రేపే జగనన్న చేదోడు నాలుగోవ విడత అమౌంట్ విడుదల

రేపే జగనన్న చేదోడు నాలుగోవ విడత అమౌంట్ విడుదల

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ys Jagan) కర్నూలు జిల్లాలో రేపు పర్యటించనున్నారు. జగనన్న చేదోడు పథకం (Jagananna Chedodu Scheme)కింద లబ్దిదారులకు నాల్గొవ విడత సాయాన్ని ఎమ్మిగనూరు జరిగే సభలో భాగంగా విడుదల చేయబోతున్నారు. ఈ పథకం కింద దర్జీలు, రజకులు, నాయీ బ్రహ్మణులకు రూ.10 వేల సాయం అందుతోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3.30 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది..గత మూడేళ్లలో జగనన్న చేదోడు పథకం కింద రూ.927.51 కోట్లు సాయం అందజేశారు.

నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాలతో రాష్ట్రంలోని ప్రతీ నిరుపేద కుటుంబానికి ఎంతో మేలు జరుగుతోంది. వెనకబడిన కులాలను, వర్గాలను.. వెన్నెముక కులాలుగా మారుస్తామని మాట ఇచ్చామని.. చేసి చూపించామన్నారు. గత మూడేళ్లలో ప్రతి సంక్షేమ పథకం రాష్ట్రంలోని ప్రతీ వర్గాల కుటుంబాలకు మేలు జరిగింది. ఏటా రూ.10వేలు ఆర్థిక సాయం చేసేలా జగనన్న చేదోడు పథకం తీసుకొచ్చారు. అర్హత ఉంటే చాలు లంచాలకు తావులేకుండా ఆర్థిక సాయం అందిస్తున్నారు. పార్టీలకు, కులాలకు అతీతంగా, పారదర్శకంగా పథకాలను అందిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి మేలు చేస్తూ.. ఇప్పటి వరకు నేరుగా 1.92 లక్షల కోట్లు అందించారు.

You cannot copy content of this page