మే 19న గ్రామ వార్డు వాలంటీర్లకు అవార్డులు, నగదు పురస్కారాలు..కీలక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం

మే 19న గ్రామ వార్డు వాలంటీర్లకు అవార్డులు, నగదు పురస్కారాలు..కీలక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు వాలంటీర్లుగా పనిచేస్తున్న వారికి గత రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం సేవా అవార్డుల ను ప్రధానం చేస్తున్న విషయం తెలిసిందే, ఇందులో భాగంగా వరుసగా మూడో ఏడాది ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం మే 19న నిర్వహించనుంది.

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి మే 19న వాలంటీర్లకు అవార్డుల ప్రధానొత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించనున్నారు.

అయితే ఇందుకు సంబంధించి గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ లక్ష్మీశ , జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలను జారీ చేశారు.

అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా Volunteer Appreciation Program

మే 19న ముఖ్యమంత్రి ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత నుంచి నెల రోజుల్లో ఈ సన్మాన కార్యక్రమం పూర్తి చేయాలని ఆదేశించారు.

ఇందుకు సంబంధించినటువంటి షెడ్యూల్ ను మే 18 నాటికి ఖరారు చేయాలని తెలిపారు.

ప్రతి రోజు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం లో రెండు సచివాలయాల చొప్పున ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు.

అదేవిధంగా ఈ కార్యక్రమానికి కావలసినటువంటి శాలువాలు బ్యాడ్జీలు, మెడల్స్, సర్టిఫికెట్లు ఇప్పటికే జిల్లా హెడ్ క్వార్టర్స్ కు పంపించినట్లు తెలిపారు. వీటిని షెడ్యూల్ ప్రకారం ఆయా సచివాలయాలకు ముందుగానే చేర్చాలని ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది.

వాలంటీర్లకు మూడు క్యాటగిరిలలో అనగా సేవా మిత్రా (₹10000), సేవ రత్న (₹20000) , సేవ వజ్ర (₹30000) పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నగదు పురస్కారాలు మరియు సత్కారాలు చేస్తున్న విషయం తెలిసిందే.

సేవా అవార్డులకు సంబంధించి కలెక్టర్లకు జారీ చేసిన ఆదేశాలు కింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు

ఇప్పటివరకు అందుబాటులో ఉన్నటువంటి సేవా అవార్డుల లిస్ట్

గ్రామ వార్డు వాలంటీర్లకు సంబంధించి సేవ అవార్డుల లిస్టు కింది లింక్ లో చెక్ చేయండి

వాలంటీర్లను ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు?అర్హతలు ఏంటి?

వాలంటీర్ అవార్డులను మొత్తం మూడు రకాలుగా ఇవ్వటం జరుగుతుంది.

  1. సేవా మిత్ర (Seva Mitra)
  2. సేవా రత్న (Seva Ratna)
  3. సేవా వజ్ర (Seva Vajra)

సేవా మిత్ర (Seva Mitra)

అర్హతలు : 1 సంవత్సరం పూర్తి గా వాలంటీర్ గా పని చేసి ఉండాలి. వారిపై ఎటువంటి ఫిర్యాదులు ఉండరాదు. సేవా రత్న, వజ్ర లో ఉన్నవారు మినహా అర్హత ఉన్న మిగిలిన వాలంటీర్లు అందరికీ ఈ అవార్డ్ ఇస్తారు

నగదు : ₹10,000/-

సేవా రత్న (Seva Ratna)

ఎవరికి ఇస్తారు : మండలం / మునిసిపాలిటీ కు 5 వాలంటీర్లను మరియు మునిసిపల్ కార్పొరేషన్ కు 10 వాలంటీర్లకు అందిస్తారు. 

అర్హతలు :

  1. 1 సంవత్సరం పూర్తి గా వాలంటీర్ గా పని చేసి ఉండాలి.
  2. వారిపై ఎటువంటి ఫిర్యాదులు ఉండరాదు.
  3. హౌస్ హోల్డ్ రీ సర్వే మరియు పెన్షన్ పంపిణి ను పరిగణలోకి తీసుకుంటారు. 

నగదు : ₹20,000/- తో పాటు మెడల్, బ్యడ్జ్, శాలువా, సర్టిఫికేట్ ఇస్తారు

సేవా వజ్ర (Seva Vajra)

ఎవరికి ఇస్తారు : నియోజకవర్గానికి 5 వాలంటీర్లకు అందిస్తారు. 

అర్హతలు :

  1. 1 సంవత్సరం పూర్తి గా వాలంటీర్ గా పని చేసి ఉండాలి.
  2. వారిపై ఎటువంటి ఫిర్యాదులు ఉండరాదు.
  3. హౌస్ హోల్డ్ రీ సర్వే మరియు పెన్షన్ పంపిణి ను పరిగణలోకి తీసుకుంటారు. 

