ఏపీలో నేటి నుంచి ఆధార్ క్యాంపులు..ఆన్లైన్లో అయితే పూర్తి ఉచితం

,
ఏపీలో నేటి నుంచి ఆధార్ క్యాంపులు..ఆన్లైన్లో అయితే పూర్తి ఉచితం

ఆధార్ లో కొత్త జిల్లాల పేర్లు అప్డేట్ చేయించుకునెలా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఆధార్ తీసుకొని పదేళ్లు దాటిన వారు కూడా డాక్యుమెంట్ అప్డేట్ చేయించుకునెలా చూడాలని కేంద్ర ప్రాంతీయ ఆధార్ కార్యాలయం హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి లేఖ పంపించడం జరిగింది.

నేటి నుంచి ఈనెల 29 వరకు ఐదు రోజులు రాష్ట్రంలో సచివాలయాల ఆధ్వర్యంలో ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. సచివాలయాల ఆధ్వర్యంలో ఈ క్యాంపులు జరుగుతాయి. 2014 కంటే ముందు ఆధార్ తీసుకొని ఇప్పటివరకు అప్డేట్ చేసుకోని వారికి మరియు కొత్త జిల్లాల పేర్లు అప్డేట్ చేసుకునే వారికి ఈ క్యాంపులు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

ఆధార్ ప్రత్యేక క్యాంపులకు సంబంధించిన మరింత సమాచారం కింది లింక్ లో చూడవచ్చు

ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ఆన్లైన్లో పూర్తి ఉచితం

ఆధార్ కార్డు 2014 కంటే ముందు పొంది ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఆధార్ అప్డేట్ చేసుకోని వారు తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలి. అటువంటి వారికి జూన్ 14 2023 వరకు పూర్తి ఉచితంగా డాక్యుమెంట్స్ అప్డేట్ చేసుకునే సౌకర్యాన్ని ఆధార్ కల్పించడం జరిగింది.

ఆన్లైన్లో అయితే జూన్ 14 వరకు డాక్యుమెంట్ అప్డేట్ పూర్తి ఉచితంగా ఈ సౌకర్యాన్ని పొందవచ్చు.

పూర్తి ఉచితంగా ఆన్లైన్ లో 5 నిమిషాల్లో document update చేసే పూర్తి ప్రాసెస్ కింద ఇవ్వబడింది చెక్ చేయండి

ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ఆన్లైన్ లో ఏ విధంగా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లింక్ కింద ఇవ్వబడింది చెక్ చేయండి

ఇతర ఆధార్ లింక్స్

ఆధార్ క్యాంపులు ఈ నెల 20,21,27,28 & 29 తేదీలలో ఉంటాయి.

Click here to Share

You cannot copy content of this page