ఏపీలో అర్చకులకు రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుక ప్రకటించింది. శ్రీ శోభకృత నామ సంవత్సర ఉగాది పర్వదినాన దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని ఆలయాలలో పనిచేసే కొంతమంది అర్చకులను, వేద పండితులను ప్రభుత్వం సత్కరించనుంది.
వీరికి 10116 రూపాయల సంభావన కూడా ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఎవరికి వర్తిస్తుంది ? ఎవరు అర్హులు
రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో అర్చకులుగా పనిచేసే 62 ఏళ్ల పై బడిన అర్చకులను ఇందుకు ఎంపిక చేస్తారు.
రాష్ట్రంలో 26 జిల్లాలకు సంబంధించి ప్రతి జిల్లా లో 2 అర్చకులు, ఒక వేద పండితులను ఇందుకు ఎంపిక చేస్తారు.
సత్కారం అనగా ఏమి చేస్తారు? ఎవరి ఆధ్వర్యంలో?
ఉగాది పర్వ దినాన ఎంపిక చేసిన అర్చకులు, వేద పండితులకు ప్రశంస పత్రం, నూతన వస్త్రాలు, శాలువా తో సన్మానించి, 10116 సంభావన అందిస్తారు.
జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమానికి అర్చక సంక్షేమ నిధి నుంచి ప్రతి జిల్లాకి 50 వేల రూపాయల చొప్పున కేటాయిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.
ఇప్పటికే రాష్ట్రంలో ఉండే కేటగిరి-1 దేవస్థానాలలో పనిచేసే అర్చకులకు గౌరవ వేతనం రూ. 15,625, కేటగిరి-2లో అర్చకులకు గౌరవ వేతనం రూ. 10 వేలు ఇస్తూ వారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఇటీవల అర్చకులకు 100% వైద్య ఖర్చులు కూడా భరించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
Leave a Reply