తల్లికి వందనం పథకానికి సంబంధించి 9,10 మరియు ఇంటర్మీడియట్ చదువుతున్న ప్రభుత్వ ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలలు మరియు కళాశాల విద్యార్థులకు తల్లికి వందనం అమౌంట్ లో కేంద్ర వాటా మరో 20 రోజుల్లో జమ కానుంది.
ఎస్సీ విద్యార్థులకు తల్లికి వందనం వాటా ఆగస్టు 15 నాటికి
రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉన్న అందరికీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం నిధులు జమ చేయగా ఎస్సీ విద్యార్థులకు మాత్రం పాక్షికం గానే పడ్డాయి. ఇందుకు కారణం వీరికి కొంత అమౌంట్ కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా జమ చేస్తుంది. ప్రస్తుతం తల్లికి వందనం పథకాన్ని కేంద్ర ప్రభుత్వ పథకానికి అనుసంధానం చేసి ఎస్సీ విద్యార్థులకు ప్రభుత్వం అమౌంట్ జమ చేస్తే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.
అయితే ఇప్పటికే ఎస్సీ విద్యార్థులకు కూడా పాక్షికంగా అమౌంటు అనేది పడటం జరిగింది. 9, 10 తరగతిలో చదువుతున్నటువంటి ఎస్సీ విద్యార్థులకు డే స్క్లాలర్ అయితే 10900 రూపాయలు, అదే వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకైతే 8800 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా జమ చేసింది. ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు కూడా డే స్కాలర్ లేదా వసతి గృహాల విద్యార్థులకు 5200 నుంచి 10972 రూపాయల వరకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. దీనిపై పలు విద్యార్థులు మీడియా ముందు తమకు పాక్షికంగానే అమౌంట్ పడిందని వాపోయారు. ఈ నేపథ్యంలో వీరికి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఎస్సీ విద్యార్థులకు కొంత అమౌంట్ ను కేంద్రం భరిస్తుందని తెలిపింది.
ఈ విధంగా కేంద్ర ప్రభుత్వ వాటాగా రావాల్సిన అమౌంట్ ను కేంద్ర ప్రభుత్వం మరో 20 రోజుల్లో జమ చేయనుంది. ఆగస్టు 15 నాటికి మొత్తం 3.93 లక్షల మందికి అమౌంట్ జమ అయ్యే అవకాశం ఉంది.
విద్యార్థులు తల్లి బ్యాంక్ ఆధార్ కి అనుసంధానం ఉన్నటువంటి అకౌంట్లో ఈ అమౌంట్ జమ కానుంది.
తల్లికి వందనం పథకానికి సంబంధించి స్టేటస్ తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
| ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్స్అప్ లో పని ఎందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
Leave a Reply