ఏపీలో 45 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు ప్రతి ఏటా 18,500 చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నటువంటి వైయస్సార్ చేయూత పథకానికి సంబంధించి కీలక అప్డేట్ రావడం జరిగింది.
ఇప్పటికే గత ఏడాది విడుదల కావాల్సి ఉన్నటువంటి వైఎస్సార్ చేయూత పథకాన్ని ఫిబ్రవరి 2024 కి వాయిదా వేసినటువంటి ప్రభుత్వం, తొలుత ఈ పథకాన్ని ఫిబ్రవరి 4న విడుదల చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ మరోసారి వాయిదా వేయటం జరిగింది.
ఫిబ్రవరి 16 న వైయస్సార్ చేయూత అమౌంట్
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు అందించే వైయస్సార్ చేయూత చివరి విడత అమౌంట్ ను ఫిబ్రవరి 16న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది.
పది రోజులపాటు ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించిన ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ఫిబ్రవరి 17 నుంచి పది రోజులపాటు అనగా 25 వరకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలకు నగదు పంపిణీ చేపడుతుంది. ఇప్పటివరకు వివిధ పథకాల ద్వారా చెల్లించినటువంటి అమౌంట్ పై అవగాహన కల్పించే విధంగా పది రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.
ఈ పథకానికి సంబంధించి అర్హుల జాబితాలు మరియు కొత్తవారి దరఖాస్తులు మొత్తం కూడా గత ఏడాదే పూర్తి చేయడం జరిగింది.
వైఎస్ఆర్ చేయూత టైం లైన్స్ విడుదల
వైయస్సార్ చేయూత పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు రెగ్యులర్గా అప్డేట్స్ కోసం కింది లింక్ చెక్ చేయండి
YSR Cheyutha Release Date : 16th February 2024
అదేవిధంగా అగ్రవర్ణ మహిళలకు అందించేటటువంటి ఈ బీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఇంకా నిధులు విడుదల చేయాల్సి ఉంది. మొత్తానికి ఎన్నికల కోడ్ విడుదల అయ్యే ముందే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాలకు సంబంధించినటువంటి నిధులను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.