ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం TIDCO ఇళ్లపై దృష్టి సారించింది. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యతకు గురి అయిన టిడ్కో ఇళ్లకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది.
2014-2019 మధ్యలో గతంలో తెలుగుదేశం పార్టీ నిర్మించిన మూడు లక్షల పైగా టిడ్కో ఇళ్లకు సంబంధించి ప్రాథమిక సమీక్షలు జరిపింది.
2019 నాటికి మూడు లక్షల ఇళ్లలో ఒకటిన్నర లక్షలు ఇల్లు 90% పూర్తి అయినా చిన్న చిన్న మరమ్మతులు చేయకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు.
త్వరలో చిన్న చిన్న మరమ్మత్తులు కూడా పూర్తి చేసి గతంలో కేటాయించిన TIDCO లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని తెలిపారు. మిగిలిన ఇళ్లను కూడా త్వరలో పూర్తి చేయనున్నట్లు తెలిపారు.