రేపటి నుండి రెండో దశ ‘జగనన్న ఆరోగ్య సురక్ష’

రేపటి నుండి రెండో దశ ‘జగనన్న ఆరోగ్య సురక్ష’

జగనన్న ఆరోగ్య సురక్ష: ప్రజారోగ్య పరిరక్షణ కోసం ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల్ని చేరువ చేసేందుకు ప్రారంభమైన.. జగ‌నన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం రెండో దశ రేపటి నుంచి ప్రారంభంకాబోతోంది. రెండవ దశలో 2వ తేదీ నుంచి గ్రామీణ ప్రాంతాలలో… 3వ తేదీ నుంచి పట్టణ ప్రాంతాలలో హెల్త్‌ క్యాంపులు మొదలవుతాయి. ఆరు నెలల పాటు సాగే ఈ రెండోదశ కార్యక్రమంలో 13,945 ఆరోగ్య శిబిరాలను నిర్వహించేందుకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసింది.

  • జగనన్న ఆరోగ్య సురక్ష ఫేస్ 2 కి సంబంధించి Token Registration, Case Sheet printing, Camp Start and close Details Entry యూజర్ మాన్యువల్ అప్డేట్ చెయ్యడం జరిగింది.
  • క్యాంపుకు హాజరయ్యే ప్రజలందరూ రిజిస్ట్రేషన్ కౌంటర్ వద్ద తప్పకుండా టోకెన్ తీసుకోవాలి. పౌరులందరికీ కేస్ షీట్ అందించడం జరుగుతుంది.

గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగింది. తొలిదశలో నిర్వహించిన కార్యక్రమంలో 12,423 ఆరోగ్య శిబిరాల్ని నిర్వహించడం ద్వారా 1,64,982 మంది పేషెంట్లను డాక్టర్ వైఎస్ ఆర్ ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులకు తరలించి వారికి ఉచిత వైద్య సేవల్ని అందించారు. తొలిదశ కార్యక్రమంలో సీహెచ్వోలు, ఎఎన్ఎంలు గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో 1,45,35,705 ఇళ్లను సందర్శించి 6.45 లక్షల మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. తొలిదశ కార్యక్రమంలో నిర్వహించిన 12,423 ఆరోగ్య శిబిరాలలో 60,27,843 మంది ప్రజలు ఓపి సేవలు అందుకోగా, 1,64,982 మంది పేషెంట్లను ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులకు తరలించి ఉచిత వైద్య చికిత్సను అందించారు.

జగనన్న ఆరోగ్య సురక్ష అంటే ఏమిటి?

జగనన్న ఆరోగ్య సురక్ష అనేది పైన పేర్కొన్న విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి పౌరులకు ఆరోగ్య సేవలు అందించేందుకు తీసుకువచ్చిన కొత్త కార్యక్రమం.

ఈ కార్యక్రమాన్ని రెండు దశల్లో నిర్వహించడం జరుగుతుంది.

1. ముందుగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ANM మరియు వాలంటీర్లు తమ పరిధిలో ఉన్నటువంటి ఇళ్లకు వెళ్లి వారి ఆరోగ్య స్థితిగతులను తెలుసుకుంటారు. అవసరమైన వారికి కావలసిన టెస్టులు కూడా చేస్తారు. ఎవరికై తే డాక్టర్ తో తదుపరి కన్సల్టేషన్ అవసరం ఉంటుందో వారిని క్యాంపు నిర్వహించే రోజున డాక్టర్ వద్దకు తీసుకు వెళ్ళటం జరుగుతుంది.

2. ఈ కార్యక్రమంలో ఇంటింటి సర్వే అయిపోయిన తర్వాత గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఆరోగ్య క్యాంపులను నిర్వహిస్తుంది. పైన ముందుగా గుర్తించినటువంటి సమస్యలు ఉన్నటువంటి వారిని ఈ క్యాంపులో డాక్టర్లు ఉచితంగా పరిశీలించి చికిత్స అందిస్తారు.

ఎవరికైతే తదుపరి చికిత్స అవసరం ఉంటుందో వారిని ఇంకా పెద్ద ఆసుపత్రులకు రిఫర్ చేయడం జరుగుతుంది.

ఈ క్యాంపులకు ప్రత్యేకంగా డాక్టర్లను మరియు స్పెషలిస్ట్లను రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానుంది.

గ్రామీణ ప్రాంతంలో ఒక్కో క్యాంపుకు 40 వేల రూపాయలు పట్టణ ప్రాంతంలో ఒక్కో క్యాంపుకు లక్ష రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది.

