April 2025 Aadhar Camps in Sachivalayam: ఏప్రిల్ నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు

April 2025 Aadhar Camps in Sachivalayam: ఏప్రిల్ నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు

ఆధార్ కార్డు లేనివారికి ఆధార్ కార్డుల సమస్యలు ఉన్నవారికి శుభవార్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం April 2025 Aadhaar Special Camps Schedule విడుదల చేయడం జరిగింది . దానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులను విడుదల చేయడం జరిగింది అసలు ఈ ఆధార్ డ్రైవ్ లేదా క్యాంపు ఎప్పుడు జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది ?, ఏ సర్వీసులు చేస్తారు ?,  సర్వీస్ ఫీజు ఎంత ఉంటుంది ?,  అప్లికేషన్ ఫారాలు ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి ? ఇలా పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం.

Aadhaar Camps Schedule 

తేదీ 2025 ఏప్రిల్ 3 నుండి 4 వరకు మరలా 8 నుండి 11 వరకు ఆధార్ క్యాంపులు రాష్ట్రవ్యాప్తంగా షెడ్యూల్ Aadhaar Special Camps Schedule ప్రాప్తికి అంగన్వాడీ సెంటర్లలో / గ్రామా వార్డు సచివాలయాల్లో జరుగుతున్నాయి. 

కొత్త ఆధార్ ( బాల ఆధార్ )

  • DOB Certificate తప్పనిసరి
  • తల్లి / తండ్రి బయోమెట్రిక్ తప్పనిసరి
  • థంబ్ వేసే వారి MBU అయి ఉండాలి. ఆధార్ Active లొ ఉండాలి. DOB లొ ఉన్న పేరు & ఆధార్ లొ ఉన్న పేరు సరి పోవాలి.
  • కొత్త ఆధార్ కు, MBU అనగా తప్పనిసరి బయోమెట్రికు కు ఫీజు ఉచితం.

ఏప్రిల్ నెల ఆధార్ క్యాంపులకు సంబంధించిన ఉత్తర్వులు

ఆధార్ క్యాంపులలో అందించే సర్వీసులు :

  • కొత్తగా ఆధార్ కార్డు నమోదు
  • 5 సంవత్సరాలు దాటిన పిల్లలకు బయోమెట్రిక్ అప్డేట్,
  • ఆధార్ కార్డు పొంది పది సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్కరి డాక్యుమెంట్ అప్డేట్,
  • బయోమెట్రిక్ అప్డేట్ చేసుకొని చాలా ఏళ్లయిన వారికి బయోమెట్రిక్ అప్డేట్ ముఖ్యంగా ఈ సర్వీసులు చేయడం జరుగును.
  • మొబైల్ నెంబర్ లింకు, చిరునామా మాకు, పుట్టిన తేదీలో కరెక్షన్ ఈ సర్వీసులు కూడా జరుగును.

April Month Aadhar Camps Guidelines

  • ముఖ్యంగా కొత్త ఆధార్ ఎన్రోల్మెంట్,  ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ మరియు ఆధార్ తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ చేయడం జరుగును.
  • క్యాంపు సమయంలో PS Gr-VI ( DA ) / WEDPS వారి స్థానంలో ఇతర సచివాలయ సిబ్బందిని In-Charge వేస్తారు.
  • ఎక్కడైతే క్యాంప్ ఉంటుందో ఆ సచివాలయ పరిధిలో ఇద్దరు సచివాలయ సిబ్బంది PS Gr-VI (DA) / WEDPS వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్కు గాను సహాయపడతారు.
  • క్యాంపు మొత్తంలో  109 పైగా సర్వీసులు చేసినచో ₹500 /-, 200కు పైగా సర్వీసులు చేసినచో ₹1000/- లు PS Gr-VI (DA) / WEDPS వారికి ఇవ్వటం జరుగును.
  • క్యాంపు సమయంలో జిల్లా కలెక్టర్లు జిల్లా పరిధిలో ఉన్నటువంటి అందరూ ఆధార్ PS Gr-VI(DA) / WEDPS వారి డిప్యూటేషన్ నుండి విడుదల చేస్తారు.

