గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్విభజించటం జరిగింది. అయితే ఈ జిల్లాలలో కొన్ని అభ్యంతరాలు మరియు మరికొన్ని కొత్త జిల్లాల డిమాండ్లు వచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాలు మరియు మండలాల స్థాయిలో పునర్విభజన చేసేందుకు కార్యచరణ రూపొందించడం జరిగింది. ఈ ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం ఉన్నటువంటి 26 జిల్లాలను 32 జిల్లాలుగా విభజించడం అదేవిధంగా పలు ప్రాంతాలకు సంబంధించి ప్రస్తుత జిల్లాల విషయంలో మార్పులు చేర్పులు చేయనుంది. ప్రతిపాదిత 32 జిల్లాలు మరియు వాటి కింద వచ్చేటటువంటి నియోజిక వర్గాలు ఈ విధంగా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కొత్త జిల్లాల ఏర్పాటు, సరిహద్దులు మార్పు, మండలాలు, గ్రామాల పేర్లు మార్పుపై కసరత్తు చేస్తోంది. ఈ మేరకు మంత్రలుతో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది.. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, మున్సిపల్‌శాఖ మంత్రి పొంగూరు నారాయణ, రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, నీటి వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, హోంమంత్రి వంగలపూడి అనిత, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌లు కమిటీలో ఉన్నారు.. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఈ కమిటీ మొదటి సమావేశం 13వ తేదీన సచివాలయంలో జరుగుతుంది.
ఏపీలో కొత్తగా మరో ఆరు జిల్లాలు ఏర్పాటు కాబోతున్నట్లు సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తు్న్నారు.. ఈ మేరకు ఓ లిస్ట్ చక్కర్లు కొడుతోంది. కొత్తగా పలాస, అమరావతి, మార్కాపురం, గూడూరు, మదనపల్లి, ఆదోని జిల్లాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని జోరుగు ప్రచారం జరుగుతోంది. అంటే జిల్లాల సంఖ్య మొత్తం 32కు చేరుతుందని చెబుతున్నారు. ఏపీలో కొత్త (ప్రతిపాదిత) జిల్లాలు.. వాటి పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలు అంటూ ఓ లిస్ట్‌ను కూడా వైరల్ చేస్తున్నారు
ప్రతిపాదిత 32 జిల్లాలు ఇవే..
ఆంధ్రప్రదేశ్ (ప్రతిపాదిత) 32 కొత్త జిల్లాలు వాటి పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలు
| S.No | జిల్లా | నియోజకవర్గాలు |
|---|---|---|
| 1 | పలాస | ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం |
| 2 | శ్రీకాకుళం | శ్రీకాకుళం, ఆముదాలవలస, నరసన్నపేట, ఎచ్చెర్ల, రాజాం |
| 3 | పార్వతీపురం | పార్వతీపురం, కురుపాం, సాలూరు, పాలకొండ |
| 4 | విజయనగరం | విజయనగరం, చీపురుపల్లి, గణపతినగరం, నెల్లిమర్ల, శృంగవరపుకోట, బొబ్బిరి |
| 5 | విశాఖపట్నం | భీమిలి, విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్, విశాఖ నార్త్, విశాఖ సౌత్, గాజువాక, పెందుర్తి |
| 6 | అరకు | అరకు, పాడేరు, మాడుగుల |
| 7 | అనకాపల్లి | అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, యలమంచిలి, పాయకరావుపేట, తుని |
| 8 | కాకినాడ | ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, రామచంద్రపురం |
| 9 | తూర్పు గోదావరి | అనపర్తి, రాజానగరం, రంపచోడవరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు |
| 10 | అమలాపురం | రాజోలు, ఆసులాపురం, ముమ్మిడివరం, గన్నవరం, మండపేట, కొత్తపేట |
| 11 | వెస్ట్ గోదావరి | తణుకు, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం |
| 12 | ఏలూరు | గోపాలపురం, పోలవరం, చింతలపూడి, దెందులూరు, ఉంగుటూరు, ఏలూరు |
| 13 | కృష్ణా మచిలీపట్నం | కైకలూరు, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు |
| 14 | NTR జిల్లా | తిరువూరు, నూజివీడు, గన్నవరం, పెనమలూరు, విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, మైలవరం |
| 15 | అమరావతి | పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, జగ్గయ్యపేట, నందిగామ |
| 16 | గుంటూరు | తెనాలి, ప్రత్తిపాడు, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, పొన్నూరు |
| 17 | బాపట్ల | రేపల్లె, వేమూరు, బాపట్ల, చీరాల, పర్చూరు |
| 18 | పల్నాడు నరసరావుపేట | చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల, వినుకొండ |
| 19 | మార్కాపురం | ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, దర్శి |
| 20 | ప్రకాశం | అద్దంకి, సంతనూతలపాడు, ఒంగోలు, కొండెపి, కందుకూరు |
| 21 | SPSR నెల్లూరు | కావలి, కొవ్వూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఆత్మకూరు, ఉదయగిరి |
| 22 | గూడూరు | సర్వేపల్లి, వెంకటగిరి, గూడూరు, సూళ్లూరుపేట |
| 23 | శ్రీ బాలాజీ తిరుపతి | శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి, తిరుపతి, చంద్రగిరి |
| 24 | చిత్తూరు | పూతలపట్టు, చిత్తూరు, గంగాధర నెల్లూరు, పలమనేరు, కుప్పం |
| 25 | మదనపల్లి | పీలేరు, పుంగనూరు, మదనపల్లి, తంబళ్లపల్లి |
| 26 | హిందూపురం | కదిరీ, ధర్మవరం, పుట్టపర్తి, పెనుగొండ, మడకశిర, హిందూపురం |
| 27 | అనంతపురం | రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, రవకొండ, అనంతపురం, రాస్తాడు, లింగనమల, తాడిపత్రి |
| 28 | ఆదోని | పత్తికొండ, అలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం |
| 29 | కర్నూలు | వందికొట్కూరు, కర్నూలు, డోన్, కోడుమూరు |
| 30 | నంద్యాల | శ్రీశైలం, నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, పాణ్యం |
| 31 | YSR కడప | జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం, పులివెందుల, కడప |
| 32 | రాజంపేట అన్నమయ్య | బద్వేలు, రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి |



