ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయ శాఖ ఆదేశాల మేరకు ఆధార్ సెంటర్ కలిగిన సచివాలయాలలో ఇప్పటివరకు మూడుసార్లు క్యాంపు నిర్వహించి ఆధార్ సేవలు అందించడం జరుగుతున్నది. మరలా 4వ స్పెషల్ క్యాంపు 27-9-2022 మరియు 28-9-2022న సచివాలయాలకు దగ్గరలో ఉన్న పాఠశాలలో ఆధార్ సర్వీసులు ఇవ్వడం జరుగుతుంది.
తేదీ 27 మరియు 28 సెప్టెంబర్ 2022న ఆధారు సర్వీసులు గల సచివాలయాలలో పనిచేయుచున్న DA/WEDS వారు ఆధారు నమోదు కిట్టులను దగ్గరలో ఉన్న పాఠశాలకు తీసుకొని వెళ్లి ఆ రెండు రోజులు ఆధారం సర్వీసులు ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకు అందించవలెను. ఆ రెండు రోజులలో సచివాలయంలో DA/WEDS వారు అందించే సర్వీస్ లకు ఆటంకం కలగకుండా మిగతా సచివాలయ సిబ్బందిని IN-Charge గా వెయ్యవలసిందిగా MPDO/MC గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ వారు ఆదేశించి ఉన్నారు.
తేదీ 27 మరియు 28 సెప్టెంబర్ 2022న జరిగే ఆధార్ స్పెషల్ క్యాంపుకు సంబంధించి లోకల్ టీవీ ఛానల్ ద్వారా వాలంటీర్ల ద్వారా స్కూలు టీచర్ల ద్వారా మరియు ఇతర మాధ్యమాల ద్వారా అందరికీ తెలియజేసి పాఠశాల విద్యార్థుల Mandatory Biometric Update (Free Charge) 100% పూర్తి అయ్యేలా చూడవలెను. తమ పాఠశాలలో విద్యార్థుల అందరి Mandatory Biometric Update 100% అయ్యేలా చూసుకోవడం సంబంధిత పాఠశాల హెడ్ మాస్టర్ వారి బాధ్యత
వివిధ ఉద్యోగుల విధులు మరియు బాధ్యతలు :
1.వాలంటీర్లు : ఆధార్ స్పెషల్ క్యాంపుకు సంబంధించి అందరికీ తెలియజేయడం.
2.DA/WEDS : పాఠశాలకు ఆధార్ ఎన్రోల్మెంట్ కిట్లను తీసుకువెళ్లి సెటప్ చేసి Sync & GPS Coordinates లను ఆధార్ నమోదు చేయవలెను.
3. HM : తమ పాఠశాల పరిధిలో Mandatory Biometric Update పెండింగ్ ఉన్న వారిని గుర్తించి వారి అందరికీ 100% పూర్తి అయ్యేలా చూడడం.
4. PS/WAS : DA/WEDS వారికి ఆధార్ నమోదులో సపోర్టుగా ఉంటూ సహాయం కొరకు వాలంటీర్లను కేటాయించడం మరియు అవసరమైన స్టేషనరీ సామాగ్రిని సమకూర్చాలి.
5. Mahila Police / Other Functionary : పాఠశాల విద్యార్థులు సబ్మిట్ చేసే డాక్యుమెంట్లను వెరిఫికేషన్ చేయాలి.
6. MPDO/MC : తమ పరిధిలో జరుగుతున్న ఆధార్ స్పెషల్ క్యాంపు విజయవంతంగా పూర్తి అయ్యేలా పర్యవేక్షణ చేయాలి.
7. DLDO : తమ డివిజన్ పరిధిలో ఆధార్ స్పెషల్ క్యాంపు విజయవంతంగా పూర్తి చేసి ఆ రిపోర్టును జిల్లా కలెక్టర్ వారికి అందించవలెను.
8. District GSWS Incharge Officer’s / DEO : జిల్లా పరిధిలో ఆధార్ స్పెషల్ క్యాంపు విజయవంతంగా పూర్తి చేసేలా చూడటం మరియు రిపోర్టును జిల్లా కలెక్టర్ వారికి అందించటం.
Leave a Reply