నగదు : ₹30,000/- తో పాటు మెడల్, బ్యడ్జ్, శాలువా, సర్టిఫికేట్ ఇస్తారు

అవార్డులకు సంబంధించి ప్రభావితం చేసే ఇతర అంశాలు

  • వాలంటీర్ల పనితీరు సంతృప్తికరంగా ఉండాలి
  • గడపగడపకు మన ప్రభుత్వం లో వాలంటీర్ల భాగస్వామ్యం
  • మొదటి రోజే పూర్తిస్థాయిలో పెన్షన్ పంపిణీ
  • వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి పారదర్శకంగా లబ్ధిదారుల గుర్తింపు మరియు వివరాల సేకరణ
  • వాలంటీర్ పట్ల వారి యొక్క క్లస్టర్ పరిధిలో ప్రజలు ఏమాత్రం సంతృప్తికరంగా ఉన్నారు

వీటితోపాటు బయోమెట్రిక్ హాజరు, సర్వే చేయు విధానం, ప్రజలకు ఏమాత్రం అందుబాటులో ఉన్నారు వంటివి కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది.

Studybizz Opinion Poll:

[TS_Poll id=”4″]

9 responses to “మే 19న గ్రామ వార్డు వాలంటీర్లకు అవార్డులు, నగదు పురస్కారాలు..కీలక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం”

  1. Nandhini Avatar
    Nandhini

    వాలంటీర్స్ అనేది జగనన్న తలపెట్టిన మహోన్నత కార్యక్రమం.. దీనివలన లంచాలు తగ్గాయి. ప్రజలకు శ్రమ లేకుండా సులభతరం గా పనులు జరుగుతున్నాయి. ప్రతి పేదవాడు లబ్ది పొదుతున్నాడు. అలాంటి వాలంటీర్స్ కి వేతనాలు సరిపోవడం లేదు. జగనన్న మంచి మనసుతో.. వాలంటీర్స్ కి ఏదోకటి చేస్తాడు అని వాలంటీర్స్ అందరూ ఎదురు చూస్తున్నారు.. మా జీవితాలు మారుతాయి అని ఆశగా ఉన్నారు. వాలంటీర్స్ కి వేతనాలు పెంచడం. మరియు వారికీ ఉద్యోగం హామీ ఇస్తే.. తరాతరాలకు చెప్పుకొని అన్న వెన్నటే ఉంటారు 2లక్షల 30వేల వాలంటీర్స్… నా ఇచ్చిన రిక్వెస్ట్…

  2. prakash raj reddy Avatar
    prakash raj reddy

    Pls update Fullu district wise list…all districts are not available in our web site…2

  3. Suresh Avatar
    Suresh

    2.30 లక్షల మంది నిరుద్యోగులు ఈ వాలంటీర్ ఉద్యోగమును నమ్ముకున్నారు.వారికి ఇచ్చే వేతనం ఏమాత్రం సరిపోదు. వారికి వేరే ఉపాధి లేదు కావున దయచేసి వారికి వేతనాలు పెంచాలని ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని ఈ నిరుద్యోగుల కుటుంబాలకు ఆసరా కల్పించినట్లు అయితే ప్రతి ఇంటా జగన్ మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకొని పూజలు చేస్తారు.ఇది నా అభిప్రాయం మాత్రమే

  4. Pagadala jagan Avatar
    Pagadala jagan

    Jaganmohan Reddy’s administration is providing safe administration, this administration voluntary system is working super.

  5. Khairun Avatar
    Khairun

    Good

  6. Sasidharredddy s Avatar
    Sasidharredddy s

    Upto to in your website not place any district volunters award list please update your web site

    1. schemesstudybizz Avatar
      schemesstudybizz

      Only Kovvur division is available

  7. M. Usha Avatar
    M. Usha

    💯%nayam jaragaledu

    1. S. Usha Avatar
      S. Usha

      అందరికీ నమస్కారం నా పేరు ఉష వాలంటీరు నేను వాలంటీర్ అవార్డ్స్ అందరికీ సమానంగా ఇస్తే బాగుంటది అందరికీ సమానంగా ఇవ్వకుండా చెయ్యని వారి పేరులు అటెండెన్స్ లేని పేరులు అలా వస్తున్నయి వజ్రాలు రత్నాలు ఇస్తున్నారు అలా ఇవ్వటం వలన చేసే వారికి ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది దయచేసి జగనన్న ఇస్తే సమానంగా ఇవ్వన్నా మాకు గౌరవ వేతనం కూడా కొంచెం పెంచండి ప్రభుత్వం దృష్టిలో చేసే పని కొంచెం అవుతుంటే బయట మాతో చేపించే పని సచివాలయాలలో చేసే వాళ్ల కన్నా మాకే ఎక్కువ పని ఉంటుంది మన ప్రభుత్వం కోసం మేము ఎంత పనైనా చేస్తాము జగనన్న మమ్ములను కొంచెం గుర్తించు. ఈ అవార్డులు మటుకు ఎలా వస్తున్నాయో తెలియటం లేదు. కానీ వర్క్ చేయని వాళ్ళకి వస్తున్నాయి వర్క్ చేసేవాళ్ళం చాలా బాధపడాల్సి వస్తుంది అందరికీ సమానంగా ఇవ్వండి 10000.

You cannot copy content of this page