Amma Vodi FAQ’s – అమ్మ ఒడి సందేహాలు – సమాధానాలు

,

అమ్మ ఒడి తాత్కాలిక జాబితా విడుదల

అమ్మ ఒడి ఎలిజిబుల్ లిస్ట్ చూడడం ఎలా

కింది లింక్ ద్వారా మీ Provisional Eligible and Ineligble list డౌన్లోడ్ చేయండి

మీ సచివాలయం కోడ్ తెలియక పోతే ఆధార్ తో ఇక్కడ క్లిక్ చేసి పొందండి. Click here

అర్హత ఉన్నా Reverification లిస్ట్ లో వస్తె సచివాలయంలో గ్రీవెన్స్ రైజ్ చేయండి.

1) అమ్మ ఒడి కి ekyc అందరికి వర్తిస్తుందా ?

జగనన్న అమ్మ ఒడి లబ్ధిదారులు అందరికి ఈ కేవైసీ చేస్తారు.
Beneficiary Outreach యాప్ ద్వారా సచివాలయం లో mother ekyc(తల్లి యొక్క thumb) తీసుకుంటారు.

2) అమ్మ ఒడి సంబంధించి EKYC స్టేటస్ ఎలా చూడాలి ?

కింది లింక్ ద్వారా మీ EKYC స్టేటస్ చెక్ చేయండి

3) EKYC కొరకు చివరి తేది ఎప్పుడు?
Ans: జూన్ 12 వరకు ఈ కేవైసీ అవకాశం ఉన్నట్లు సమాచారం అయినప్పటికీ లబ్ధిదారులు త్వరగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని అధికారులు తెలిపారు.

4) అమ్మఒడి కి తల్లీ బ్యాంకు ఖాతా కి ఆధార్ లింకు చేపించుకోవాలా?
Ans: అవును ఖచ్చితంగా తల్లీ/గార్డియన్ యెక్క ఆధార్ బ్యాంకు ఖాతా కి లింక్ చేసుకోవాలి.

5) ఆధార్ బ్యాంకు ఖాతా ఎక్కడ లింక్ చేసుకోవాలి?
ఖచ్చితంగా బ్యాంక్ లో లేదా ATM లో లింక్ చేపించుకోవాలి, గ్రామ/వార్డ్ సచివాలయంలో చేయరు.

మీ ఆధార్ తో బ్యాంక్ లింక్ స్టేటస్ చెక్ చేయండి

6) అమ్మ ఒడి కొసం ఆధార్, ఫోన్ నెంబరు లింక్ చేసుకోవాలా?
Ans: లింక్ చేసుకున్నట్లు ఐతే చాలా ఉపయోగాలు ఉంటాయి. కావున ప్రభుత్వం లింక్ చేసుకోవాలని సూచించింది

7) బ్యాంక్ అకౌంట్ కి మొబైల్ లింక్ చేసుకోవాలా?

Ans: అవును తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ కి మొబైల్ నంబర్ లింక్ చేసుకోవాలి

8) అమ్మ ఒడి కొసం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సరి చూసుకోవాలా?
Ans:అవును మీ యెక్క వాలంటీర్ దగ్గరా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ వివరాలు సరి చూసుకోవాలి ఉదా: తల్లీ మరియు స్టూడెంట్ ఇద్దరూ ఓకే మ్యాపింగ్ లో ఉండాలి, వయస్సు, జెండర్ మొదలైనవి.

9) హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో వివరాలు సరిగా లేకపోతే ఏమీ చేయాలి?
Ans: వాలంటీర్ దగ్గర Ekyc చేసుకుంటే అప్డేట్ అవుతుంది

10) వాలంటీర్ యాప్ లో అందరు ekyc వేయాలా ?
ఎవరికీ అయితే వాలంటీర్ యాప్ household డేటా లో తప్పులు ఉంటాయో వారు మాత్రమే ekyc చేయాలి.

11) హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో తల్లీ మరియు స్టూడెంట్ ఓకే మ్యాపింగ్ లో లేకపోతే ఏమీ చేయాలి?
Ans: దీనికి అతి త్వరలో ఆప్షన్ ఇస్తారు.

12) అమ్మఒడి పొందటానికి అర్హతలు ఏమిటి?
Ans: విద్యార్థి హాజరు శాతం 75%, రైస్ కార్డు, కుటుంబం యొక్క మెట్ట భూమి 10ఎకరాల లోపు ఉండాలి, మాగాణి 3ఎకరాలా లోపు ఉండాలి, income tax కట్టి ఉండరాదు, కుటుంబం లో ప్రభుత్వ ఉద్యోగి ఉండరాదు, విద్యుత్ వినియోగం ప్రతి నెల 300 యూనిట్లు మించరాదు, పట్టణ ప్రాంతం లో 1000 SFT నివాస భూమి మించరాదు, 4వీలర్ కలిగి ఉండకూడదు. (ట్యాక్సీ/ట్రాక్టర్ ఉండొచ్చు).

మీ విద్యుత్ వినియోగం [ electricity bill ] వివరాలు తెలుసుకోండి:

అమ్మఒడి పథకానికి 300 యూనిట్లు ప్రతి నెల మించరాదు

13) Eligible /Ineligible ఎక్కడ చెక్ చేయాలి?

లబ్ధిదారుల గుర్తింపు మరియు తోలి విడత జాబితా అప్డేట్ చేయడం జరిగింది. ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి click here

14) అమ్మ ఒడి లో కొంత మంది స్టూడెంట్స్ కి mother died అవ్వడం వల్ల గత రెండు సంవత్సరాలు Father account లో money credit అయినవి ఇప్పుడు ekyc mother names వచ్చాయి …దీనికి సొల్యూషన్ చెప్పండి ఏంటి ?

