నేడు ఒక్కరోజు నిధుల పంపిణీకి హైకోర్టు అనుమతి.
విద్యా దీవెన, ఆసరా, ఈబీసీ నేస్తం, ఇన్పుట్ సబ్సిడీ, చేయూత నిధులను ఎన్నికలు పూర్తయ్యే వరకు విడుదల చేయొద్దన్న ఈసీ ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది.
నేడు ఒక్కరోజు నిధుల విడుదలకు వెసులుబాటు కల్పించిన హైకోర్టు.. రేపటి (మే 11) నుంచి 13వ తేదీ వరకు నిధులు పంపిణీ చేయొద్దని స్పష్టం చేసింది.
ఇందులో నేతల జోక్యం ఉండొద్దని, ప్రచారం చేయవద్దని ఆదేశించింది. దీంతో నేడు లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమయ్యే అవకాశాలు ఉన్నాయి.