AP Coaching Centres New Rules 2026 | ఏపీ కోచింగ్ సెంటర్స్ కొత్త నిబంధనలు 2026

AP Coaching Centres New Rules 2026 | ఏపీ కోచింగ్ సెంటర్స్ కొత్త నిబంధనలు 2026

AP Coaching Centres New Rules: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ కోచింగ్ రంగాన్ని క్రమబద్ధీకరించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. “The Andhra Pradesh Coaching Institutions (Regulation and Control) Rules, 2026” పేరుతో విడుదలైన ఈ జీవో ద్వారా రాష్ట్రంలోని అన్ని కోచింగ్ సెంటర్లపై కఠిన నియంత్రణలు అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధనల ప్రధాన లక్ష్యం — విద్యార్థుల మానసిక ఆరోగ్యం, భద్రత (Student Safety), మరియు పారదర్శక విద్యా వ్యవస్థను ఏర్పరచడం.

ఈ నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంతో తీసుకోబడింది, ముఖ్యంగా విద్యార్థులపై పెరుగుతున్న ఒత్తిడి మరియు ఆత్మహత్యల నివారణ దృష్ట్యా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

📥 Download Official G.O (PDF)

Table of Contents

ఎందుకు ఈ నిబంధనలు తీసుకువచ్చారు?

ఇటీవల సంవత్సరాల్లో:

  • విద్యార్థులపై ఒత్తిడి పెరగడం
  • ర్యాంకులు, మార్కులపై అధిక ఫోకస్
  • కోచింగ్ సెంటర్లలో కఠిన విధానాలు
  • విద్యార్థుల ఆత్మహత్యలు పెరగడం

ఈ పరిస్థితులపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించి, అన్ని రాష్ట్రాలకు కోచింగ్ సెంటర్లను నియంత్రించేందుకు నిబంధనలు తీసుకురావాలని ఆదేశించింది. అదే నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ రూల్స్‌ను అమలు చేసింది

కోచింగ్ సెంటర్ అంటే ఏమిటి?

50 మందికి పైగా విద్యార్థులకు కోచింగ్ ఇస్తే అది కోచింగ్ సంస్థగా పరిగణించబడుతుంది. ఇది అకడమిక్, కాంపెటిటివ్ ఎగ్జామ్స్, లేదా ఇతర శిక్షణలు అందించే సంస్థలకు వర్తిస్తుంది

Coaching Centres రిజిస్ట్రేషన్ తప్పనిసరి – ముఖ్య మార్పు

ఇకపై:

  • ప్రతి కోచింగ్ సెంటర్ తప్పనిసరిగా ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
  • ఇప్పటికే ఉన్న సంస్థలు 3 నెలల్లో నమోదు కావాలి

❗ రిజిస్ట్రేషన్ లేకపోతే:

  • అక్రమ సంస్థగా పరిగణిస్తారు
  • మూసివేత చర్యలు
  • భారీ జరిమానాలు

ఇది కోచింగ్ రంగంలో పారదర్శకతను పెంచే కీలక నిర్ణయం.

District Level Monitoring Committee (DLMC)

ప్రతి జిల్లాలో ఒక కమిటీ ఏర్పాటు:

📌 సభ్యులు:

  • జిల్లా కలెక్టర్ – ఛైర్మన్
  • జిల్లా ఎస్పీ
  • విద్యాశాఖ అధికారులు
  • ఆరోగ్య శాఖ ప్రతినిధులు
  • NGO / అడ్వకేట్

⚙️ బాధ్యతలు:

  • రిజిస్ట్రేషన్ మంజూరు
  • తనిఖీలు
  • ఫిర్యాదుల పరిష్కారం
  • సుమోటో విచారణలు

మౌలిక సదుపాయాలు – కఠిన ప్రమాణాలు

కోచింగ్ సెంటర్లు కింది ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి:

భవనంకనీసం ప్రతి విద్యార్థికి 1 చదరపు మీటర్ స్థలం
ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్
బిల్డింగ్ అనుమతులు తప్పనిసరి
హాస్టల్ సదుపాయాలు25 మందికి 1000 sq.ft
7 మందికి 1 టాయిలెట్
10 మందికి 1 బాత్రూమ్
RO నీరు, వైద్య సదుపాయం తప్పనిసరి
భద్రతా చర్యలుAnti-suicide ceiling fans
CCTV కెమెరాలు
టెర్రస్‌లకు యాక్సెస్ నియంత్రణ
24/7 సెక్యూరిట

మానసిక ఆరోగ్యం – మొదటిసారి ప్రధాన ప్రాధాన్యం

ఈ రూల్స్‌లో ముఖ్యమైన అంశం:

Wellness Cell

ప్రతి కోచింగ్ సెంటర్‌లో ఉండాలి:

  • సైకాలజిస్ట్/కౌన్సిలర్
  • మెంటల్ హెల్త్ చెక్ (30 రోజుల్లో)
  • స్ట్రెస్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్స్

📊 రిపోర్టులు:

  • నెలవారీ & వార్షిక నివేదికలు
  • DLMCకి పంపాలి
  • విద్యార్థి వివరాలు గోప్యంగా ఉంచాలి

చదువు సమయం – నియంత్రణ

  • రోజుకు గరిష్టంగా 5 గంటలు మాత్రమే
  • ప్రతి ఆదివారం సెలవు
  • ప్రభుత్వ సెలవులు పాటించాలి

👉 ఇది విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడానికి కీలకం.

ముఖ్య నిషేధాలు

  • డమ్మీ స్కూల్స్ : నిషేధం స్కూల్ టైంలో కోచింగ్ క్లాసులు నిషేధం
  • పబ్లిక్ షేమింగ్ నిషేధం: మార్కులు, ర్యాంకులు బహిరంగంగా ప్రకటించరాదు
  • ఫీజుల కోసం వేధింపులు నిషేధం
  • ప్రభుత్వ ఉపాధ్యాయులు కోచింగ్ సెంటర్లలో పనిచేయరాదు

ఫీజులు & రిఫండ్ పాలసీ

  • ఫీజు వివరాలు స్పష్టంగా ప్రకటించాలి
  • మధ్యలో కోర్సు వదిలితే, ప్రో-రేటా రిఫండ్ ఇవ్వాలి
    • 10 రోజుల్లో చెల్లించాలి

👉 “Fees non-refundable” అనేది చెల్లదు

శిక్షలు

1వసారి₹50,000
2వసారి₹1 లక్ష
మూడోసారి రిజిస్ట్రేషన్ రద్దు

👉 విద్యార్థి ఆత్మహత్యలో నిర్లక్ష్యం ఉంటే వెంటనే సెంటర్ మూసివేత

ఈ నిబంధనల ప్రభావం

విద్యార్థులకుఒత్తిడి తగ్గుతుంది
మానసిక ఆరోగ్య రక్షణ
సురక్షిత వాతావరణం
కోచింగ్ సెంటర్లకుకఠిన నియంత్రణ
నాణ్యత పెంపు
పారదర్శకత
విద్యా వ్యవస్థకుఆరోగ్యకరమైన పోటీ
అనధికారిక సంస్థలపై నియంత్రణ

Complete Rules Table

విభాగంవివరాలు
🏢 నిర్వచనం50+ విద్యార్థులకు కోచింగ్ ఇస్తే సంస్థగా పరిగణింపు
📝 రిజిస్ట్రేషన్ప్రతి సంస్థ రిజిస్ట్రేషన్ తప్పనిసరి
⏳ గడువుఇప్పటికే ఉన్న సంస్థలు 3 నెలల్లో నమోదు చేయాలి
❌ నమోదు లేకపోతేఅక్రమంగా పరిగణించి మూసివేత + జరిమానా
🏛️ కమిటీజిల్లా కలెక్టర్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు
👥 కమిటీ సభ్యులుకలెక్టర్, SP, DEO, Health Officer, NGO మొదలైనవారు
⚙️ అధికారాలుఫిర్యాదులు, తనిఖీలు, సుమోటో విచారణలు
🏗️ స్థలంప్రతి విద్యార్థికి 1 sq.m స్థలం
🏢 భవనంFire NOC, building approvals తప్పనిసరి
🛏️ హాస్టల్25 మందికి 1000 sq.ft
🚻 టాయిలెట్7 మందికి 1 టాయిలెట్
🚿 బాత్రూమ్10 మందికి 1 బాత్రూమ్
💧 నీరుRO నీరు తప్పనిసరి
🛑 భద్రతAnti-suicide ceiling fans
🎥 CCTVకామన్ ఏరియాల్లో తప్పనిసరి
🚧 టెర్రస్నియంత్రణ అవసరం
👮 భద్రత24/7 వార్డెన్లు & గార్డులు
⏱️ సమయంరోజుకు గరిష్టంగా 5 గంటలు
📅 సెలవుఆదివారం తప్పనిసరి
🏖️ హాలిడేస్పాటించాలి
🚫 డమ్మీ స్కూల్స్స్కూల్ టైంలో కోచింగ్ నిషేధం
👨‍🏫 టీచర్లుప్రభుత్వ టీచర్లు కోచింగ్ ఇవ్వకూడదు
📢 మార్కులుర్యాంకులు/మార్కులు బయట పెట్టరాదు
🧠 వెల్‌నెస్ప్రతి సంస్థలో తప్పనిసరి
👩‍⚕️ కౌన్సెలింగ్30 రోజుల్లో స్క్రీనింగ్
📊 రిపోర్ట్స్నెలవారీ & వార్షిక నివేదికలు
🔒 గోప్యతవిద్యార్థి వివరాలు రహస్యంగా ఉంచాలి
💰 ఫీజుఫీజు వివరాలు ప్రకటించాలి
🔁 రీఫండ్10 రోజుల్లో రిఫండ్ ఇవ్వాలి
❌ నిషేధం“Non-refundable” చెల్లదు
📜 సర్టిఫికెట్లుఒరిజినల్ డాక్యుమెంట్స్ అడ్డుపెట్టకూడదు
🌐 వెబ్‌సైట్ఫ్యాకల్టీ, ఫీజు, సక్సెస్ రేట్ చూపాలి
📢 ఫిర్యాదుసంస్థలో Internal Complaints Committee
🏛️ ఫిర్యాదుజిల్లా స్థాయి పరిష్కారం
⚖️ అప్పీల్Appellate Authority
⏱️ పరిష్కారం15 రోజుల్లో ఫిర్యాదు పరిష్కారం
⚠️ శిక్షలు₹50,000
⚠️ శిక్షలు₹1,00,000
❌ రద్దురిజిస్ట్రేషన్ రద్దు
🚨 తీవ్రమైన కేసునిర్లక్ష్యం ఉంటే వెంటనే లైసెన్స్ రద్దు

FAQs – ఏపీ కోచింగ్ సెంటర్స్ కొత్త నిబంధనలు 2026

1. ఈ కొత్త నిబంధనలు ఎవరికీ వర్తిస్తాయి?

50 లేదా అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులకు అకడమిక్ లేదా కాంపెటిటివ్ పరీక్షల కోచింగ్ ఇచ్చే అన్ని సంస్థలకు వర్తిస్తాయి


2. కోచింగ్ సెంటర్లకు రిజిస్ట్రేషన్ తప్పనిసరా?

అవును. ప్రతి కోచింగ్ సెంటర్ తప్పనిసరిగా ప్రభుత్వంలో నమోదు చేసుకోవాలి.


3. ఇప్పటికే ఉన్న సంస్థలు ఏమి చేయాలి?

నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుంచి 3 నెలల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి


4. రిజిస్ట్రేషన్ లేకపోతే ఏమవుతుంది?

ఆ సంస్థను అక్రమంగా పరిగణించి మూసివేత చర్యలు తీసుకోవడంతో పాటు జరిమానాలు విధిస్తారు.


5. కోచింగ్ సెంటర్లను ఎవరు పర్యవేక్షిస్తారు?

జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉన్న District Level Monitoring Committee (DLMC) పర్యవేక్షిస్తుంది


6. రోజుకు ఎన్ని గంటలు క్లాసులు నిర్వహించాలి?

గరిష్టంగా రోజుకు 5 గంటలు మాత్రమే క్లాసులు నిర్వహించాలి


7. వారానికి సెలవులు ఉంటాయా?

