గుడ్ న్యూస్, ఆరోజే PM కిసాన్ 16 వ విడత జమ

గుడ్ న్యూస్, ఆరోజే PM కిసాన్ 16 వ విడత జమ

దేశవ్యాప్తంగా 16 వ విడత PM కిసాన్ సంబంధించి  కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ప్రతి ఏటా పంట సహాయం కింద కేంద్ర ప్రభుత్వం 3 విడతల్లో పిఎం కిసాన్ నిధులు విడుదల చేస్తుంది. ఇప్పటికే 15 విడతలుగా అమౌంట్ చెల్లించిన కేంద్రం, తాజాగా 16 వ విడత నిధుల విడుదల కు సంబందించిన తేదీని ప్రకటించింది.

16 వ విడత పిఎం కిసాన్ ఆరోజే

ప్రతి ఏటా జనవరి లేదా ఫిబ్రవరి నెలలో కేంద్ర ప్రభుత్వం  పిఎం కిసాన్ (pm kisan) నిధులను జమ చేస్తుంటుంది. ఈ ఏడాది కూడా ఫిబ్రవరి లోనే ఈ అమౌంట్ విడుదల చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అధికారిక ప్రకటన  ప్రకారం ఫిబ్రవరి 28 న PM కిసాన్ నిధులను రైతుల ఖాతాలో కేంద్రం జమ చేయనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన ను తమ పోర్టల్ లో జారీ చేసింది.

దేశవ్యాప్తంగా సుమారు 8 కోట్ల మంది రైతుల ఖాతాలో కేంద్ర ప్రభుత్వం 2000 రూపాయల చొప్పున నిధులను జమ చేయనుంది. 

అయితే ఈ కేవైసీ పూర్తి అయిన వారికి మాత్రమే ఈసారి కూడా అవకాశం. ఒకవేళ మీరు గత విడత గడువు తర్వాత ఈ కేవైసీ పూర్తి చేసినట్లయితే అటువంటి వారికి రెండు విడతలకు సంబంధించినటువంటి అమౌంట్ ఖాతాలో పడనుంది.

ఈ డేట్ లోపు ఈ కేవైసి పూర్తి చేసుకోండి

PM కిసాన్ అధికారిక వెబ్సైట్ లో గాని లేదా మీసేవ ద్వారా గానీ ఈకేవైసీ పూర్తి చేసిన రైతులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం గత కొన్ని విడతలుగా పీఎం కిసాన్ నిధులు జమ చేస్తూ వస్తుంది. ఈసారి కూడా kyc పూర్తి అయిన వారికి మాత్రమే 16 వ విడత నిధులు జమ అవుతాయి.

ఎవరైతే రైతులు ఇంకా ekyc పూర్తి చేయలేదో అటువంటి వారు వెంటనే మీ రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్ మరియు ఆధార్ నంబర్ ఉపయోగించి కింది లింక్ ద్వారా ఈకేవైసి పూర్తి చేయవచ్చు. ఫిబ్రవరి 22 లోపు ekyc పూర్తి చేసిన వారికి మాత్రమే ఈ విడత అమౌంట్ పడుతుంది.

Click here for PM kisan ekyc link

పిఎం కిసాన్ 2024 స్టేటస్ ఎలా చెక్ చేయాలి

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి PM Kisan సంబంధించినటువంటి పేమెంట్ స్టేటస్, EKYC స్టేటస్ మరియు జాబితాలో మీ వివరాలు, అర్హతను కింది. ప్రాసెస్ ఫాలో అయ్యి సులభంగా తెలుసుకోవచ్చు.

PM Kisan status కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

You cannot copy content of this page