వైఎస్ఆర్ చేయూత పథకం 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రస్తుతం అప్లికేషన్స్ కొనసాగుతున్నాయి. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అప్లికేషన్స్ కోసం సెప్టెంబర్ 5 చివరి తేదీగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ కులాలకు చెందినటువంటి 45 నుంచి 60 సంవత్సరాలు లోపు మహిళలకు ప్రభుత్వం ప్రతిఏటా 18,750 ఆర్థిక సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే.
అయితే పలు కులాల వారికి సర్టిఫికెట్ల జారీలో కొంత జాప్యం లేదా ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ కులాల వారికి సర్టిఫికెట్ల నుంచి మినహాయింపు
వైయస్సార్ చేయూత పథకానికి సంబంధించి కింద ఇవ్వబడినటువంటి కులాల వారికి సర్టిఫికెట్లతో పని లేకుండా కేవలం సెల్ఫ్ డిక్లరేషన్ తో చేయూత అప్లికేషన్స్ తీసుకునేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
✓ బుడగ జంగం
✓ వాల్మీకి
✓ బెంతో ఒరియా
✓ యేనేటి కొండ
సామాజిక వర్గాలకు చెందిన వారికి క్యాస్ట్ సర్టిఫికెట్ జారీలో ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో, కుల దృవీకరణ పత్రంతో పని లేకుండా దరఖాస్తులో సెల్ఫ్ డిక్లరేషన్ పెడితే సరిపోతుందని ప్రభుత్వం పేర్కొంది.
YSR Cheyutha 2023 Applications last date: 05th September 2023
YSR Cheyutha 2023-24 Timelines
కొత్త దరఖాస్తుల నమోదుకు చివరి తేదీ – 5 సెప్టెంబర్ 2023
కొత్త మరియు పాత ధృవీకరణకు (verification) చివరి తేదీ – 11 సెప్టెంబర్ 2023
తాత్కాలిక అర్హత మరియు పునః విడుదల
ధృవీకరణ జాబితా – 13 సెప్టెంబర్ 2023
GSWS వద్ద అభ్యంతరాలు/ గ్రీవెన్స్‌లను స్వీకరించడం – సెప్టెంబర్ 13 నుండి 20 వరకు 2023
అర్హులైన లబ్ధిదారుల కోసం eKYC తీసుకోవడం – 14 సెప్టెంబర్ 2023
తుది జాబితా – 22 సెప్టెంబర్ 2023
అర్హులైన లబ్ధిదారులకు ప్రయోజనం విడుదల (ప్రభుత్వం జారీ చేసిన క్యాలెండర్ ప్రకారం)
– చివరి వారం సెప్టెంబర్ 2023
వైఎస్సార్ చేయూత స్టేటస్ మరియు ఇతర లింక్స్ కోసం కింది లింక్ పై క్లిక్ చేయండి
Leave a Reply