వాలంటీర్లు మరియు ANM లు చేయవలసిన పనులు

  • వాలంటీర్స్ మరియు ANM లు ప్రతి ఇంటికి వెళ్లి GSWS వాలంటీర్ App లో ఇచ్చిన Questions తో సర్వే చేయాలి. మరియు సర్వే సమయంలో photo తీసి అప్లోడ్ చెయ్యాల్సి ఉంటుంది.
  • ఆరోగ్య సమస్యలు ఉన్న వారిని App లో నమోదు చేయాలి. వారిని క్యాంపు రోజు క్యాంపు సచివాలయం వద్దకు తీసుకురావాలి.
  • జగనన్న ఆరోగ్య సురక్ష బ్రోచర్లు పంపిణీ చేయాలి..
  • ఆరోగ్య శ్రీ పథకానికి సంబంధించి వినియోగం మరియు ప్రయోజనాల పైన ప్రజలకు అవగాహన కల్పించాలి.

Jagananna Aarogya Suraksha Volunteer Works – జగనన్న ఆరోగ్య సురక్ష వాలంటీర్ల పనులు : 

  1. వాలంటీర్ తన క్లస్టర్ పరిధి లో ఉన్న ప్రతి ఇంటిని వైద్య శిబిరానికి ముందు 2 సార్లు సందర్శించాలి. శిబిరం యొక్క 15 రోజుల ముందు మొదటిసారి (గ్రామీణ ప్రాంతాల్లో ) శిబిరం యొక్క 20 రోజుల ముందు (పట్టణ ప్రాంతాల్లో) మరియు శిబిరానికి 7 రోజుల ముందు రెండవసారి సందర్శించాలి.
  2. ANM ఇంటిని సందర్శిస్తారని మరియు రక్త పోటు బ్లడ్ షుగర్ మరియు ఇతర పరీక్షలు వంటి అవసరమైన ఆరోగ్య పరీక్షలను నిర్వహిస్తారని వాలంటీర్ గృహానికి వెళ్ళినప్పుడు ప్రజలకు తెలియజేయాలి.
  3. వాలంటీర్ వైద్య శిబిరానికి సంబంధించి నిర్ణీత తేదీన సంబంధిత వైద్యులు వారికి చెకప్ చేసి అవసరమైన ఆరోగ్య సంబంధిత మందులను అందిస్తారని ప్రజలకు సమాచారాన్ని తెలియజేయాలి.
  4. హౌస్ హోల్డ్ లో మీ అందరి చేత ఆరోగ్యశ్రీ సిటిజన్ యాప్ ని డౌన్లోడ్ చేపించి సిటిజన్ ఓపెన్ చేశారని వాళ్ళింటికి నిర్ధారించుకోవాలి.
  5. కింద తెలిపిన విధంగా మొబైల్ యాప్ లొ చేయాలి. 

గ్రామ లేదా వార్డు వాలంటీర్లు వారి క్లస్టర్ పరిధిలో వారందరికీ కూడా సర్వే చేయవలసి ఉంటుంది. సర్వేను GSWS Volunteer అనే మొబైల్ అప్లికేషన్ లొ చేయాలి. కొత్తగా యాప్ అప్డేట్ అవ్వటం జరిగింది.

ముందుగా హోం పేజీలో ఆరోగ్య సురక్ష అని ఆప్షన్ పై టిక్ చేయాలి. మొదటిసారి క్యాంపు రోజుకు గ్రామాల్లో 20 రోజుల ముందున, పట్టణ ప్రాంతంలో 15 రోజుల ముందు సర్వేను మొదలు పెట్టాలి. మొదటిసారి చేయువారు “మొదటి విడత” అనే ఆప్షన్ను ఎంచుకోవాలి.

వెంటనే వాలంటరీ క్లస్టర్ పరిధిలో ఉన్న కుటుంబ వివరాలు అన్నీ కూడా చూపిస్తుంది అందులో కుటుంబ పెద్ద పేరు, కుటుంబ హౌస్ మ్యాపింగ్ ఐడి , అడ్రస్సు మరియు ప్రస్తుత స్టేటస్ చూపిస్తుంది. Status – Pending ఉన్నవారికి సర్వే చేయాలి, Completed అని ఉంటే పూర్తి అయినట్టు.

రౌండ్ – 1 సర్వే :

రౌండ్ – 1 సర్వే లొ కుటుంబాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద చూపిన 4 ప్రశ్నలు అడుగుతుంది

ప్రశ్న 1 : గత సంవత్సరంలో మీరు లేదా మీ కుటుంబం నుంచి ఎవరైనా డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకం కింద ఏదైనా పయో్ర జనము పోందారా?

సమాధానం : అవును / కాదు

పై ప్రశ్నకు సమాధానం కాదు అయితే వెంటనే కింద ప్రశ్న అడుగుతుంది అవును అయితే రెండవ ప్రశ్నకు వెళ్తుంది.

ప్రశ్న 1.a : మీకు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకం మరియు ఈ పథకం యొక్క పయో్ర జనాలు గురించి అవగాహన ఉందా ?

సమాధానం : అవును / కాదు

ప్రశ్న 2 : పజ్రలందరికీ సమగ్ర ఆరోగ్య సంరక్షణ కోసం జగనన్న పభ్రుత్వం అందిస్తున్న అనేక సేవలు ఇవి.

వీటిలో మీరు ఏ సేవలను వినియోగించుకున్నారు?

  • ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులలో నగదు రహిత వైద్య చికిత్స
  • కోవిడ్ – 19 చికిత్స
  • ఉచితంగా వైద్యు ల సంపద్రింపులు
  • రోగ నిర్ధారణ కోసం నగదు రహిత పరీక్షలు
  • ఉచిత మందులు
  • 108 అంబులెన్స్ సేవలు
  • 104 మొబైల్ క్లీనిక్ సేవలు
  • ఫ్యా మిలీ డాక్టర్ సేవలు
  • ఆరోగ్య ఆసరా
  • డాక్టర్ వైఎస్ఆర్ కంటివెలుగు
  • వైఎస్ఆర్ సంపూర్ణపోషణ/పోషణ
  • ఇతరములు

ప్రశ్న 3 : మీ మొబైల్ ఫోన్ లో ఆరోగ్య శ్రీ సిటిజన్ యాప్ ఉందా?

సమాధానం : అవును / కాదు. ( సమాధానం కాదు అయితే, వారిఫోన్ లో యాప్ డౌన్ లోడ్ చేయడంలో స హాయం

చేయండి)

ప్రశ్న 4 : మీరు మీ సమీపంలోని గ్రామీణ/పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఎప్పు డైనా సందర్శించారా?

సమాధానం : అవును / కాదు

సిటిజెన్ నుంచి అన్ని ప్రశ్నలకు సమాధానం తీసుకున్న తర్వాత వాలంటీర్ వారు సంబంధిత ఇంటి నుండి ఎవరో ఒకరి ఈ కేవైసీ ని తీసుకోవాలి. eKYC కు బయోమెట్రిక్ / ఐరిష్ / ఫేస్ /OTP ఆప్షన్ లు ఉంటాయి.

రౌండ్ 2 సర్వే :

రౌండ్ 2 సర్వేకు సంబంధించి గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు శిబిరానికి ఏడు రోజుల ముందు సర్వేను చేయవలసి ఉంటుంది. ముందుగా చెప్పుకున్న విధంగా ఆరోగ్య సురక్ష ఆప్షన్లో ఇంటిని సెలెక్ట్ చేసుకున్న తరువాత POST VISIT అనే ఆప్షన్ ఎంచుకోవాలి. సర్వేలో మొత్తం ఐదు ప్రశ్నలు అడుగుతుంది.

ప్రశ్న 1 : జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా మెడికల్ స్క్రీనింగ్ కోసం ANM లేదా CHO మీ ఇంటికి వచ్చారా ? 

సమాధానం : వచ్చినట్టయితే అవును అని రాకపోతే కాదు అని సెలెక్ట్ చేయాలి. 

ప్రశ్న 1.a : మీ ఇంటిలో కింద సభ్యులలో ఎవరైనా ఉన్నారా ?

సమాధానం : ఈ ప్రశ్నకు గాను ఇంటిలో ఉన్నటువంటి అందరి పేర్లు చూపిస్తుంది పక్కనే వారి యొక్క ప్రస్తుత స్థితి అనగా గర్భవతుల / శిశువుల / కౌమార బాలికల / లేదా ఇతరుల అని సెలెక్ట్ చేయాలి. 

ప్రశ్న 2 : ఈ సందర్శన సమయంలో ANM లేదా చూడు మీ ఇంటిలోని వారికి ఎవరైనా రాపిడ్ టెస్ట్ నిర్వహించారా? 

సమాధానం : టెస్టులు చేసినట్టయితే అవును అని టెస్టులు చెయ్యకపోతే కాదు అని సెలెక్ట్ చేయాలి.

ప్రశ్న 3 : మీ సచివాలయంలో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు జరిగే తేదీ మరియు వేదికతో కూడిన టోకెన్ స్లిప్పు మీకు అందిందా ? 

సమాధానం : అందినట్లయితే అవునా అని అందకపోతే కాదు అని సెలెక్ట్ చేయాలి. 

ప్రశ్న 4 : జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుకు వస్తున్న సీనియర్ డాక్టర్ని కలవడానికి మీ టైం స్లాట్ తెలుసా ?

సమాధానం : తెలిసినట్లయితే అవును అని తెలియకపోతే కాదు అని సెలెక్ట్ చేయాలి. 

ప్రశ్న 5 : అవసరమైన సర్టిఫికెట్లు మరియు పత్రాలు నిర్ధారించడానికి మీరు గతంలో నిర్వహించిన జగనన్న సురక్ష క్యాంపుకు హాజరయ్యారా ? 

సమాధానం : హాజరు అయితే అవును అని అవ్వకపోతే కాదు అని సెలెక్ట్ చేయాలి.

పై ప్రశ్నలు అన్నిటికీ సమాధానం ఇచ్చిన తరువాత సంబంధిత ఇంటికి సంబంధించి ఎవరిదైనా ఈ కేవైసీను తీసుకోవాలి. ఇంతటితో వాలంటీర్లకు సంబంధించి మొబైల్ అప్లికేషన్ లో పని పూర్తి అయినట్టు. 

You cannot copy content of this page