ఏపీ కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు – AP Cabinet Key Decisions

ఏపీ కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు – AP Cabinet Key Decisions

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్‌లో మంత్రి వర్గ సమావేశం జరిగింది. పలు ఇతర కీలక అంశాలపై మంత్రి వర్గ భేటీలో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. 6,100 పోస్టులతో డీఎస్సీ నిర్వహణకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

కాబినెట్ ఆమోదం తెలిపిన అంశాలు

ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌…..డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలకు గ్రీన్‌సిగ్నల్‌. 6,100 పోస్టులతో డీఎస్సీ నిర్వహణకు కేబినెట్‌ ఆమోదం
ఫిబ్రవరిలో వైఎస్సార్‌ చేయూత 4వ విడత నిధులు విడుదలకు ఆమోదం

YSR Cheyutha release date & timelines

click here


ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు రూ.5వేల కోట్ల నిధుల విడుదలకు ఆమోదం
ఎస్‌ఐపీబీ ఆమోదించిన తీర్మానాలకు గ్రీన్‌ సిగ్నల్‌
ఇంధన రంగంలో 22 వేల కోట్ల పెట్టుబడుల ప్రాతిపాదనలకు ఆమోదం
ప్రతి గ్రామ పంచాయతీకి పంచాయతీ సెక్రటరీ ఉండాలన్న నిర్ణయానికి ఆమోదం
ఎస్‌ఈఆర్టీలోకి ఐబీ భాగస్వామ్యానికి కేబినెట్‌ ఆమోదం
యూనివర్శిటీలు, ఉన్నత విద్యా సంస్థల్లో పనిచేస్తున్న నాన్‌ టీచింగ్‌ సిబ్బంది పదవీ విరమణ వయసు 60 నుంచి 62కు పెంపు
అటవీశాఖలో 689 పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం
నంద్యాల, కర్నూలు జిల్లాల్లో రెండు విండ్‌ పవర్‌ ప్రాజెక్టులకు ఆమోదం
శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో 600 మెగావాట్ల విండ్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం
ఆర్జేయూకేటీకి రిజిస్ట్రార్‌ పోస్టు ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం
ఆ మేరకు చట్టంలో సవరణకు కేబినెట్‌ ఆమోదం


You cannot copy content of this page