Other Details

సచివాలయ ఉద్యోగులు సచివాలయంలో అందుబాటులో ఉన్న అన్ని ఆధార్ సేవల గురించి తెలుపుతూ పబ్లిక్ అవేర్‌నెస్ కోసం మైకులు ఉపయోగించి లేదా చెత్త వ్యాన్‌ల ద్వారా లేదా వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రకటనలు చెయ్యాలి.

UIDAI సూచనల మేరకు గత పది సంవత్సరాలలో ఒకసారి కూడా ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకొని వారు గ్రామ సచివాలయాలను సందర్శించి డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలి. పదేళ్లు అయినా ఒక్క సారి కూడా అప్డేట్ చేసుకొని వారు రాష్ట్రంలో 1.35 కోట్ల మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

క్యాంప్ సమయం లో కనీసం 100 నమోదులు/అప్‌డేట్‌లను చేసిన వారికి , మొబైల్ క్యాంప్ నిర్వహణ కోసం హార్డ్‌వేర్ పరికరాల రవాణా కోసం ఏదైనా ఖర్చు చేస్తే, GVWV&VSWS డిపార్ట్‌మెంట్ ద్వారా ఆధార్ ఆపరేటర్‌లకు (డిజిటల్ అసిస్టెంట్/ WEDPS) రూ.500 అందజేస్తుంది.

Also Read

ఆన్లైన్ లో అయితే పూర్తి ఉచితంగా మీరే డాక్యుమెంట్ అప్డేట్ చేయవచ్చు. కింది ప్రాసెస్ చూడండి

సచివాలయంలో అందించే ఆధార్ సేవలు :

సేవలుService Charge
ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్50/-
ఆధార్ కు ఇమెయిల్ ఐడి లింక్50/-
బయోమెట్రిక్ (ఫోటో, ఐరిష్, ఫింగర్ ప్రింట్) అప్డేట్100/-
పేరు మార్పు ( Proof తప్పనిసరి )50/-
DOB మార్పు ( Proof తప్పనిసరి )50/-
జెండర్ మార్పు50/-
ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ( POI & POA ఒరిజినల్ తప్పనిసరి)50/-
చిరునామా మార్పు ( Proof తప్పనిసరి )50/-
కొత్తగా ఆధార్ నమోదుFree
Mandatory Biometric UpdateFree
3+ Anyone Service100

Documents Required For Aadhaar Services in Aadhaar Camps

  • పిల్లలకు బాల ఆధార్ / కొత్త ఆధార్ – బర్త్ సర్టిఫికెట్ + తల్లి / తండ్రి ఆధార్  
  • 5-7 , 15-17 సం. మధ్య వయసు ఉండి తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ – ఆధార్ కార్డు 
  • ఆధార్ – మొబైల్ నెంబర్ లింక్ – ఆధార్ కార్డు + మొబైల్ నెంబర్ 
  • ఆధార్ – ఇమెయిల్ లింక్ – ఆధార్ కార్డు + ఇమెయిల్ ఐ డి 
  • పేరు మార్పు – ఆధార్ కార్డు + SSC Memo / Other Original Memo / పాన్ కార్డు / DL / పాస్ పోర్ట్ / రేషన్ కార్డు – Photo ఉన్న వారికి / ఆరోగ్య శ్రీ కార్డు – ఫోటో ఉన్నవారికి etc.. 
  • చిరునామా మార్పు – ఆధార్ కార్డు + ఓటర్ కార్డు / రేషన్ కార్డు – ఫోటో ఉన్న వారికి  / ఆరోగ్య శ్రీ కార్డు – ఫోటో ఉన్న వారికి / వికలాంగుల కార్డు / Standard Document etc..
  • పుట్టిన తేదీ మార్పు – ఆధార్ కార్డు + [ For Age Above 18 years  – SSC / Inter / Degree / Other Original Memo ] or  [ For Age Below18 years  – పుట్టిన తేదీ ఒరిజినల్ మెమో ]
  • లింగము అప్డేట్ – ఆధార్ కార్డు 
  • బయోమెట్రిక్ అప్డేట్ ( ఫోటో + బయోమెట్రిక్ + ఐరిష్ అప్డేట్ ) – ఆధార్ కార్డు 
  • 7,17 సం. వయసు నిండి తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ – ఆధార్ కార్డు 
  • డాక్యుమెంట్ అప్డేట్ – ఆధార్ కార్డు + POI + POA 

Note : అన్ని సర్వీస్ లకు తప్పనిసరిగా ఆధార్ అప్డేట్ అవ్వవల్సిన వ్యక్తి హాజరు అవ్వాలి . వీటితో పాటు ఇంకా చాలా డాకుమెంట్స్ ఉంటాయి .

