నేడే అన్నదాత సుఖీభవ – పిఎం కిసాన్ 7000 జమ: ఏపీ మరియు దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు గుడ్ న్యూస్.. అన్నదాత సుఖీభవ రెండవ విడత మరియు పిఎం కిసాన్ 21 విడత నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేడు అనగా నవంబర్ 19 న రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది.
☀️ అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ 7000 జమ, ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు కడప జిల్లా కమలాపురం నుంచి అన్నదాత సుఖీభవ విడుదల చేయనున్న ముఖ్యమంత్రి, మరోవైపు తమిళనాడు కోయంబత్తూర్ నుంచి పీఎం కిసాన్ విడుదల చేసిన ప్రధాని..
నవంబర్ 19న అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ – PM Kisan and Annadata Sukhibhava to be released on 19 November
ఇప్పటికే ఒక విడత అన్నదాత సుఖీభవ నిధులు విడుదల కాగా రెండో విడత నిధులు కూడా నవంబర్ 19న రైతుల ఖాతాలో జమ అయ్యాయి. తమిళనాడు కోయంబత్తూర్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 21వ విడత సీఎం కిసాన్ నిధులను రైతుల ఖాతాలో మధ్యాహ్నం పైన విడుదల చేశారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 46,85,838 మంది ఖాతాలలో కడప జిల్లా కమలాపురం నుంచి అన్నదాత సుఖీభవ కింద మరో 5000 జమ చేసిన ముఖ్యమంత్రి.
పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ కలిపి ఈ విడతలో కూడా రైతుల ఖాతాలో ₹7,000 జమ అవుతాయి. Annadata Sukhibhava+ PM Kisan amount = 7000 to be credited on Nov 19 2025.
PM KISAN RELEASE TIME: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపు ఆంధ్ర ప్రదేశ్ సత్యసాయి జిల్లాలో పర్యటించిన తర్వాత తమిళనాడు కోయంబత్తూర్ కి వెళ్లడం జరుగుతుంది. అక్కడి నుంచి ఈరోజు మధ్యాహ్నం పైన పిఎం కిసాన్ 21 వ విడత అమౌంట్ విడుదల చేస్తారు.
అదే సమయంలో కమలాపురం, కడప జిల్లా నుంచి 5000 రూపాయలు అన్నదాత సుఖీభవ నిధులను సీఎం విడుదల చేయనున్నారు.

పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ పడాలంటే ముఖ్యమైన సూచనలు
గత విడతలో అమౌంట్ పడి బ్యాంక్ ఖాతా యాక్టివ్ గా ఉన్న దాదాపు అందరికీ ఈ విడతలో కూడా అమౌంట్ పడుతుంది. అయితే గత విడతలో బ్యాంక్ ఖాతా యాక్టివ్ లేని కారణంగా లేదా NPCI లింక్ కానీ కారణంగా లేదా పీఎం కిసాన్ EKYC పూర్తి కానీ కారణంగా ఎవరికైనా అమౌంట్ పడకపోతే ఈసారి అవన్నీ సరిచూసుకోవాల్సి ఉంటుంది.
- మీ బ్యాంకు ఖాతా యాక్టివ్ లో ఉండాలి
- NPCI లింక్ అయి ఉండాలి.
- పిఎం కిసాన్ ఈకేవైసీ పూర్తి కావాలి. ఆన్లైన్లో సులభంగా ఈ కేవైసి పూర్తిచేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ స్టేటస్ ఇలా చెక్ చేయండి
అన్నదాత సుఖీభవ స్టేటస్ కోసం కింది లింక్ లో ఇవ్వబడిన ప్రాసెస్ ఫాలో అయ్యి స్టేటస్ చెక్ చేయండి. ఇందుకోసం మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
పి ఎం కిసాన్ స్టేటస్ చెక్ చేయుటకు కింది లింక్ పై క్లిక్ చేయండి.



