ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్ లబ్ధిదారులపై కీలక నిర్ణయం తీసుకుంది. గత ఎనిమిది నెలలుగా జరుగుతున్న తనిఖీల్లో అనర్హులను గుర్తించి నోటీసులు ఇచ్చినప్పటికీ, సెప్టెంబరు 2025 నెలలో అర్హులైన ప్రతీ ఒక్కరికి పెన్షన్ అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ముఖ్యాంశాలు
- గత 8 నెలల తనిఖీల్లో 1.35 లక్షల మంది అనర్హులుగా గుర్తింపు.
- నోటీసులు ఇచ్చి అర్హులు – అనర్హులు స్పష్టత చేసుకునే అవకాశం కల్పించారు.
- అలా చేసుకున్న వారికి సెప్టెంబరు నెల పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం.
- ఇప్పటివరకు 95% మంది అర్హులుగా తేలారు.
- నిజమైన అర్హులకు పెన్షన్ అందజేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
- మొత్తం 7.50 లక్షల దివ్యాంగుల పెన్షన్లలో ఇంకా 2 లక్షల మందిపై తనిఖీ మిగిలి ఉంది.
- రెండు రోజుల్లో నోటీసులపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు.
దివ్యాంగుల పెన్షన్ వివరాలు
| వివరాలు | సంఖ్య | 
|---|---|
| మొత్తం దివ్యాంగుల పెన్షన్ పొందేవారు | 7.50 లక్షలు | 
| ఇప్పటికే తనిఖీ చేసినవారు | 5.50 లక్షలు | 
| అనర్హులుగా గుర్తించిన వారు | 1.35 లక్షలు | 
| అర్హులుగా నిర్ధారించుకున్న వారు | 95% | 
| ఇంకా తనిఖీ చేయాల్సిన వారు | 2 లక్షలు | 
అనర్హులుగా గుర్తింపు అయినా, నోటీసుల ద్వారా అర్హత నిరూపించుకున్న వారికి పెన్షన్ తప్పనిసరిగా ఇవ్వబడుతుంది. నోటీసుల కారణంగా నిజమైన అర్హులు ఇబ్బందులు పడకుండా చూడటం ప్రభుత్వ ధ్యేయం. రెండు రోజుల్లో తుది నిర్ణయం తీసుకొని నోటీసులు పొందిన అర్హుల విషయాన్ని స్పష్టతనిచ్చే అవకాశం ఉంది.
FAQ’s
1. ఈ నెల (సెప్టెంబర్ 2025)లో అందరికీ దివ్యాంగుల పెన్షన్ వస్తుందా?
➡️ అవును, అర్హులైన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వం పెన్షన్ అందజేయనుంది.
2. నోటీసులు వచ్చిన వారికి పెన్షన్ వస్తుందా?
➡️ అవును, అర్హులుగా నిరూపించుకున్న వారికి ఈ నెల పెన్షన్ తప్పనిసరిగా వస్తుంది.
3. ఇంకా తనిఖీ జరగని వారి పరిస్థితి ఏమిటి?
➡️ మిగిలిన 2 లక్షల మందిపై తనిఖీ పూర్తయ్యాక ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది.
4. అనర్హులుగా తేలినవారు మళ్లీ అర్హులుగా మారగలరా?
➡️ అవును, నోటీసుల ద్వారా అర్హతను నిరూపించుకున్నవారికి మళ్లీ అర్హత వస్తుంది.


పెన్షన్ వివరాలు
| S.No | Category | Pension Amount (Rs.) | |
| 1 | వృద్ధాప్య పెన్షన్ | 4000 | |
| 2 | వితంతువు | 4000 | |
| 3 | చేనేత కార్మికులు | 4000 | |
| 4 | కళ్లు గీత కార్మికులు | 4000 | |
| 5 | మత్స్యకారులు | 4000 | |
| 6 | ఒంటరి మహిళలు | 4000 | |
| 7 | సాంప్రదాయ చెప్పులు కుట్టేవారు | 4000 | |
| 8 | ట్రాన్స్ జెండర్ | 4000 | |
| 9 | ART(PLHIV) | 4000 | |
| 10 | డప్పు కళాకారులు | 4000 | |
| 11 | కళాకారులకు పింఛన్లు | 4000 | |
| 12 | వికలాంగులు | 6000 | |
| 13 | బహుళ వైకల్యం కుష్టు వ్యాధి | 6000 | |
| III. పూర్తి అంగవైకల్య వికలాంగుల పెన్షన్ Rs.15000/- | |||
| 14 | పక్షవాతం వచ్చిన వ్యక్తి, వీల్ చైర్ లేదా మంచానికి పరిమితం అయిన వారు | 15000 | |
| 15 | తీవ్రమైన మస్కులర్ డిస్ట్రోఫీ కేసులు మరియు ప్రమాద బాధితులు | 15000 | |
| 16 | ద్వైపాక్షిక ఎలిఫెంటియాసిస్-Grade 4 | 10000 | |
| 17 | కిడ్నీ, కాలేయం మరియు గుండె మార్పిడి | 10000 | |
| 18 | CKDU Not on Dialysis CKD Serum creatinine of >5mg | 10000 | |
| 19 | CKDU Not on Dialysis CKD Estimated GFR <15 ml | 10000 | |
| 20 | CKDU Not on Dialysis CKD Small contracted kidney | 10000 | |
