రాష్ట్రంలోని పేద మరియు మధ్య తరగతి ప్రజలకు ఆర్థికంగా సాయం చేయడం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. ప్రతి సంవత్సరం ఏ నెలలో ఏ ఏ పథకాలను అమలు చేయబోతున్నారో దానికి సంబంధించి ప్రభుత్వం సంక్షేమ క్యాలెండర్ ను ఇది వరకే విడుదల చేసింది.
ఈ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు నెలలో అమలు చేయనున్న సంక్షేమ పథకాలు ఏమిటో మనం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. ఈ నెలలో ప్రభుత్వం 5 పథకాల లబ్ధిదారులకు నిధులను విడుదల చేయనుంది.
ఆ పథకాల వివరాలు. [List of Welfare schemes to be implemented in August 2023]
- వైఎస్ఆర్ కల్యాణమస్తు / షాది తోఫా
- వైఎస్ఆర్ సున్నా వడ్డీ
- వైఎస్ఆర్ కాపు నేస్తం
- వైఎస్ఆర్ వాహన మిత్ర
- జగనన్న విద్యా దీవెన (రెండో విడత)
ఈ పథకాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం
వైఎస్ఆర్ కల్యాణమస్తు / షాది తోఫా
రాష్ట్రంలోని పేద మరియు మధ్య తరగతి కుటుంబాల్లోని ఆడపిల్లల వివాహ ఖర్చులకు ఆర్థిక సహాయాన్ని అందించడం కోసం ప్రభుత్వం వైయస్సార్ కల్యాణ మస్తు మరియు షాది తోఫా పథకాలను ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన వెరిఫికేషన్ మరియు ఆమోద ప్రక్రియ ఇప్పటికే సచివాలయాల్లో పూర్తి అయ్యింది.
తాజాగా ఈ నెల 8న కల్యాణమస్తు / షాది తోఫా నిధులను విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ కార్యక్రమం వాయిదా పడే అవకాశం ఉంది. ఆగస్టు మూడో వారంలో అమౌంట్ విడుదల చేసే అవకాశం ఉంది.
ఇది చదవండి: వాయిదా పడిన కళ్యాణమస్తు, ఆగస్టు మూడో వారంలో అమౌంట్
వైఎస్ఆర్ సున్నా వడ్డీ
గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలోని స్వయం సహాయక సంఘాలు తీసుకొన్న ఋణాలను సక్రమముగా తిరిగి చెల్లించుటకు, వారి పై పడిన వడ్డీ భారాన్ని తగ్గించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు వడ్డీ రాయితీ పథకాన్ని “వై. యస్. ఆర్ సున్నా వడ్డీ ” గా అమలుచేస్తున్నారు. నడపడానికి, మెరుగైన జీవనం సాగించడానికి దోహద పడుతుంది.
ఈ నెల 10న వైఎస్ఆర్ సున్నా వడ్డీ నిధులను విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
వైఎస్సార్ కాపు నేస్తం
రాష్ట్రంలోని కాపు వర్గానికి చెంది ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఆర్థిక సహాయాన్ని అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం వైయస్సార్ కాపు నేస్తం పథకాన్ని ప్రారంభించింది.
ఈ సంవత్సరానికి గాను కొత్త లబ్దిదారుల రిజిస్ట్రేషన్ , eKYC మరియు వెరిఫికేషన్ ఇప్పటికే మొదలైంది. త్వరలో ఈ పథకం నిధుల విడుదల తేదీని ప్రకటించనుంది.
వైఎస్సార్ వాహనమిత్ర
రాష్ట్రంలోని ఆటో, ట్యాక్సి, మ్యాక్సి డ్రైవర్ల వాహన మెయింటెనెన్స్ ఖర్చులు, ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్స్ వంటి ఇతర డాక్యుమెంట్లు పొందటానికి ప్రభుత్వం డ్రైవర్లకు పది వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తోంది.
ఈ సంవత్సరానికి గాను కొత్త లబ్దిదారుల రిజిస్ట్రేషన్ , eKYC మరియు వెరిఫికేషన్ ఇప్పటికే మొదలైంది. త్వరలో ఈ పథకం నిధుల విడుదల తేదీని ప్రకటించనుంది.
జగనన్న విద్యా దీవెన (రెండో విడత)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నత విద్య అభ్యసించే నిరుపేద విద్యార్థులకు భారాన్ని తొలగించడానికి జగనన్న విద్యా దీవెన పథకం పేరుతో విద్యార్థి తల్లులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నది.
ఈ ఏడాదికి గాను ఇప్పటికే మొదటి విడత అమౌంట్ ను ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పుడు రెండో విడత అమౌంట్ విడుదల కోసం కసరత్తు చేస్తోంది. త్వరలో సచివాలయాల ద్వారా బయోమెట్రిక్ ప్రక్రియ మొదలు కానుంది. దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ మరియు టైం లైన్స్ త్వరలో విడుదల అయ్యే అవకాశం ఉంది.
ఇది చదవండి: 5 నిమిషాల్లో మీ రేషన్ కార్డు లేదా రైస్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోండి
Leave a Reply