గ్రామ / వార్డు సచివాలయాలలో పని చేస్తున్న వాలంటీర్ల తొలగింపుకు సంబంధించి సచివాలయ శాఖ కొత్త G. O ని విడుదల చెయ్యడం జరిగింది.
G.O యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి
గ్రామ వార్డు సచివాలయాలలో పని చేస్తున్న వాలంటీర్లు ప్రభుత్వం ఆదేశించిన విధులను అతిక్రమించినా లేదా ఏదైనా అనైతిక కార్యకలాపాలకు పాల్పడినా, అటువంటి వారిని వెంటనే వాలంటీర్ పోస్ట్ నుంచి తొలగించాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు సచివాలయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఎవరిని తొలగిస్తారు? ఏ ప్రాతిపదికన వలన తొలగిస్తారు?
వాలంటీర్స్ పనితీరు లేదా కింద ఇవ్వబడిన ఏవైనా అతిక్రమణల ఆధారంగా తొలగించడానికి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కింది వాటిలో ఏ ఒక్క దానిలో పేరు ఉన్నా వారిని తొలగించే అవకాశం ఉంటుంది.
- corruption ( అవినీతి )
- lrresponsible and not discharging services properly. (వృత్తి పట్ల బాధ్యత రహితం )
- lmproper civic behaviour.(సరైన ప్రవర్తన లేకపోవడం )
- Moral turpitude (నైతిక విలువలు పాటించకపోవడం )
- Committed and irregularity (ఏదైనా అతిక్రమణలకు పాల్పడినా)
Note
పై వాటిలో ఏ ఒక్క కారణం వలన అయిన వాలంటీర్స్ ని తొలగించేందుకు ఉత్తర్వులు ఇచ్చారు.
ఇది చదవండి: వాలంటీర్ అవార్డ్స్ ఎప్పుడు ఇస్తారు? ఇప్పటి వరకు ఉన్న లిస్ట్
వాలంటీర్లను ఏ పద్ధతిలో తొలగిస్తారు?
Filed level లో ముందుగా పంచాయతీ సెక్రటరీ / అడ్మిన్ నుంచి వాలంటీర్స్ కు నోటీసు అందించడం జరుగుతుంది. వాలంటీర్స్ తాము ఎటువంటి తప్పులు/ అతిక్రమణలకు పాల్పడలేదని వివరణ తో పాటు సాక్ష్యం చూపించి నిరూపించుకోవాలి.
పంచాయతీ సెక్రటరీ నిర్వహించే enquiry రిపోర్ట్ పైన ఈ ప్రక్రియ మొత్తం ఆధారపడి ఉంటుంది.
తదుపరి స్టెప్ లో వాలంటీర్స్ ని తొలగించడానికి అవకాశం ఉంటుంది.
MPDO నుండి Disengage orders వస్తే వాలంటీర్స్ తిరిగి defend చేసుకోవచ్చు.
ప్రభుత్వం Volunteer Disengement సంబంధించి జారీ చేసిన GO కాపీని కింది లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి
ఇది చదవండి: వాలంటీర్ సంబంధించి అన్ని లేటెస్ట్ apps మరియు లింక్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Leave a Reply