రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, జూనియర్ కాలేజ్ ల నుండి విద్యార్థుల డేటా ప్రభుత్వానికి అందాల్సి ఉంది.
జూలై 10 వ తారీకు వరకు ఆ ప్రాసెస్ జరుగుతుంది.
కాబట్టి వాలంటీర్ యాప్ లో Ekyc వేయించేందుకు పేర్లు జూలై 10వ తారీకు వరకు వచ్చే అవకాశం ఉంది కంగారు పడనవసరం లేదు.
మరికొందరి పేర్లు 6 అంచెల అనర్హత వల్ల Ekyc కి రాకపోయి ఉండవచ్చును.
ఇటువంటి వారు తమ అర్హత నిరూపించుకునే పత్రాలతో సచివాలయాల్లో గ్రీవెన్స్ రైజ్ చేసే అవకాశం జూలై మొదటి వారంలో ఇవ్వబడుతుంది.
పాఠశాల / జూనియర్ కాలేజ్ లో గానీ విద్యార్థి, తల్లుల వివరాలు తప్పుగా నమోదు అయిన వివరాలను సరి చేసేందుకు జూలై మొదటి వారంలో ఆప్షన్ ఇచ్చే అవకాశం ఉంది
Leave a Reply