కౌలు రైతులకు ప్రభుత్వ పథకాలు అందాలంటే తప్పనిసరిగా రెవిన్యూ శాఖ జారీ చేసే కౌలు గుర్తింపు కార్డు (CCRC) ను తప్పనిసరిగా తీసుకోవాలి.
ఈ కార్డు కలిగిన వారు మాత్రమే పంట నమోదు చేయడానికి అవకాశం కలుగుతుంది. పంట నమోదు ఆధారంగానే ప్రభుత్వం పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ మరియు ఇతర వ్యవసాయ పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
వీటన్నిటికీ సిసిఆర్సి కార్డు కలిగి ఉండాలి. ఈ కార్డు తో భూ యజమానులకు అందించే అన్ని ప్రభుత్వ పథకాల లబ్ధి కౌలు రైతులకు కూడా లభిస్తుంది. వీరికి ఈ క్రాప్ బుకింగ్ నమోదు చేసి ఈ పథకాలను వర్తింప చేస్తారు.
స్వంత భూమి లేని మరియు వేరే వారి భూమిలో పంటలు పండించే రైతులకు VRO Login లో CCRC Cards (కౌలు కార్డు) దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.
CCRC కార్డులు పొందడానికి కావలసిన డాక్యూమెంట్లు
- భూమి యజమాని పాసుపుస్తకం Xerox
- భూమి యజమాని ఆధార్ కార్డ్ Xerox
- కౌలుదారు ఆధార్ కార్డ్ Xerox
- కౌలుదారు Bank Account Xerox
- ₹10/- ల రెవెన్యూ బాండ్ పేపర్ మీద 11 నెలలకు ఒప్పందం రాసుకున్న పత్రం
CCRC కార్డు ఉపయోగాలు
- OC సహా అన్ని వర్గాల వారికి పండించిన పంటను కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవడానికి కూడా ఈ కార్డ్ ముఖ్యం
- పంట నష్టం జరిగినప్పుడు నష్టపరిహారం పొందటానికి కూడా ఈ కార్డు అవసరం
- ఈ కార్డు కలిగిన వారు మాత్రమె పంటల భీమా పొందటానికి అర్హులు
- BC, SC, ST, మైనారిటీలకు చెందిన కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ ( గతంలోవై.ఎస్.ఆర్. రైతు భరోసా ) అమౌంట్ రావాలంటే ఈ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలి.
CCRC కార్డులకు ఎలా దరఖాస్తు చెయ్యాలి
కార్డు పొందాలనుకున్న వారు మీ పంచాయతీ VROకి పైన తెలిపిన అన్నిడాక్యూమెంట్లు ఇస్తే, మీ వివరాలను పరిశీలించి అర్హులైన వారికి కౌలుకార్డు మంజూరు చేస్తారు
గమనిక : కౌలు కార్డ్ (CCRC) issue చేసేది VROలు మాత్రమే
CCRC కార్డులు పొందిన తరువాత ఎం చెయ్యాలి
CCRC కార్డు పొందిన తరువాత మీ సంబంధిత గ్రామ/వార్డు సచివాలయంలో ఉండే గ్రామ వ్యవసాయ సహాయకులకు ఒక Copy అందించాలి.