Vijayawada Ambedkar Statue – ప్రపంచంలో ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ప్రత్యేకతలు ఇవే

Vijayawada Ambedkar Statue – ప్రపంచంలో ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ప్రత్యేకతలు ఇవే

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడలో నెలకొన్న స్వరాజ్ మైదానంలో అట్టహాసంగా ఆవిష్కరించడం జరిగింది.

నేడు (19/01/24) విజయవాడలోని స్వరాజ్ మైదానంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరగనుంది.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ప్రత్యేకతలు మీకోసం

  • డా॥ బి.ఆర్. అంబేద్కర్ గారి విగ్రహం ఎత్తు 125 అడుగులు.
  • ఈ విగ్రహం ప్రపంచంలో కెల్లా అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహంగా పేరు పొందింది.
  • ఈ విగ్రహాన్ని విజయవాడ నగరంలో ఉన్నటువంటి స్వరాజ్ మైదానంలో నిర్మించడం జరిగింది.
  • విగ్రహం కింద ఉండే పీఠం (పెడస్టల్) ఎత్తు 81 అడుగులు గా ఉంది.
  • పెడస్టల్ అనగా పీఠం సైజు 3,481 చదరపు అడుగులు ఉంటుంది.
  • పెడస్టల్ తో కలిపి విగ్రహం మొత్తం ఎత్తు 206 అడుగులు గా ఉంది.
  • పెడస్టల్ లో జీ+2తో గదుల నిర్మాణం కలదు.
  • బౌద్ధ వాస్తు శిల్పకళ లోని కాలచక్ర మహా మండల డిజైన్ తో పీఠం ఏర్పాటు చేయడం జరిగింది.
  • పీఠం (పెడస్టల్) మొత్తం జీ+2 ఐసాసిలెస్, ట్రెపీజియం ఆకారంలో ఆర్సీసీ నిర్మాణం చేపట్టడం జరిగింది.
  • రాజస్థాన్ పింక్ శాండ్ స్టోన్ తాపడంతో పెడస్టల్ నిర్మాణం.

అంబేద్కర్ స్వరాజ్ మైదాన్ ప్రత్యేకతలు

రూ.404 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా స్వరాజ్ మైదాన్ ను ప్రస్తుత ప్రభుత్వం తీర్చిదిద్దింది. 18.81 ఎకరాల లో ఆహ్లాదకరమైన ఉద్యానవనం..పర్యాటకులను ఆకర్షించేలా, అంబేద్కర్ జీవిత విశేషాలు తెలియచేసి వారి ఆదర్శాల నుంచి స్పూర్తి పొందేలా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఎక్స్పీరియన్స్ సెంటర్, డా. అంబేద్కర్ గారి జీవిత విశేషాలను వివరించే కుడ్య చిత్రాలతో కూడిన కొలనేడ్..2వేల మంది కూర్చునేలా కన్వెన్షన్ సెంటర్..8వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫుడ్ కోర్టు..చిన్నారులు ఆడుకోవటానికి ప్లే ఏరియా..స్మృతి వనం ఆవరణలో మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్లు, స్మృతి వనం చుట్టూ ఉదయం, సాయంకాల వేళల్లో వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ చేసుకునేలా ప్రత్యేక మార్గాలు ఇందులో కలవు.

Also read

You cannot copy content of this page