ఇంటర్మీడియట్ విద్యార్థులకు సచివాలయ ఉద్యోగుల eKYC

ఇంటర్మీడియట్  విద్యార్థులకు సచివాలయ ఉద్యోగుల eKYC
  • గత విద్యా సంవత్సరం ఇంటర్ మొదటి లేదా రెండవ సంవత్సరం చదివిన SC విద్యార్థుల పేర్లు మాత్రమే Scholarship కొరకు Aadhar Authentication కోసం WEA నవశకం లాగిన్ లో వచ్చి ఉంటాయి.
  • అనగా ఇవి గత విద్యా సంవత్సరానికి సంబంధించిన Scholarship కొరకు వచ్చిన పేర్లు.
  • కావున ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా ఇంటర్ చదువుతున్న విద్యార్థుల పేర్లు ఆధార్ నెంబర్ తో search చేస్తే ఇలాగే Student is ineligible for Aadhar Authentication అని చూపిస్తుంది.
  • కావున కొత్తగా ఈ సంవత్సరం ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థుల పేర్లు Search చేయాల్సిన పని లేదు.

నవశకం వెబ్సైట్ నందు WEA లాగిన్ లో ఇంటర్మీడియట్ చదువుతున్న SC విద్యార్థుల పేర్లు Aadhar Authentication అనే ఆప్షన్ ఇవ్వబడినది.

ముందుగా WEA లు లాగిన్ అయ్యి Intermediate Services మీద క్లిక్ చేస్తే Aadhar Authentication for Intermediate Students ఆప్షన్ చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే స్టూడెంట్స్ లిస్ట్ ఓపెన్ అవుతుంది.

అందులో Whether Student Interested అనే ఆప్షన్ దగ్గర Yes పెడితే విద్యార్థుల వివరాలు ఓపెన్ అవుతాయి.

Select Device దగ్గర మీ యొక్క బయోమెట్రిక్ డివైజ్ ను సెలెక్ట్ చేసి విద్యార్థి దగ్గర బయోమెట్రిక్ వేయించవలెను.

ఇది కేవలం ఇంటర్మీడియట్ చదువుతున్న SC విద్యార్థులకు మాత్రమే.

వేరే సచివాలయ విద్యార్థులను సెర్చ్ చేయుటకు Search ఆప్షన్ ఇవ్వటం జరిగినది.

Intermediate Students Aadhar Authentication

ఇతర సచివాలయాలకి చెందిన విద్యార్థుల యొక్క eKYC కూడా పూర్తి చేసేందుకుగాను నవశకం వెబ్సైట్ WEA ల లాగిన్స్ నందు Search option ఇవ్వబడినది.

విద్యార్థి యొక్క ఆధార్ నెంబర్ ద్వారా సెర్చ్ చేసి ekyc పూర్తి చేయించవచ్చు.

You cannot copy content of this page