Super Six సంక్షేమ పథకాలపై ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు

Super Six సంక్షేమ పథకాలపై ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు

సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేసినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో డబుల్ ఇంజన్ సర్కారు వలన మాత్రమే ఇది సాధ్యమైనట్టు ఆయన వెల్లడించారు. ఈ మెరకు సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలకు సంబంధించి ఆయన అసెంబ్లీ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.

సూపర్ 6 సంక్షేమ పథకాలకు సంబంధించి సీఎం కీలక వ్యాఖ్యలు

  • సూపర్ 6  లో భాగంగా అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఏటా 20వేల రూపాయలు అందిస్తున్నట్లు సీఎం వెల్లడి
  • దీపం 2 పథకం కింద ఏటా 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాము
  • ఉచిత బస్సు పథకం ద్వారా ప్రస్తుతం ఉన్న ఆక్యుఫెన్సీ 90 శాతానికి పెరిగిందని ముఖ్యమంత్రి వెల్లడించారు.
  • అన్న క్యాంటీన్లను పున ప్రారంభించామని, త్వరలో 271 కి పెంచుతున్నట్లు తెలిపారు.
  • యూనివర్సల్ హెల్త్ విధానం ద్వారా ప్రతి ఒక్కరికి ఆరోగ్య భీమా తీసుకువచ్చినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.
  • ప్రజలకు ఉచిత ఇసుక అందిస్తున్నట్లు సీఎం వెల్లడి.
  • ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అందిస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. తల్లికి వందనం అమౌంట్ పడని వారు ఇంకా ఎవరైనా ఉంటే వారి నుంచి ఇప్పటికి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు.
  • 2029 నాటికి అందరికీ సొంత ఇల్లు ఉండేలా చూస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
  • దీపావళి నాటికి మూడు లక్షల ఇల్లు ప్రజలకు అందించబోతున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడి.
  • సంక్షేమ పథకాల ఫలితాలు పేదలకు అందాలనేదే తమలక్ష్యం అని ముఖ్యమంత్రి అన్నారు
  • ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇస్తున్నాం.
  • ఉద్యోగుల సమస్యల పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నాం.
  • ధూప దీప నైవేద్యాలకు గుడులకు ఆర్థిక సాయం ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇమామ్ మౌజంలకు గౌరవ వేతనం ఇస్తున్నాం.
  • స్వర్ణాంధ్ర స్వప్నం సాకారానికి p4 విధానం దోహద పడుతుందని సీఎం అన్నారు.
  • ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలనేదే మా ప్రభుత్వ లక్ష్యం.
  • మొత్తం 2.9 లక్షల మంది ఆటో డ్రైవర్లకు 15000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తాం.
  • అక్టోబర్ 4వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ఆటో డ్రైవర్లకు అమౌంట్ జమ చేయనున్నట్లు సీఎం అన్నారు.
  • అర్హులైన ప్రతి ఆటో క్యాబ్ డ్రైవర్ ను ఆదుకుంటాం. పెండింగ్ చలాన్లు ఫిట్నెస్ పత్రాలు క్లియర్ చేసుకున్న నెక్స్ట్ మినిట్ వారికి ఆర్థిక సహాయం అందిస్తాం.
  • 63.5 లక్షల మందికి వృద్ధాప్య పెన్షన్లు ఇస్తున్నాం. ప్రతి నెల ఒకటో తేదీనే ప్రామాణికంగా వారికి పెన్షన్లు అందిస్తున్నట్లు తెలిపారు.
  • పింఛన్ లబ్ధిదారులలో 59 శాతం మంది మహిళలు ఉన్నారని ముఖ్యమంత్రి సిఎం అన్నారు.
  • మత్స్యకార సేవలో పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారులకు 20వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.
  • పీఎం సూర్య ఘర్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ఉచితంగా సోలార్ రూఫ్ టాప్ లు అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. బీసీలకు అయితే కేంద్రం ఇచ్చే సబ్సిడీపై అదనంగా రాష్ట్ర ప్రభుత్వం డబుల్ సబ్సిడీ ఇస్తుందని ముఖ్యమంత్రి వెల్లడించారు.

ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు కింది లింక్ పై క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page