ఆంధ్రప్రదేశ్ లో ఇల్లు లేని పేదలు ఉండకూడదు అనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఉచిత ఇంటి స్థలాలు పంపిణీ చేసేలా ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతంలో అయితే మూడు సెంట్ల ఇళ్ల స్థలాన్ని ఇచ్చేందుకు కార్యచరణ రూపొందించింది. ఏపీలో ఉచిత ఇంటి స్థలాలకు సంబంధించి అర్హతలు విధివిధానాలు తెలుపుతూ జీవో నెంబర్ 23 ను ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. మరి ఏపీలో ఉచిత ఇంటి స్థలం పొందాలంటే అర్హతలు (housing scheme Andhra Pradesh eligibility) ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఏపీలో ఉచిత ఇంటి స్థలాల అర్హతలు ఇవే
ఆంధ్రప్రదేశ్ లో ఇల్లు లేదా ఇంటి స్థలం లేదంటే నీరు పేదలు ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం గ్రామ వార్డు సచివాలయాలలో ఆప్షన్ కలదు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1.17 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లో అయితే మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో అయితే రెండు సెంట్లు స్థలం ఇవ్వడం జరుగుతుంది. అయితే పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు స్థలం లేనిచో ప్రభుత్వం టిడ్కో ఇల్లు నేరుగా ఇచ్చే అవకాశం ఉంటుంది.
మరి ఏపీలో ఉచిత ఇంటి స్థలం పొందాలంటే అర్హతలు ఈ విధంగా ఉన్నాయి
అర్హతలు
- లబ్ధిదారుడు ఆంధ్ర ప్రదేశ్ శాశ్వత నివాసి అయి ఉండాలి.
- ఉచితంగా ఇంటి స్థలాలు ఇల్లు లేదా ఇంటి స్థలం లేని పేదవారు మాత్రమే అర్హులు.
- కుటుంబంలో ఎవరి పేరు మీద ఎటువంటి స్థలం కానీ లేదా ఇల్లు కానీ ఉండరాదు.
- దరఖాస్తుదారుడు తప్పనిసరిగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి.
- గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. తెల్ల రేషన్ కార్డు మరియు సరైన ఆధార్ కార్డు తీసుకువెళ్లాలి.
- గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల భూమి ఇస్తారు.
- పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు భూమి ఇస్తారు.
- కుటుంబ ఆదాయం ₹10,000 (గ్రామీణ), ₹12,000 (పట్టణ) లోపల ఉండాలి.
- ఇంటి స్థలం కేటాయించిన తర్వాత రెండు ఏళ్లలోపు కచ్చితంగా ఇంటి నిర్మాణం చేపట్టాలి.
- కేటాయించబడిన స్థలం అమ్మటం నిషేధం.
- కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చడం జరుగుతుంది. ముఖ్యంగా ఇంటిలో ఉండే మహిళ పేరుమీద ఇంటి పట్టా ఇవ్వడం జరుగుతుంది.
అనర్హతలు
- ప్రభుత్వ ఉద్యోగులు/ రిటైర్డ్ అయి పెన్షన్ పొందే వారు అర్హులు కారు.
- ఇన్కమ్ టాక్స్ చెల్లింపుదారులు అనర్హులు.
- ఇప్పటికే భూమి ఉంటే అనర్హులు.
- గతంలో వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా ఇంటి స్థలం, ఇల్లు పొందితే ఈ పథకానికి అనర్హులు.
- మైనర్లకు ఈ పథకం వర్తించదు.
ఉచిత ఇంటి స్థలాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ మరియు ప్రాసెస్
ఉచిత ఇంటి స్థలాలకు పైన తెలిపిన విధంగా అర్హత ఉన్నచో సదరు దరఖాస్తుదారుడు గ్రామ వార్డు సచివాలయాన్ని సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు చేసుకున్న తర్వాత గ్రామ వార్డు సచివాలయ స్థాయిలో పరిశీలన ఉంటుంది. ఆ తర్వాత కలెక్టర్ స్థాయి వరకు వివిధ దశల్లో అప్లికేషన్ చేరుతుంది. సమగ్ర పరిశీలన మరియు ఆమోదం తర్వాత సదరు లబ్ధిదారులకు స్థలం కేటాయించడం జరుగుతుంది.
లబ్ధిదారుల జాబితా గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శించడం జరుగుతుంది. ఏమైనా అభ్యంతరాలు ఉంటే గ్రామసభల్లో తెలపాల్సి ఉంటుంది.
మరి నీ వివరాలకు మీ సమీప గ్రామ వార్డు సచివాలయాల్లో సంప్రదించవచ్చు.
|ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ పొందేందుకు వాట్సాప్ లో జాయిన్ అవ్వండి. క్లిక్ చేయండి
Leave a Reply