ఈ ఏడాది ఖరీఫ్ మరియు రబీ సీజన్లకు సంబంధించి కౌలు రైతులకు ప్రభుత్వ పథకాలు అందాలంటే తప్పనిసరిగా రెవిన్యూ శాఖ జారీ చేసే కౌలు గుర్తింపు కార్డు (CCRC) ను తప్పనిసరిగా తీసుకోవాలి.
ఈ కార్డు కలిగిన వారు మాత్రమే పంట నమోదు చేయడానికి అవకాశం కలుగుతుంది. పంట నమోదు ఆధారంగానే ప్రభుత్వం పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ మరియు ఇతర వ్యవసాయ పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
వీటన్నిటికీ సిసిఆర్సి కార్డు కలిగి ఉండాలి. ఈ కార్డు తో భూ యజమానులకు అందించే అన్ని ప్రభుత్వ పథకాల లబ్ధి కౌలు రైతులకు కూడా లభిస్తుంది. వీరికి ఈ క్రాప్ బుకింగ్ నమోదు చేసి ఈ పథకాలను వర్తింప చేస్తారు.
CCRC అప్లై చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్లు
1. భూ యజమాని రైతు పొలం పాస్ బుక్ జిరాక్స్ / 18 జిరాక్స్
2. భూ యజమాని రైతు ఆధార్ కార్డు జిరాక్స్
3. కౌలు రైతు ఆధార్ కార్డు జిరాక్స్
4. కౌలు రైతు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు-3
5. కౌలు కార్డ్
CCRC కార్డు ఉపయోగాలు
- BC, SC, ST, మైనారిటీలకు చెందిన కౌలు రైతులకు వై.ఎస్.ఆర్. రైతు భరోసా అమౌంట్ రావాలంటే ఈ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలి
- పండించిన పంటను కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవడానికి కూడా ఈ కార్డ్ ముఖ్యం
- పంట నష్టం జరిగినప్పుడు నష్టపరిహారం పొందటానికి కూడా ఈ కార్డు అవసరం
- ఈ కార్డు కలిగిన వారు మాత్రమె పంటల భీమా పొందటానికి అర్హులు
గమనిక : పై విషయాల మీద ఏవైనా సందేహాలు ఉంటే మీ సంబంధిత వాలంటీర్లను కానీ, VRO గారిని కానీ, రైతు భరోసా కేంద్రంలో ఉండే VAA గారిని కానీ సంప్రదించవచ్చు.
Leave a Reply