జూన్ లోగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ

జూన్ లోగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పోలిట్ బ్యూరో సమావేశం జరిగింది

ఈ నేపథంలో కీలక పథకాలకు సంబంధించిన అప్డేట్స్ నీ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఈ సమావేశంలో ముఖ్యాంశాలు మీకోసం..

జూన్ లోగా మూడు పథకాలు

జూన్ 2025లోగా సూపర్ సిక్స్ లో భాగమైనటువంటి మూడు కీలక పథకాలను ప్రారంభిస్తామని మంత్రి అచ్చం నాయుడు మీడియాకు వెల్లడించారు.

ఇందులో భాగంగా కింది మూడు పథకాలను మంత్రి వెల్లడించారు.

  1. తల్లికి వందనం : జూన్ లో పాఠశాలలు ప్రారంభమయ్యే ముందే ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద 15 వేల రూపాయలు అందించునున్నట్లు మంత్రి వెల్లడించారు.
  2. అన్నదాత సుఖీభవ: మే లేదా జూన్ లో  కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ తో కలిపి అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి మూడు విడతల్లో 20వేల రూపాయలు ఇస్తామని మంత్రి తెలిపారు.
  3. మత్స్యకార భరోసా: రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 15వ తేదీ నుంచి మత్స్యకారులకు చేపల వేట నిషేధం నెలపాటు ఉండనున్న నేపథ్యంలో అంతకుముందే 20 వేల రూపాయలు వారికి అందిస్తామని తెలిపారు.

ఇవే కాకుండా ఇప్పటికే పెంచిన పెన్షన్, అన్న క్యాంటీన్లు, ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి పథకాలను ఇప్పటికే ప్రారంభించినట్లు మంత్రి వెల్లడించారు.

మరో వైపు వచ్చే  విద్యాసంవత్సరం ప్రారంభమయం లోపే రాష్ట్రవ్యాప్తంగా మెగా డీఎస్సీ ద్వారా టీచర్ల పోస్టులను భర్తీ చేస్తామని నారా లోకేష్ వెల్లడించారు. అంతేకాకుండా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను, గత ప్రభుత్వం పెట్టిన ధాన్యం బకాయిలన్నిటిని కూడా ప్రస్తుత ప్రభుత్వం చెల్లించిందని ఆయన వెల్లడించారు.

Nara lokesh at Meeting

మొత్తానికి రాష్ట్ర ప్రజలకు మేలు చేసేలా ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి మూడు కీలక పథకాలను రాష్ట్ర ప్రభుత్వం జూన్ లోపు ప్రారంభించాలని కచ్చితంగా నిర్ణయించింది. ఇంకా పెండింగ్ ఉన్నటువంటి నిరుద్యోగ భృతి మరియు మహిళలకు ప్రతినెల 15 వందల రూపాయలు వంటి పథకాలను కూడా వీలైనంత త్వరగా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.

Click here to Share

You cannot copy content of this page