రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా పథకానికి సంబంధించి ఈ ఏడాది కొత్తగా అర్హులైనటువంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.. కొత్తగా దరఖాస్తు చేసుకునే గడువును మరోసారి పొడిగించడం జరిగింది.
అర్హులైన రైతులు తమ ఆధార్ జిరాక్స్ , 1బి జిరాక్స్ తో మీ దగ్గరలో ఉండే రైతు భరోసా కేంద్రంలో సంప్రదించవచ్చు. అంతే కాకుండా ఏ కుటుంబంలో అయితే రైతు భరోసా పొందే లబ్ధిదారుడు మరణిస్తారో అటువంటి వారి spouse /legal heir [డెత్ అయిన వారి భార్య లేదా భర్త లేదా చట్ట రీత్యా వారసులు ] రైతు భరోసా కి అప్లై చేసుకోవచ్చు.అయితే ఇటువంటి అప్లికేషన్స్ కి తప్పనిసరిగా డెత్ సర్టిఫికెట్ తప్పనిసరి.
అదేవిధంగా, రైతు భరోసా న్యూ అప్లికేషన్స్ తో పాటు అనర్హులు అయిన వారిని, లేదా మరణించిన వారిని కూడా ఈ పథకం నుంచి తొలగించేందుకు వ్యవసాయ సహాయకులకు ప్రభుత్వం ఆప్షన్ ను కల్పించడం జరిగింది.
రైతు భరోసా కొత్త రిజిస్ట్రేషన్ చివరి తేదీ ఎప్పుడంటే
కొత్తగా రిజిస్టర్ చేసుకునే వారికి మే 18 వరకు అవకాశం కల్పించినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. వీరికి మే నెలలోనే అందరితో పాటు రైతు భరోసా అమౌంట్ జమ చేయనున్నట్లు వెల్లడించింది.
Ruthu Bharosa New Registrations 2023 Last Date: 18.05.2023
మీ రైతు భరోసా – PM కిసాన్ స్టేటస్ కోరకు కింది లింక్స్ చెక్ చేయండి.
Leave a Reply