ఆంధ్రప్రదేశ్ లో వివిధ సంక్షేమ పథకాలు, ప్రభుత్వ బెనిఫిట్స్ మరియు సేవలు పొందేందుకు ఆధార్ ప్రామాణికం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతి ఒక్క లబ్ధిదారుడు నుంచి ఈ కేవైసీ సేకరిస్తూ ఉంటుంది. ఈ కేవైసి లో భాగంగా లబ్ధిదారుని యొక్క థంబ్ లేదా ఐరిస్ వంటి authentication తీసుకోవడం జరుగుతుంది.
అయితే సొంతంగా లబ్ధిదారుడు కూడా కేవైసీ చేసుకోవచ్చని మీకు తెలుసా? ఇందుకోసం ప్రభుత్వం ఒక సెల్ఫ్ ఈ కేవైసీ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో ఏ విధంగా కేవైసీ పూర్తి చేయవచ్చు, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కింద ఇవ్వడం జరిగింది.
AP Citizen Self EKyc online process – ఆన్లైన్ లో సెల్ఫ్ ఈ కేవైసీ చేసే పూర్తి ప్రాసెస్ మరియు లింక్
- సెల్ఫ్ ఈ కేవైసీ పూర్తి చేయడానికి ముందుగా కింద ఇవ్వబడిన లింక్ పైన క్లిక్ చేయండి
2. ఆ తర్వాత మీకు కింది విధంగా ఒక పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు కనిపిస్తున్న టిక్ బాక్స్ పై క్లిక్ చేయండి.

3. పైన ఇచ్చిన టిక్ బాక్స్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు కింది విధంగా ఆధార్ ఎంటర్ చేయమని వస్తుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత పక్కనే ఉన్న అంకెలను బాక్స్ లో నింపండి. ఆ తర్వాత సెండ్ SEND OTP పైన క్లిక్ చేయండి.

4. ఆ తర్వాత మీరు ఏదైనా సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారుడు అయితే మీకు ఒక ఓటిపి మీ మొబైల్ కి వస్తుంది. మీ రిజిస్టర్ మొబైల్ కి వచ్చిన ఓటీపీని యధావిధిగా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. అంతే మీ ఈ కేవైసి పూర్తి అవుతుంది.
Note: ఒకవేళ మీకు ఆధార్ నెంబరు ఎంటర్ చేసిన తర్వాత ఏదైనా సమస్యతో ఈ కేవైసీ పూర్తి కాకపోతే మీరు సచివాలయం సిబ్బంది చెప్పినప్పుడు వెళ్లి ఈ కేవైసీ పూర్తి చేయవచ్చు. మీ సంక్షేమ పథకాలకు సంబంధించి ఇప్పటికే ఈ కేవైసీ పూర్తి అయ్యి మీకు సంక్షేమ పథకాలు అందుతున్నట్లయితే మరోసారి కేవైసీ అవసరం లేదు.
Leave a Reply