ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం తాము ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ల ను 3 వేల నుంచి 4 వేల కు పెంచింది. దివ్యాంగుల పెన్షన్ అయితే ఏకంగా 6 వేలకు పెంచింది. ఈ మేరకు ముఖ్యమంత్రి , క్యాబినెట్ ఆమోద ముద్ర కూడా వేసింది. ఇక పెన్షన్ పంపిణీ చేయడమే తరువాయి.
జూలై 1 న రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో పించన్ లబ్దిదారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు.
ఆ లేఖ ను కింద ఇవ్వడం జరిగింది.
ప్రియమైన పింఛనుదారులకు నమస్కారంమీ అందరి మద్దతుతో మీకు అండగా నిలిచే, మీ సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది. ఏ ఆశలు,ఆకాంక్షలతో అయితే మీరు ఓట్లు వేసి గెలిపించారో వాటిని నెరవేర్చడమే తక్షణ, ప్రథమ కర్తవ్యంగా మీ ఈ ప్రజా ప్రభుత్వంఅడుగులు వేస్తోంది. అందులో భాగంగా మ్యానిఫెస్టోలో చెప్పినట్లు పింఛన్‌ను ఒకేసారి రూ.1000 పెంచి…. ఇకపైరూ.4000 ఇస్తున్నాం. అలాగే దివ్యాంగులకు రూ. 3000 పెంచి… ఇక నుంచి రూ. 6000 ఇస్తున్నాం అని చెప్పడానికినేను చాలా సంతోషిస్తున్నాను.
28 వర్గాలకు చెందిన 65,18,496 మంది పింఛన్ లబ్దిదారులకు జూలై 1వ తేదీ నుంచే పెంచిన పింఛన్లు ఇంటివద్దనే అందిస్తున్నాము. కొత్త ప్రభుత్వం ముందు అనేక ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ… మీ సంక్షేమం కోసం ప్రభుత్వంఏర్పడిన తొలి రోజు నుంచే మీకు మంచి చేసే నిర్ణయాలు తీసుకున్నాం. పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగారూ. 819 కోట్ల భారం పడుతున్నా.. మీ శ్రేయస్సు కోసం ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి తెచ్చాం.
ఎన్నికల సమయంలో వికృత రాజకీయాల కోసం నాటి అధికార పక్షం మిమ్మల్ని పింఛన్ విషయంలో ఎంతో క్షోభపెట్టింది. ఆ మూడు నెలల పాటు మీరు పింఛన్ అందుకోవడానికి పడిన కష్టాలు చూసి నేను చలించిపోయాను.మండుటెండలో, వడగాడ్పుల మధ్య మీరు పడిన అగచాట్లు చూసి… ఏప్రిల్ నెల నుంచే పింఛన్ పెంపును వర్తింపచేస్తాననిమాటిచ్చాను. అందులో భాగంగా ఏప్రిల్, మే, జూన్ నెలలకు కూడా ఈ పెంపును వర్తింప చేసి మీకు అందిస్తున్నాము.మూడు నెలలకు పెంచిన రూ.3000, జూలై నెల పింఛన్ రూ.4000 కలిపి మొత్తం రూ. 7000 మీ ఇంటికి తెచ్చిఇస్తున్నాము.
సంక్షేమ పాలకుడు, సామాజిక పింఛన్ విధానానికి ఆద్యుడు అయిన స్వర్గీయ ఎన్టీఆర్ పేరును తిరిగి ఈ పింఛన్లకార్యక్రమానికి పెట్టాము. ఎన్టీఆర్ భరోసా పేరుతో ఇకపై మీ ఇంటి వద్ద సామాజిక పింఛన్ల పంపిణీ జరుగుతుంది.పెరిగిన పింఛనుతో మీకు ఆర్థిక స్వావలంబన, భరోసా లభిస్తుందని ఆశిస్తున్నాము. మీ భద్రత మా బాధ్యత. మీరుసంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీకు ఎప్పుడూ మంచి చేయాలని చూసే ప్రజా ప్రభుత్వాన్నిఆశీర్వదించమని కోరుతూ…
By AP CM NARA CHANDRABABU NAIDU