Documents Required For New Child Aadhaar 

  1. QR Code ఉన్న పుట్టిన తేదీ సర్టిఫికెట్ 
  2. దరఖాస్తు ఫారం 
  3. బిడ్డ ను క్యాంపు జరిగే ప్రదేశానికి తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరు కలిసి తీసుకువెళ్లాలి .
  4. తల్లి లేదా / మరియు తండ్రి ఆధార్ కార్డు 

Tips to New Baal Aadhaar Enrolment For Child 

  • కొత్తగా ఆధార్ నమోదు చేయడానికి తెచ్చినటువంటి పుట్టిన సర్టిఫికెట్ ఒరిజినలా ?  కాదా ? అని CRS సర్టిఫికెట్ అయితే  స్కాన్ ద్వారా గాని మీసేవ సర్టిఫికెట్ అయితే మీ సేవ సైట్ లో అప్లికేషన్ స్టేటస్ ద్వారా గాని చెక్ చేయవలెను .
  •  ఆధార్ నమోదు చేయుటకు పిల్లలతో పాటు ఎవరు వస్తున్నారు అని  తప్పనిసరిగా చూడవలెను , ఎందుకంటే ఎవరు వస్తున్నారో వారి ప్రకారం కొత్తగా ఆధార్ నమోదు ప్రక్రియ ఉంటుంది.
  • బిడ్డ ఆధార్ C/O లో తల్లి పేరు , తల్లి ఆధార్ అడ్రస్ రావాలి అంటే :  ఆధార్ కొత్తగా నమోదుకు బిడ్డతో తల్లి ఉండాలి . తల్లి యొక్క ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండవలెను.  బిడ్డ యొక్క C/O సెక్షన్లో తల్లి యొక్క ఆధార్ కార్డులో పేరు నమోదు చేయాలి . తల్లి యొక్క ఆధార్ కార్డులో ఉన్నటువంటి లేటెస్ట్ అడ్రస్ ను అనగా చిరునామా మాత్రమే బిడ్డ యొక్క అడ్రస్ సెక్షన్లో నమోదు చేయాలి . HOF సెక్షన్ లో తల్లి పేరు , తల్లి ఆధార్ నెంబర్ నమోదు చేయాలి .HOF Biometric  వద్ద తల్లి బయోమెట్రిక్ నమోదు చేయాలి. . అలాకాకుండా తండ్రి పేరు, తండ్రి ఆధార్ కార్డులో ఉన్నటువంటి చిరునామాను నమోదు చేయరాదు .HOF సెక్షన్ లో తండ్రి పేరు రాయకూడదు . HOF Biometric వద్ద తండ్రి బియోమెట్రిక్ వేయరాదు .
  • బిడ్డ ఆధార్ C/O లో తండ్రి పేరు , తండ్రి ఆధార్ అడ్రస్ రావాలి అంటే :  ఆధార్ కొత్తగా నమోదుకు బిడ్డతో తండ్రి ఉండాలి . తండ్రి యొక్క ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండవలెను.  బిడ్డ యొక్క C/O సెక్షన్లో తండ్రి యొక్క ఆధార్ కార్డులో పేరు నమోదు చేయాలి . తండ్రి యొక్క ఆధార్ కార్డులో ఉన్నటువంటి లేటెస్ట్ అడ్రస్ ను అనగా చిరునామా మాత్రమే బిడ్డ యొక్క అడ్రస్ సెక్షన్లో నమోదు చేయాలి . HOF సెక్షన్ లో తండ్రి పేరు , తండ్రి ఆధార్ నెంబర్ నమోదు చేయాలి .HOF Biometric  వద్ద తండ్రి బయోమెట్రిక్ నమోదు చేయాలి. . అలాకాకుండా తల్లి పేరు, తల్లి  ఆధార్ కార్డులో ఉన్నటువంటి చిరునామాను నమోదు చేయరాదు .HOF సెక్షన్ లో తల్లి పేరు రాయకూడదు . HOF Biometric వద్ద తల్లి బియోమెట్రిక్ వేయరాదు.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page