ఆంధ్రప్రదేశ్ లో గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ప్రత్యేక ఆధార్ క్యాంపులను రాష్ట్ర ప్రభుత్వం జూలై 23 నుంచి 27 వరకు నిర్వహిస్తోంది.
గత నెల తల్లికి వందనం [Talliki Vandanam ] పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆధార్ ఎన్రోల్మెంట్ చేయించుకోవాలని కీలక ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఈ ఆధార్ క్యాంపులు తల్లికి వందనం లబ్ధిదారులకు మరింత లబ్ధి చేకూర్చనున్నాయి.
తల్లికి వందనం లబ్ధిదారులకు ముఖ్య సూచనలు:
✓ ఆధార్ కార్డు లేనటువంటి విద్యార్థులు తప్పనిసరిగా మీ దగ్గరలో నిర్వహిస్తున్న ఆధార్ క్యాంప్ కి వెళ్లి ఆధార్ ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు. మీసేవ లేదా ఇతర ఆధార్ సెంటర్ కి వెళ్లి అయినా నమోదు చేసుకోవచ్చు.
✓ ఎవరికైతే 15 సంవత్సరాలు దాటి ఉంటుందో అటువంటి వారు ఆధార్ క్యాంప్ లేదా ఆధార్ సెంటర్ కి వెళ్లి మరోసారి వారి బయోమెట్రిక్ ని అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది.
✓ ఐదు మరియు 15 సంవత్సరాల సమయంలో ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోవడం తప్పనిసరి. పది వేళ్ళ కు సంబంధించిన ఫింగర్ ప్రింట్స్, ముఖం యొక్క ఫోటో మరియు ఐరిస్ అనగా కళ్ళకు సంబంధించి స్కాన్ తీసుకోవడం జరుగుతుంది.
✓ ఇక తల్లులు కానీ లేదా విద్యార్థులు కానీ ఆధార్ పొంది పది సంవత్సరాలు దాటినట్లయితే అటువంటివారు ఆధార్ కేంద్రానికి వెళ్లి ఒకసారి ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేయించుకోవాలి. ఇందులో విద్యార్థి లేదా తల్లి యొక్క చిరునామా మరియు ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ కి సంబంధించినటువంటి లేటెస్ట్ డాక్యుమెంట్లు అప్డేట్ చేస్తారు. అడ్రస్ వివరాలు మారకపోయినప్పటికీ కూడా లేటెస్ట్ డాక్యుమెంట్స్ ఇస్తే వాటిని పెట్టి అప్డేట్ చేయడం జరుగుతుంది.
తల్లికి వందనం పథకం పొందాలంటే ఆధార్ కార్డు కలిగి ఉండాలి ఒకవేళ ఆధార్ కార్డు లేని పక్షంలో కనీసం ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసినట్లు మీరు ఎన్రోల్మెంట్ ఐడిని చూపించే అవకాశం ఉంటుంది అయితే తల్లికి వందనం పథకానికి దరఖాస్తు చేసుకునే సమయానికి మీ దగ్గర కేవలం ఎన్రోల్మెంట్ ఐడి మాత్రమే ఉండి ఆధార్ కార్డు దీనిపక్షంలో ఎన్రోల్మెంట్ ఐడి తో పాటు మీరు వీటిలో ఏదో ఒకటి ఒక డాక్యుమెంట్ ను జత చేయాల్సి ఉంటుంది. పాన్ కార్డు, బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ పాస్ బుక్, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు, పాస్ పోర్ట్, NREGA, లేదా గజిటెడ్ ఆఫీసర్ ద్వారా జారీ చేయబడిన సర్టిఫికెట్ అయినా సరిపోతుంది. ఎవరికైతే ఆధార్ లేకుండా కేవలం దరఖాస్తు చేసినప్పుడు ఇచ్చే ఎన్రోల్మెంట్ ఐడి మాత్రమే ఉంటుందో వారు మాత్రమే పైన ఇవ్వబడిన ఏదో ఒక డాక్యుమెంట్ అదనంగా జోడించాలి.
ఆధార్ కార్డు దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో మీకు ఆధార్ కార్డు రిజిస్టర్ అడ్రస్ కి రావడం జరుగుతుంది. అయితే సాధారణంగా ఇంకా తక్కువ సమయంలోనే మీకు ఆధార్ వచ్చేస్తుంది. మీ డెలివరీ అడ్రస్ కంటే ముందు మీకు ఆన్లైన్ లో కూడా ఆధార అనేది చూసుకునే సదుపాయం ఉంటుంది. ఎన్రోల్మెంట్ ఐడి తోటి నేరుగా ఆన్లైన్లో మీరు ఆధార్ కార్డు ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని దానిని ఆధార్ వచ్చేవరకు ఉపయోగించుకోవచ్చు. UIDAI పోర్టల్ లో ఈ సదుపాయాన్ని కల్పించడం జరిగింది. అయితే ఇందుకోసం మీ మొబైల్ నెంబర్ తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి. అన్ని ఆధార్ లింక్స్ ఇక్కడ ఇవ్వబడ్డాయి చెక్ చేయండి.
తల్లికి వందనం జీవో వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.