ఎస్సీ, ఎస్టీలకు ఉచిత సౌర విద్యుత్తు – ప్రధాని సూర్యఘర్ పథకం పూర్తి వివరాలు

ఎస్సీ, ఎస్టీలకు ఉచిత సౌర విద్యుత్తు – ప్రధాని సూర్యఘర్ పథకం పూర్తి వివరాలు

ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యుత్ వినియోగదారులకు ఇప్పుడు ఉచితంగా సౌర విద్యుత్తు ఏర్పాటు చేసే అవకాశం లభించింది. ఈ పథకం ద్వారా విద్యుత్ బిల్లులు తగ్గడమే కాకుండా, పర్యావరణానికి కూడా మేలు కలగనుంది.

పథకం ముఖ్య ఉద్దేశ్యం

ప్రభుత్వం లక్ష్యం — ప్రతి ఇంటికి శాశ్వత విద్యుత్ సరఫరాతో పాటు పచ్చ శక్తి (Green Energy)ను ప్రోత్సహించడం. ఎస్సీ, ఎస్టీ వర్గాల ఆర్థిక భారం తగ్గించేందుకు ఉచితంగా సౌర విద్యుత్తు వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నారు.

ఎవరు అర్హులు?

  • నెలకు 200 యూనిట్ల లోపు విద్యుత్తు వినియోగించే వినియోగదారులు
  • ఎస్సీ లేదా ఎస్టీ వర్గాలకు చెందినవారు
  • సొంత ఇల్లు కలిగి ఉండాలి
  • ఇంటి పైకప్పుపై సౌర పలకలు ఏర్పాటు చేసేందుకు స్థలం ఉండాలి
  • దరఖాస్తుదారు భారతీయ పౌరుడై ఉండాలి.
  • సోలార్ ప్యానెల్స్ అమర్చడానికి అనువైన పైకప్పు ఉన్న ఇల్లు కలిగి ఉండాలి.
  • తప్పనిసరిగా పనిచేసే విద్యుత్ కనెక్షన్‌ కలిగి ఉండాలి.
  • గతంలో మరే ఇతర సోలార్ ప్యానెల్ సబ్సిడీ పథకాన్ని పొంది ఉండకూడదు.

అందించబడే సౌకర్యాలు

  • ఉచితంగా 2 కిలోవాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్తు వ్యవస్థను ఏర్పాటు చేస్తారు
  • ఈ సిస్టమ్‌ ద్వారా నెలకు సుమారు 300 యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది
  • సౌర విద్యుత్తు ఏర్పాటు చేసుకున్న వారికి ప్రభుత్వం నుండి రూ.200 నెలవారీ ప్రోత్సాహక రాయితీ లభిస్తుంది

అవసరమైన పత్రాలు

  • తాజా విద్యుత్ బిల్లు.
  • ఆధార్ కార్డు.
  • పాన్ కార్డు.
  • ఆస్తి యాజమాన్య రుజువు (Property Ownership Proof).
  • బ్యాంక్ పాస్‌బుక్ లేదా ఖాతా వివరాలు.
  • దరఖాస్తుదారుని ఫోటో.
  • రూఫ్‌టాప్ ఫోటో (proposed installation site).

దరఖాస్తు విధానం

  • అర్హులైన వారు అంగీకార పత్రం (Consent Form) ఇవ్వాలి
  • నమూనా పత్రం మీ విద్యుత్ సెక్షన్ కార్యాలయం (ఏఈ / సబ్ స్టేషన్) వద్ద లభిస్తుంది
  • పత్రంలో ఈ వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలి:
    • పేరు
    • సర్వీస్ నంబర్
    • ఆధార్ నంబర్
    • కుల ధ్రువీకరణ పత్రం
    • చిరునామా & మొబైల్ నంబర్
  • పూర్తి చేసిన పత్రాన్ని ఏఈ కార్యాలయంలో సమర్పించాలి
  • అధికారులు పరిశీలించి మీ ఇంటిపై సౌర పలకలు ఏర్పాటు చేస్తారు.

పథకం అమలు – ఎన్టీఆర్ జిల్లా మొదటిగా

ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటికే ఈ పథకం ప్రారంభమైంది. 200 యూనిట్ల లోపు విద్యుత్తు వినియోగించే వారి వివరాలు సేకరించబడ్డాయి. అయితే చాలా మందికి పథకం గురించి తెలియకపోవటంతో దరఖాస్తులు మందకొడిగా సాగుతున్నాయి.

విద్యుత్తు ఎస్ఈ యు. హనుమయ్య ప్రజలను తమ ప్రాంత విద్యుత్తు ఉపకేంద్రంలోని అసిస్టెంట్ ఇంజినీర్‌ను సంప్రదించి వెంటనే దరఖాస్తులు సమర్పించాలని కోరుతున్నారు.

ముఖ్య సూచన

ఈ పథకం కేవలం ఎస్సీ, ఎస్టీ వర్గాలకే వర్తిస్తుంది. అర్హులైనవారు వెంటనే దరఖాస్తు చేసి ఉచిత సౌర విద్యుత్తు ప్రయోజనం పొందవచ్చు.

ఎస్సీ/ఎస్టీలకు ప్రత్యేక ప్రయోజనం

➥ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో: జగ్జీవన్ జ్యోతి యోజన పథకంతో అనుసంధానం చేస్తూ, 20 లక్షల ఎస్సీ & ఎస్టీ కుటుంబాలకు రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్స్ ద్వారా నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
➥ మహారాష్ట్రలో (SMART పథకం): ఎస్సీ (SC) మరియు ఎస్టీ (ST) వినియోగదారులకు కేంద్ర సబ్సిడీకి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి 30% అదనపు సబ్సిడీ లభిస్తుంది.

సబ్సిడీ వివరాలు (కేంద్ర ప్రభుత్వం)

గరిష్టంగా ₹ 78,000 వరకు సబ్సిడీ లభిస్తుంది.

  • 1-2 kW సామర్థ్యం వరకు: ₹ 30,000/- నుండి ₹ 60,000/- వరకు.
  • 2-3 kW సామర్థ్యం వరకు: ₹ 60,000/- నుండి ₹ 78,000/- వరకు.
  • 3 kW కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న సిస్టమ్‌లకు: గరిష్టంగా ₹ 78,000/- సబ్సిడీ వర్తిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page