వైఎస్ఆర్ ఇన్ఫుట్ సబ్సిడీ 2024 పెండింగ్ అమౌంట్ ఈరోజు విడుదల, స్టేటస్ లింక్

వైఎస్ఆర్ ఇన్ఫుట్ సబ్సిడీ 2024 పెండింగ్ అమౌంట్ ఈరోజు విడుదల, స్టేటస్ లింక్

వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ గత సీజన్ కు సంభదించిన అమౌంట్ ను రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు విడుదల చేయడం జరిగింది.

మార్చ్ 6 వ తేదీ మధ్యాహ్నం ఈ అమౌంట్ ను ముఖ్యమంత్రి బటన్ విడుదల చేశారు. అయినా ఈ అమౌంట్ ఇప్పటివరకు రైతుల ఖాతాలో జమ కాలేదు. ఎన్నికల కు రెండు రోజుల ముందు విడుదల చేయాలని ప్రభుత్వం భావించినప్పటికీ ఈసీ అడ్డుకట్ట వేసింది. ఎట్టకేలకు మే 18 నుంచి అమౌంట్ విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

11.59 లక్షల మంది రైతుల ఖాతాలో ఇన్పుట్ సబ్సిడీ పెండింగ్ అమౌంట్

గత సీజన్ లో సంభవించిన కరువు మరియు మిచాంగ్ తుఫాన్ ప్రభావం తో పంట నష్ట పోయిన 11,59,126 లక్షల మంది రైతుల ఖాతాల్లో 1294.58 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది.

మార్చ్ 6 న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన క్యాంప్ కార్యాలయం నుంచి రైతుల ఖాతాలో ఈ అమౌంట్ ను విడుదల చేశారు. రెండు నెలల తర్వాత ఇవి ప్రస్తుతం జమ కావడం విశేషం.

ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ స్టేటస్ ఇలా చెక్ చేయండి

గత ఏడాది లాగానే రైతు భరోసా అధికారిక పోర్టల్ లో ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన స్టేటస్ లింక్ ని కూడా ఇవ్వడం జరిగింది.

అయితే ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ విడుదల అయిన తర్వాతనే ఈ లింక్ కనిపించడం జరుగుతుంది.

స్టేటస్ కోసం ఈ లింక్ ని చెక్ చేయండి.

ఆఫ్లైన్ పద్దతిలో కూడా రైతులు ఇన్పుట్ సబ్సిడీ స్టేటస్ ను చెక్ చేయవచ్చు. ముఖ్యమంత్రి ద్వారా పేమెంట్ విడుదలైన వారంలోపు ఒకవేళ మీ ఖాతాకి అమౌంట్ జమ కాని పక్షంలో రైతులు సమీప రైతు భరోసా కేంద్రాన్ని సంప్రదించి పేమెంట్ స్టేటస్ వివరాలను చెక్ చేయవచ్చు. ఒకవేళ మీ అర్హత గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు ఎప్పుడైనా రైతు భరోసా కేంద్రాన్ని సంప్రదించి తెలుసుకోవచ్చు.

You cannot copy content of this page