ఏపీలో ఇవాళ అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో రాష్ట్రమంత్రివర్గం సమావేశమైంది. ఈ భేటీలో పలు అంశాలపై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించారు. అనంతరం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో రైతులకు సంబంధించిన ఓ కీలక అంశం కూడా ఉంది. రైతులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న బకాయిల్ని విడుదల చేసేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. దీంతో త్వరలోనే ఆ నిధులు విడుదల కానున్నాయి.
గత రబీ సీజన్ లో ప్రభుత్వం తరఫున రాష్ట్ర పౌరసరఫరాల కార్పోరేషన్ రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించింది. అయితే మద్దతు ధరను మాత్రం ప్రభుత్వం వారి ఖాతాల్లో ఇప్పటివరకూ జమ చేయలేదు. ఈ బాకీలు వెయ్యి కోట్లుకు చేరుకున్నాయి. ఈ బకాయిల చెల్లింపు కోసం ప్రభుత్వం ఇప్పటికే ఈ నెల 4వ తేదీన ఎన్సీడీసీ నుంచి మార్క్ ఫెడ్ వెయ్యి కోట్ల రుణం తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో మార్క్ ఫెడ్ తగు చర్యలు చేపట్టిింది.
అయితే ధాన్యం బకాయిలు వెయ్యి కోట్లలో ప్రస్తుతానికి రూ.672 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు వీలుగా విడుదల చేసేందుకు కేబినెట్ ఇవాళ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మొత్తం 24 గంటల్లో రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇలా ధాన్యం బకాయిల మొత్తం రైతుల ఖాతాల్లో వేసే బాధ్యతను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌కి ప్రభుత్వం అప్పగించింది. దీంతో ఆయన స్వయంగా ఈ బకాయిల విడుదలను పర్యవేక్షించనున్నారు. మార్కె ఫెడ్ ఖాతాలో ఇవాళ, రేపట్లో రుణం మొత్తం జమ కానుంది. వెంటనే రైతులకు బకాయిల కోసం డబ్బుల్ని విడుదల చేయనున్నారు.
ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. Click here
ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. , వేసింది. బుధవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు.
‘‘ తెలిపింది. తోట చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇవ్వాలనే ప్రతిపాదనకు మంత్రివర్గం అంగీకారం తెలిపింది. వేసింది. ఇచ్చింది. అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటు ద్వారా రూ.4వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని భావిస్తున్నాం. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కుకు తెలిపింది. వేసింది. తగ్గించాం’’ అని పార్థసారథి తెలిపారు.
Leave a Reply