సచివాలయంలో గ్రీవెన్స్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది.

15) అమ్మ ఒడి సంబంధించి ఆధార్ లో కొత్త జిల్లాలను అప్డేట్ చేసుకోవాలా?

అవసరం లేదు.

16) కొంత మంది విద్యార్థుల పేర్లు BOP అప్లికేషన్ లో కనిపించటం లేదు.

అర్హత ఉండి పేరు లేని వారికి సర్చ్ [Search by aadhar ] చేసి కూడా EKYC తీసుకుంటున్నారు

17) అమ్మఒడి కి సంబందించి BOP అప్లికేషన్ లో కొంతమంది ఆధార్ నెంబర్స్ తప్పుగా ఉన్నాయి?

ఆధార్ , రైస్ కార్డు తప్పులు ఉన్న వారికి గ్రీవెన్స్ ఆప్షన్ ఇచ్చారు. అర్హత ఉండి పేరు లేని వారికి సర్చ్ చేసి కూడా EKYC తీసుకుంటున్నారు

18) అమ్మ ఒడి EKYC చేసేటపుడు స్టూడెంట్ మరియు మథర్ ఆధార్ , రెండు చోట్ల స్టూడెంట్ ఆధార్ ఉంటె ఎలా ?

అమ్మ ఒడి EKYC చేసేటపుడు స్టూడెంట్ మరియు మథర్ ఆధార్ , రెండు చోట్ల స్టూడెంట్ ఆధార్ ఉన్నవారికి కొత్త యాప్ లో ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది.

19) ఒకవేళ విద్యార్ధి తల్లి మరణించిన యెడల ఎం చేయాలి?

సచివాలయం లో గ్రీవెన్స్ రైజ్ చేయవచ్చు, తండ్రి లేదా గార్డియన్ యొక్క థంబ్ తీసుకునేందుకు త్వరలో ఆప్షన్ ఇస్తారు.

20) Beneficiary Outreach App లో పేరు రాకుంటే ఎం చేయాలి?

నవశకం లో ఎలిజిబుల్ ఉంటె యాప్ లో సర్చ్ ద్వారా లబ్ధిదారుల బయోమెట్రిక్ తీసుకోవచ్చు. నవశకం లో ఎందుకు eligible లో లేరో కూడా రీసన్ తెలుసుకోవచ్చు.

21) అమ్మఒడి పథకానికి అర్హులు అయినప్పటికీ BOP మొబైల్ అప్లికేషన్ లో e-KYC కు పేరు రాకపోతే ఎం చెయ్యాలి?

అమ్మఒడి పథకానికి అర్హులు అయినప్పటికీ BOP మొబైల్ అప్లికేషన్ లో e-KYC కు పేరు రానట్టు అయితే వారికి అర్జీ నమోదుకు DA/WEDS వారి లాగిన్ NBM లో “Eligible but not came for EKYC” ఆప్షన్ ఇవ్వటం జరిగింది.

NOTE :

  1. Gender, Name, Age వలిడేషన్ ను అమ్మఒడి పథకానికి పరిగణలోకి తీసుకోరు.
  2. మొదట “స్కీం వాలిడేషన్” లో డేటా సరి చూసుకొని అనర్హత కు ఏవైనా కారణాలు ఉంటే పై ఆప్షన్ లో వారికి అర్జీ పెట్టనవసరం లేదు. ఏ అనర్హత ఉంటే వాటిని పరిగనించాలి.

22) తల్లి అందుబాటులో లేని అమ్మ ఒడి కేసుల కోసం ఫిర్యాదును తల్లి ఆధార్ నంబర్ లేదా తండ్రి ఆధార్ నంబర్‌తో రైజ్ చెయ్యాలా?

తండ్రి ఆధార్ నెంబర్ తో ఫిర్యాదు చెయ్యాలి

23) విద్యార్ధి యొక్క తండ్రి మరణించినట్టు (లబ్ధిదారులు) అయితే వారికి అర్జీ నమోదుకు అవకాశం కలదా?

విద్యార్ధి యొక్క తండ్రి మరణించినట్టు (లబ్ధిదారులు) అయితే వారికి అర్జీ నమోదుకు అవకాశం ఇవ్వటం జరిగింది. మరియు “Child Death” ఆప్షన్ ను ఒకే ఆప్షన్ “MOTHER/GURDIAN/CHILD/FATHER DEATH” లోకి మెర్జ్ చెయ్యటం జరిగింది.

24) అమ్మఒడి పథకానికి అర్హులు అయినప్పటికీ BOP మొబైల్ అప్లికేషన్ లో e-KYC కు పేరు రానట్టు అయితే వారికి అర్జీ నమోదుకు అవకాశం కలదా?

అమ్మఒడి పథకానికి అర్హులు అయినప్పటికీ BOP మొబైల్ అప్లికేషన్ లో e-KYC కు పేరు రానట్టు అయితే వారికి అర్జీ నమోదుకు DA/WEDS వారి లాగిన్ NBM లో “Eligible but not came for EKYC” ఆప్షన్ ఇవ్వటం జరిగింది.

25) Provisional Eligible లిస్ట్ లో పేరు ఉన్నప్పటికీ, NPCI Mapping దగ్గర INACTIVE ఉంటే ఏం చేయాలి?

మీ బ్యాంక్ ను సందర్శించి తాపనిసరిగా NPCI MAPPING చేయించు కోవాలి.

Click here to Share

One response to “Amma Vodi FAQ’s – అమ్మ ఒడి సందేహాలు – సమాధానాలు”

  1. Amma Vodi ekyc option enabled – అమ్మ ఒడి EKYC ప్రారంభం – Government Schemes Updates StudyBizz

    […] click here for Amma Vodi all Frequently asked questions […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page