక్షలు మరియు ఆలోపు ఉంటే వంద రూపాయలు స్టాంప్ డ్యూటీ కింద చెల్లించాలి. అంతకన్నా ఎక్కువ ఉంటే ₹1000 చెల్లించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు.

Land registration

మ్యుటేషన్ కూడా ఆటోమేటిక్ గా అవుతుందా?

సచివాలయంలో నామమాత్రపు ఫీజు తోటి వారసత్వ భూములు రిజిస్టర్ చేసుకున్న వారికి ల్యాండ్ రికార్డ్స్ అంటే మ్యుటేషన్ లో అన్ని వివరాలు ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి. అదేవిధంగా అర్హులైన భూములకు ఈ పాస్ బుక్ కూడా జారి అవుతుంది. లబ్ధిదారుల నుంచి ఈ కేవైసీ కూడా తీసుకోవటం జరుగుతుంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ ఈమెరకు కార్యచరణ ప్రారంభించింది. ఇందుకు సంబంధించి గ్రామ వార్డు సచివాలయ శాఖకు మార్గదర్శకాలతో జీవో జారీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

ముఖ్యమైన ప్రభుత్వ జీవోలను డౌన్లోడ్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Click here to Share

You cannot copy content of this page