YSR Cheyutha: మరోసారి వైఎస్ఆర్ చేయూత తేదీ, అమౌంట్ ఎప్పుడంటే!

YSR Cheyutha: మరోసారి వైఎస్ఆర్ చేయూత తేదీ, అమౌంట్ ఎప్పుడంటే!

రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనార్టీ మహిళలకు ఆర్థిక సహాయాన్ని అందించడం కోసం రాష్ట్రప్రభుత్వం వైయస్సార్ చేయూత అనే పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగింది. గత సంవత్సరమే విడుదల కావలసిన చేయూత పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చారు. చివరికి ఫిబ్రవరి నెలలో పలుమార్లు తేదీలు ప్రకటించినప్పటికీ అనివార్య కారణాల చేత వాయిదా వేస్తూ వస్తూనే ఉన్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం మార్చ్ నెల 7 తారీఖున అనకాపల్లి పర్యటనలో భాగంగా, ముఖ్యమంత్రి చేయూత పథకానికి సంబంధించిన అమౌంట్ విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

మార్చి 7న వైయస్సార్ చేయూత

ఆంధ్రప్రదేశ్లో రాబోతున్న ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందే పలు సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల క్యాలెండర్ను విడుదల చేసింది. మొదటగా ఫిబ్రవరి 16న చేయూత అమౌంట్ను విడుదల చేయనున్నట్టు ప్రకటించినప్పటికీ తర్వాత 21కి వాయిదా వేసింది. అయితే మళ్లీ ఫిబ్రవరి 26నకు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఫిబ్రవరి 26న కూడా అని వేరే కారణాల చేత చేయూత అమౌంట్ను విడుదల చేయలేకపోయినా ప్రభుత్వం ఇప్పుడు తాజాగా వైయస్సార్ చేయూత అమౌంట్ను మార్చి 7న అనకాపల్లిలో జరగబోయే బహిరంగ సభలో విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు ప్రతి ఏటా 18,750 అందిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. నాలుగో ఏడాదికి  సంబంధించినఅమౌంట్ను మార్చి 7న అందించినట్లు ప్రకటించింది.

అయితే గతంలో ప్రకటించినట్లు చేయూత చైత సంబరాలు 10 రోజులు జరుగును ఉన్నాయా లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.

వైయస్సార్ చేయూత అప్లికేషన్ మరియు వెరిఫికేషన్ గత ఏడాది పూర్తయిన నేపథ్యంలో గత ఏడాది షెడ్యూల్ ప్రకారం అమౌంట్ పడుతుందని తొలిత అందరూ భావించినప్పటికీ వాయిదా వేసింది. అయితే అయితే చేయిత లబ్ధిదారులు కొత్తగా ఖరారు చేసిన తేదీలు ఆయన అమౌంట్ పడుతుందా లేదా అన్న సందిగ్ధంలో  ఉన్నారు.

వైయస్సార్ చేయూత పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు రెగ్యులర్గా అప్డేట్స్, స్టేటస్  కోసం కింది లింక్ చెక్ చేయండి

YSR Cheyutha Release Date 2024 : March 7, 2024

వైయస్ఆర్ చేయూతతో పాటు మరో ముఖ్యమైన పథకమైనటువంటి ఈ బీసీ నేస్తం పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ప్రారంభించాల్సి ఉంది. ఈ పథకాన్ని కూడా మార్చి రెండవ వారంలో ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

You cannot copy content of this page