ఏప్రిల్ నెలలో 18,19,20 & 25 ,26 తేదీలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు
సచివాలయ ఉద్యోగులు సచివాలయంలో అందుబాటులో ఉన్న అన్ని ఆధార్ సేవల గురించి తెలుపుతూ పబ్లిక్ అవేర్‌నెస్ కోసం మైకులు ఉపయోగించి లేదా చెత్త వ్యాన్‌ల ద్వారా లేదా వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రకటనలు చెయ్యాలి.
UIDAI సూచనల మేరకు గత పది సంవత్సరాలలో ఒకసారి కూడా ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకొని వారు గ్రామ సచివాలయాలను సందర్శించి డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలి. పదేళ్లు అయినా ఒక్క సారి కూడా అప్డేట్ చేసుకొని వారు రాష్ట్రంలో 1.53 కోట్ల మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఆన్లైన్ లో అయితే పూర్తి ఉచితంగా మీరే డాక్యుమెంట్ అప్డేట్ చేయవచ్చు. కింది ప్రాసెస్ చూడండి
సచివాలయం లో అందించే ఆధార్ సేవలు :
సేవలు | Service Charge |
---|---|
ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్ | 50/- |
ఆధార్ కు ఇమెయిల్ ఐడి లింక్ | 50/- |
బయోమెట్రిక్ (ఫోటో, ఐరిష్, ఫింగర్ ప్రింట్) అప్డేట్ | 100/- |
పేరు మార్పు ( Proof తప్పనిసరి ) | 50/- |
DOB మార్పు ( Proof తప్పనిసరి ) | 50/- |
జెండర్ మార్పు | 50/- |
ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ( POI & POA ఒరిజినల్ తప్పనిసరి) | 50/- |
చిరునామా మార్పు ( Proof తప్పనిసరి ) | 50/- |
కొత్తగా ఆధార్ నమోదు | Free |
Mandatory Biometric Update | Free |
3+ Anyone Service | 100 |