అవును. ప్రతి ఆదివారం మరియు ప్రభుత్వ సెలవులు తప్పనిసరిగా ఇవ్వాలి.


8. విద్యార్థుల మార్కులు లేదా ర్యాంకులు పబ్లిక్‌గా చూపవచ్చా?

లేదు. పబ్లిక్‌గా ప్రదర్శించడం నిషేధం. ఇది విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడానికి తీసుకున్న చర్య


9. Wellness Cell అంటే ఏమిటి?

విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని చూసుకునే ప్రత్యేక విభాగం. ఇందులో కౌన్సిలర్, మెంటల్ హెల్త్ సపోర్ట్ మరియు స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కార్యక్రమాలు ఉంటాయి.


10. మెంటల్ హెల్త్ చెక్ తప్పనిసరా?

అవును. అడ్మిషన్ తర్వాత 30 రోజుల్లో విద్యార్థులకు మానసిక ఆరోగ్య స్క్రీనింగ్ చేయాలి


11. ఫీజు రీఫండ్ వస్తుందా?

అవును. విద్యార్థి మధ్యలో కోర్సు వదిలితే మిగిలిన కాలానికి ప్రో-రేటా పద్ధతిలో 10 రోజుల్లో ఫీజు తిరిగి ఇవ్వాలి


12. “Fees Non-Refundable” అని చెప్పడం చెల్లుతుందా?

లేదు. ఈ విధమైన నిబంధన చట్టబద్ధం కాదు.


13. ఒరిజినల్ సర్టిఫికెట్లు అడ్డుపెట్టుకోవచ్చా?

లేదు. ఫీజు వసూలు కోసం ఒరిజినల్ సర్టిఫికెట్లు అడ్డుపెట్టుకోవడం నిషేధం


14. భద్రత కోసం కోచింగ్ సెంటర్లు ఏమి చేయాలి?

Anti-suicide ఫ్యాన్లు, CCTV కెమెరాలు, భద్రతా సిబ్బంది వంటి చర్యలు తప్పనిసరిగా అమలు చేయాలి


15. హాస్టల్ భద్రత బాధ్యత ఎవరిది?

కోచింగ్ సెంటర్ యాజమాన్యానిదే. అనుబంధ లేదా సూచించిన హాస్టళ్లు కూడా ఇందులోకి వస్తాయి


16. ఫిర్యాదు ఎలా చేయాలి?

కోచింగ్ సెంటర్‌లోని Internal Complaints Committee (ICC), జిల్లా స్థాయి DLMC లేదా ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.


17. ఫిర్యాదు పరిష్కారం ఎంత రోజుల్లో జరుగుతుంది?

సాధారణంగా 15 రోజుల్లో ఫిర్యాదు పరిష్కరించాలి


18. ప్రభుత్వ ఉపాధ్యాయులు కోచింగ్ ఇవ్వవచ్చా?

లేదు. ప్రభుత్వ పాఠశాలలు లేదా కాలేజీల్లో పనిచేసే ఉపాధ్యాయులు ప్రైవేట్ కోచింగ్ ఇవ్వడం నిషేధం


19. డమ్మీ స్కూల్స్ అంటే ఏమిటి? అవి అనుమతించబడతాయా?

స్కూల్ టైంలో కోచింగ్ మాత్రమే నిర్వహించే వ్యవస్థను డమ్మీ స్కూల్స్ అంటారు. ఇవి పూర్తిగా నిషేధించబడ్డాయి.


20. నిబంధనలు ఉల్లంఘిస్తే శిక్షలు ఏమిటి?

మొదటి ఉల్లంఘనకు ₹50,000 వరకు జరిమానా, రెండవ ఉల్లంఘనకు ₹1,00,000 వరకు జరిమానా, మూడోసారి రిజిస్ట్రేషన్ రద్దు చేస్తారు. తీవ్రమైన సందర్భాల్లో, ముఖ్యంగా విద్యార్థి ఆత్మహత్యలో నిర్లక్ష్యం నిరూపితమైతే వెంటనే లైసెన్స్ రద్దు చేస్తారు

You cannot copy content of this page