| V. OTHER CATEGORIES | |||
| 21 | CKDU on Dialysis Private | 10000 | |
| 22 | CKDU on dialysis GOVT | 10000 | |
| 23 | సికిల్ సెల్ వ్యాధి | 10000 | |
| 24 | తలసేమియా | 10000 | |
| 25 | తీవ్రమైన హీమోఫిలియా (<2% of factor 8 or 9) | 10000 | |
| 26 | సైనిక్ సంక్షేమ పెన్షన్ | 5000 | |
| 27 | అభయహస్తం | 500 | |
| 28 | అమరావతి భూమి లేని నిరుపేదలు | 5000 | |
అర్హత ప్రమాణాలు
| పెన్షన్ | అర్హతలు | 
|---|---|
| వృద్ధాప్య పెన్షన్ | 60 సంవత్సరాలు మరియు ఆపై వయస్సు కలవారు అర్హులు. గిరిజనులు 50 సంవత్సరాలు ఆపై వయస్సు కలవారు అర్హులు | 
| వితంతు పెన్షన్ | వివాహ చట్టం ప్రకారం 18 సంవత్సరాలు ఆ పై వయస్సు కలవారు. భర్త మరణ ధ్రువీకరణ పత్రం లేదా డెత్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి | 
| వికలాంగుల పెన్షన్ | 40% మరియు అంతకన్నా ఎక్కువ వికలత్వం కలిగి ఉన్నవారు మరియు సదరం సర్టిఫికెట్ కలిగి ఉన్న వారు. వీరికి వయోపరిమితి లేదు | 
| చేనేత కార్మికుల పెన్షన్ | వయస్సు 50 సంవత్సరాలు మరియు యు ఆ పైన కలవారు. చేనేత మరియు జౌళి శాఖ వారిచే గుర్తింపు పత్రం కలిగినవారు | 
| కల్లు గీత కార్మికుల పింఛన్ | వయస్సు 50 సంవత్సరాలు మరియు ఆపైన కలవారు. ఎక్సైజ్ శాఖ వారిచే గుర్తింపు పత్రం కలిగినవారు. | 
| మత్స్యకారుల పెన్షన్ | వయస్సు 50 సంవత్సరములు మరియు ఆ పైన కలవారు. మత్స్య శాఖ వారిచే గుర్తింపు పత్రం కలిగినవారు. | 
| హెచ్ఐవి(PL HIV) బాధితులు పెన్షన్ | వయో పరిమితి లేదు. ఆరు నెలలు వరుసగా ART treatment Therapy(యాంటీ రిట్రో వైరల్ థెరపీ) తీసుకున్నవారు. | 
| డయాలసిస్ (CKDU) పెన్షన్ | వయస్సుతో సంబంధం లేకుండా ప్రభుత్వ హాస్పిటల్స్ మరియు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రైవేట్ హాస్పిటల్స్ లో డయాలసిస్ తీసుకుంటూ ఉన్నవారు. ( స్టేజ్ 3, 4 & 5) వయో పరిమితి లేదు. | 
| ట్రాన్స్ జెండర్ పెన్షన్ | 18 సంవత్సరాలు ఆ పైన వయస్సు కలవారు. ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ వారి ధ్రువీకరణ పత్రం కలిగినవారు. | 
| ఒంటరి మహిళ పెన్షన్ | వయస్సు 35 సంవత్సరాలు మరియు ఆపైన కలిగి ఉండి, చట్ట ప్రకారం భర్త నుండి విడాకులు పొందినవారు, భర్త నుండి విడిపోయిన వారు (విడిపోయిన కాలవ్యవధి ఒక సంవత్సరం పైగా ఉండాలి.) గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో నివసిస్తున్న వారు, భర్త నుండి విడిపోయినట్లు గా ఎటువంటి ధ్రువీకరణ పత్రం లేనివారు గ్రామ / వార్డు స్థాయిలో ప్రభుత్వ అధికారుల సాక్షాలతో తాసిల్దారుగారి ధ్రువీకరణ పత్రం పొంది ఉండాలి. అవివాహితులుగా ఉండి ఎటువంటి ఆదరణ లేకుండా ఒంటరిగా జీవిస్తూ ఉన్న వారు, గ్రామాలలో ఉన్న వారికి వయస్సు 30 సంవత్సరములు మరియు పట్టణ ప్రాంతంలో ఉన్న వారికి వయస్సు 35 సంవత్సరాలు, ఆపైన కలిగి ఉండాలి. పెన్షన్ మంజూరు అనంతరం వారు వివాహం చేసుకుని ఉన్నా లేదా ఆర్ధిక పరముగా జీవనోపాధి పొందిన తక్షణమే పెన్షను నిలిపి వేసే బాధ్యత సంబంధిత పెన్షన్ పంపిణీ అధికారి వారికి అనుమతి ఉన్నది. (ప్రతి నెల పెన్షన్ పంపిణీ అధికారి ఆమె పరిస్థితి పరిశీలించాలి.) | 
| డప్పు కళాకారుల పెన్షన్ | వయస్సు 50 సంవత్సరంలు మరియు ఆ పైన కలవారు. సాంఘిక సంక్షేమ శాఖ వారిచే గుర్తింపు పొందిన వారై ఉండాలి. | 
| చర్మకారుల పెన్షన్ | వయసు 40 సంవత్సరాలు మరియు ఆ పైన కలవారు. లబ్ధిదారుల జాబితా సాంఘిక సంక్షేమ శాఖ అందజేస్తుంది. | 
| అభయ హస్తం పెన్షన్ | స్వయం సహాయక సంఘాల సభ్యులు ఎవరైతే అభయహస్తం పథకంలో వారి కాంట్రిబ్యూషన్ చెల్లించి ఉండి, 60 సంవత్సరాల వయస్సు కలవారు. | 




