హర్ ఘర్ తిరంగా కార్యక్రమం 2025 పూర్తి వివరాలు

హర్ ఘర్ తిరంగా కార్యక్రమం 2025 పూర్తి వివరాలు

Har Ghar Tiranga 2025: “హర్ ఘర్ తిరంగా” అంటే “ప్రతి ఇంటిలో జెండా” అనే అర్థం. ఇది ఆజాది కా అమృత్ మహోత్సవ్ (Azadi Ka Amrit Mahotsav) భాగంగా భారత ప్రభుత్వం 2022లో ప్రారంభించిన జాతీయ ఉద్యమం. దీని ప్రధాన ఉద్దేశ్యం భారతదేశపు ప్రతి పౌరుడిలో జాతీయ గర్వం, దేశభక్తి, మరియు ఐక్యత భావం పెంపొందించడమే.

ప్రత్యేకతలు

  • ప్రజలు తమ ఇళ్లపై జాతీయ పతాకం (త్రివర్ణ పతాకం) ఎగురవేయాలి
  • జెండాతో సెల్ఫీ తీసుకొని harghartiranga.com అనే అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి
  • #HarGharTiranga అనే హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో భాగస్వామ్యం చేయాలి
  • విద్యార్థులు, యువత, ఉద్యోగులు, ప్రభుత్వ/ప్రైవేట్ సంస్థలు పాల్గొనాలి.

📷 Selfie With Tiranga – సెల్ఫీ విత్ తిరంగా

  • జెండాతో సెల్ఫీ తీసుకుని అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి
  • https://harghartiranga.com లో ‘Pin a Flag’ అనే ఆప్షన్ ద్వారా మీ స్థలాన్ని జత చేయవచ్చు
  • ఇప్పటికే కోట్ల సంఖ్యలో సెల్ఫీలు అప్‌లోడ్ అయ్యాయి

హర్ ఘర్ తిరంగా కార్యక్రమం వివరాలు మరియు ఉత్తర్వులు – ఫేజ్ 1,2,3 – ప్రతి గ్రామ వార్డు సచివాలయాలలో చేయవలసిన కార్యక్రమాలు

కార్యక్రమం మొత్తం మూడు దశలుగా ఉంది:

ఫేజ్ 1: 2 ఆగస్ట్ – 8 ఆగస్ట్ 2025

లక్ష్యం: దేశభక్తి భావాన్ని రేకెత్తించడం, త్రివర్ణ పతాకాన్ని గౌరవించడం.

• స్కూల్‌ల గోడలపై త్రివర్ణ కళా చిత్రాలు వేయించాలి
• సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేయాలి –
• త్రివర్ణ ప్రదర్శనలు – రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శించాలి
• రంగోలీ పోటీలు – పబ్లిక్ ప్లేస్‌లలో నిర్వహించాలి
• త్రివర్ణ క్విజ్ – MyGov వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది
• తిరంగా రాఖీ తయారీ వర్క్షాప్‌లు – పాఠశాలలు, ఆంగన్‌వాడీలు, వృద్ధాశ్రమాలు మొదలైన వాటిలో నిర్వహించాలి
• జవాన్లు, పోలీసులకు లేఖలు రాయడం – విద్యార్థుల చేత రాయించాలి
• స్వచ్ఛతా ఉద్యమం – గ్రామాల్లో జల శక్తి, సంస్కృతి మంత్రిత్వ శాఖలతో కలిపి ప్రత్యేక కార్యక్రమాలు
• తిరంగా వాలంటీర్ రిజిస్ట్రేషన్ – ఫ్లాగ్ సెల్ఫీ తీసి షేర్ చేయాలి

ఫేజ్ 2: 9 ఆగస్ట్ – 12 ఆగస్ట్ 2025

లక్ష్యం: ఉత్సాహంతో దేశమంతటా ప్రజల భాగస్వామ్యం.

• తిరంగా మహోత్సవ్ – సీఎం, గవర్నర్ హాజరైన VIP ఈవెంట్లు
తిరంగా మేళా & కచేరీ – స్థానిక వస్తువుల అమ్మకాలు, దేశభక్తి పాటలు.
• తిరంగా బైక్ ర్యాలీ/సైకిల్ ర్యాలీ – NSS, పోలీసులతో కలసి నిర్వహించాలి
• తిరంగా యాత్రలు – పెద్ద ఎత్తున జెండాలతో ఊరేగింపులు
• హ్యుమన్ చైన్స్ – ప్రజలతో జెండా చైన్‌లు
• తిరంగా అమ్మకాలు & పంపిణీ – స్థానిక తయారీకి ప్రాధాన్యం
• మీడియా ప్రచారం – రేడియో, సోషల్ మీడియా, ప్రముఖుల ద్వారా ప్రచారం

ఫేజ్ 3: 13 ఆగస్ట్ – 15 ఆగస్ట్ 2025

లక్ష్యం: జాతీయ పతాకం ఇంటింటా ఉంచడం, సెల్ఫీలు అప్‌లోడ్ చేయడం.

• ప్రతి ఇంటిలో, ఆఫీస్‌లో, వాహనాల్లో జెండాను పాడుకోవాలి
• Flag Hoisting కార్యక్రమాలు అన్ని గ్రామాలు, పట్టణాల్లో నిర్వహించాలి
• Selfie with Tiranga వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి

ప్రత్యేక సూచనలు:

• 2 ఆగస్టు నుంచే త్రివర్ణ లైటింగ్ & అలంకరణలు ప్రారంభించాలి
• పబ్లిక్ ప్లేస్‌లలో త్రివర్ణ రంగోలీలు, దీపాలు, డెకరేషన్‌లు ఏర్పాటు చేయాలి.

హర్ ఘర్ తిరంగా కార్యక్రమం – ముఖ్యాంశాలు:*

కార్యక్రమం ఉద్దేశ్యం: ప్రతి ఇంటిలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం ద్వారా దేశభక్తిని ప్రదర్శించడమే ముఖ్య ఉద్దేశ్యం.

పెద్ద ఎత్తున ప్రచారం: రాష్ట్ర, జిల్లా, గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు

జాతీయ పతాకం విక్రయం: తక్కువ ధరలకు పతాకాలు అందుబాటులో ఉంచాలి – సైజు: 20″x30″, ధర: రూ.25

ప్రతి ఇంటికి త్రివర్ణ పతాకం: 13, 14, 15 ఆగస్టు తేదీలలో జెండా ఎగురవేయాలి

ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలలు: జెండా ఎగురవేయాలి, జాతీయ గీతం ఆలపించాలి

స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం: యువజన సంఘాలు, ఎన్జీఓల సహకారం

ఫోటోలు & వీడియోలు: ప్రతి కార్యకలాపాన్ని డాక్యుమెంట్ చేసి ప్రభుత్వ పోర్టల్‌కి అప్‌లోడ్ చేయాలి

అవగాహన కార్యక్రమాలు: బైక్ ర్యాలీలు, పతాకా ర్యాలీలు, పోస్టర్ క్యాంపెయిన్‌లు

నిర్వహణ బాధ్యత: గ్రామ/వార్డు కార్యదర్శులు, మున్సిపల్ అధికారులు, DEO

Har Ghar Tiranga Important Links

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page