ఆధార్ సంబంధించి ఇటీవల పలు రకాల ప్రత్యేక సేవలు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో, కొత్తగా ఇంటి వద్దనే ఆధార్ నమోదు చేసుకునే మరో కొత్త ఫీచర్ ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.
ఇంటి వద్ద ఆధార్ నమోదు ఎవరికి వర్తిస్తుంది
కేంద్రా ఎలక్ట్రానిక్స్ ఐటి మంత్రిత్వ శాఖ కొత్తగా ఇంటి వద్ద ఆధార్ నమోదుకు సంబంధించి మార్గదర్శకాలను అన్ని రాష్ట్రాలకు పంపించడం జరిగింది.
ఈ ఆప్షన్ ద్వారా దివ్యాంగులు, వయోవృద్ధులు మరియు కొన్ని రోగాల వలన మంచానికే పరిమితమైనటువంటి వారు తమ ఇంటి వద్దనే ఆధార్ నమోదు చేసుకోవచ్చు. ఈ విధానం ఇప్పటికే అమల్లోకి తీసుకు వచ్చినట్లు కేంద్రం తెలిపింది.
ఏ విధంగా ఇంటి వద్ద ఆధార్ నమోదు చేస్తారు?
ఇంటి వద్ద ఆధార్ నమోదు (aadhaar at home ) నమోదు చేసుకోవాలనుకునే వారు తమ సమాచారాన్ని ఈమెయిల్ ద్వారా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ UIDAI కు ఈమెయిల్ ద్వారా తెలపాల్సి ఉంటుంది.
ఈమెయిల్ ద్వారా సమాచారం అందించిన ఏడు రోజుల్లో వారి ఇంటికి ఆధార్ అధికారులు వెళ్లి నమోదు ప్రక్రియను పూర్తి చేస్తారు.
ఈ విధంగా ఇంటి వద్ద ఆధార్ నమోదు చేసినందుకు అదనపు సర్వీస్ ఛార్జీలను వసూలు చేయనున్నారు. ఒకే అడ్రస్ లో ఉన్న ఇంటిలో మొదటి వ్యక్తికి 700 రూపాయలు ఆ తర్వాత ఇంకా ఎవరైనా అదే ఇంట్లో నమోదు చేసుకోవాలనుకుంటే వారికి ఒక్కొక్కరికి 350 రూపాయలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
రాష్ట్రాల వారీగా ప్రాంతీయ ఆధార్ కార్యాలయాలను కింది వెబ్సైట్లో చెక్ చేయవచ్చు.
సాధారణంగా ఆన్లైన్లోనే మనం ఇంటి వద్దనే అడ్రస్, పేరులో చిన్న సవరణలు, డేట్ అఫ్ బర్త్ మరియు జెండర్ వంటివి మార్చుకునే సౌలభ్యం ఉంది. అయితే ఎవరికైతే బయోమెట్రిక్స్ కానీ లేదా మొబైల్ నెంబర్ కి సంబంధించిన డీటెయిల్స్ కానీ అప్డేట్ చేయాలనుకుంటే అటువంటి వారు తప్పనిసరిగా ఆధార్ నమోదు కేంద్రాన్ని సంప్రదించాల్సి ఉంటుంది. అటువంటి వారికి తాజాగా తీసుకువచ్చినటువంటి ఈ ఆప్షన్ మరింత మేలు చేకూర్చనుంది.
ఆధార్ సంబంధించి అన్ని ముఖ్యమైన లింక్స్ కింది పేజ్ లో కలవు.. చెక్ చేయండి
ఇది చదవండి: మీ ఆధార్లో కొత్త జిల్లా మరియు అడ్రస్ మార్చుకునే పూర్తి ప్రాసెస్
Leave a Reply