జనవరి 2 నుంచి 5 వరకు జగనన్న ఆరోగ్య సురక్ష ఫేస్ 2 వాలంటీర్లు తమ క్లస్టర్ పరిధిలోని ప్రతి ఒక్కరికీ ఆరోగ్య సురక్ష ఫేస్ 2 గురించి తెలిపి, ప్రజలను క్యాంప్ కు హాజరు చేయించాలని అధికారులు అదేశాలు జారీ.
జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాంకు సంబంధించి వాలంటీర్ తన క్లస్టర్ పరిధిలో ఉన్న ప్రతి ఇంటిని వైద్య క్యాంపు జరగడానికి ముందు రెండు సార్లు సర్వే చెయ్యాలి
➤ Jagananna Arogya Suraksha Phase II Camps to be launched on January 2nd
➤ This scheme is intended to provide free medical treatments to the poor in ap.
➤ This programme is implemented in both rural and urban areas in the form of health camps
Download Jagananna arogya suraksha 2.0 District wise Program DateNew
Download Jagananna arogya suraksha 2.0 Case Sheet Printing User ManualNew
Download Jagananna arogya suraksha 2.0 Token Generation User ManualNew
Download User Manual for JAS 2.0 Camp Start & Close Details ModuleNew
Details for printing case sheets for JAS Pilot program Portal LinkNew
User Id - Secretariat code(8 digits)
Password - Secretariat Code(8 digits)@123
Example if secretariat code is 11223344 then:
User Id - 11223344
Pasword - 11223344@123
రాష్ట్రవ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష [Jagananna Aarogya Suraksha] అనే కొత్త కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల ఆరోగ్య పరిస్థితులపై డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా హెల్త్ క్యాంపులను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ హెల్త్ క్యాంపుల్లో అవసరమైన వారికి ఉచితంగా చికిత్స చేయడం జరుగుతుంది.
జగనన్న ఆరోగ్య సురక్ష అనేది పైన పేర్కొన్న విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి పౌరులకు ఆరోగ్య సేవలు అందించేందుకు తీసుకువచ్చిన కొత్త కార్యక్రమం.
ఈ కార్యక్రమాన్ని రెండు దశల్లో నిర్వహించడం జరుగుతుంది.
1. ముందుగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ANM మరియు వాలంటీర్లు తమ పరిధిలో ఉన్నటువంటి ఇళ్లకు వెళ్లి వారి ఆరోగ్య స్థితిగతులను తెలుసుకుంటారు. అవసరమైన వారికి కావలసిన టెస్టులు కూడా చేస్తారు. ఎవరికైతే డాక్టర్ తో తదుపరి కన్సల్టేషన్ అవసరం ఉంటుందో వారిని క్యాంపు నిర్వహించే రోజున డాక్టర్ వద్దకు తీసుకు వెళ్ళటం జరుగుతుంది.
2. ఈ కార్యక్రమంలో ఇంటింటి సర్వే అయిపోయిన తర్వాత గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఆరోగ్య క్యాంపులను నిర్వహిస్తుంది. పైన ముందుగా గుర్తించినటువంటి సమస్యలు ఉన్నటువంటి వారిని ఈ క్యాంపులో డాక్టర్లు ఉచితంగా పరిశీలించి చికిత్స అందిస్తారు.
ఎవరికైతే తదుపరి చికిత్స అవసరం ఉంటుందో వారిని ఇంకా పెద్ద ఆసుపత్రులకు రిఫర్ చేయడం జరుగుతుంది.
ఈ క్యాంపులకు ప్రత్యేకంగా డాక్టర్లను మరియు స్పెషలిస్ట్లను రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానుంది.
గ్రామీణ ప్రాంతంలో ఒక్కో క్యాంపుకు 40 వేల రూపాయలు పట్టణ ప్రాంతంలో ఒక్కో క్యాంపుకు లక్ష రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది.
STEP 1 : మీ సచివాలయ పరిధిలో ఏ రోజు జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు ఉంటుందో తెలుసుకోవటానికి ముందుగా కింద ఇవ్వబడిన లింకుపై క్లిక్ చేయాలి
STEP 2 : Home Page లో కుడి వైపు పైన "Know your Jagananna Aarogya Suraksha camp date" అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
STEP 3 : తరువాత జిల్లా, మండలం/ మున్సిపాలిటీ/ VHC సెలెక్ట్ చేసి Check Status పై క్లిక్ చేయాలి. వెంటనే షెడ్యూల్ తేదీ, Venue Type & Address చూపించడం జరుగుతుంది.
గ్రామ లేదా వార్డు వాలంటీర్లు వారి క్లస్టర్ పరిధిలో వారందరికీ కూడా సర్వే చేయవలసి ఉంటుంది. సర్వేను GSWS Volunteer అనే మొబైల్ అప్లికేషన్ లొ చేయాలి. కొత్తగా యాప్ అప్డేట్ అవ్వటం జరిగింది.
ముందుగా హోం పేజీలో ఆరోగ్య సురక్ష అని ఆప్షన్ పై టిక్ చేయాలి. మొదటిసారి క్యాంపు రోజుకు గ్రామాల్లో 20 రోజుల ముందున, పట్టణ ప్రాంతంలో 15 రోజుల ముందు సర్వేను మొదలు పెట్టాలి. మొదటిసారి చేయువారు "మొదటి విడత" అనే ఆప్షన్ను ఎంచుకోవాలి.
వెంటనే వాలంటరీ క్లస్టర్ పరిధిలో ఉన్న కుటుంబ వివరాలు అన్నీ కూడా చూపిస్తుంది అందులో కుటుంబ పెద్ద పేరు, కుటుంబ హౌస్ మ్యాపింగ్ ఐడి , అడ్రస్సు మరియు ప్రస్తుత స్టేటస్ చూపిస్తుంది. Status - Pending ఉన్నవారికి సర్వే చేయాలి, Completed అని ఉంటే పూర్తి అయినట్టు.
రౌండ్ - 1 సర్వే లొ కుటుంబాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద చూపిన 4 ప్రశ్నలు అడుగుతుంది
ప్రశ్న 1 : గత సంవత్సరంలో మీరు లేదా మీ కుటుంబం నుంచి ఎవరైనా డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకం కింద ఏదైనా పయో్ర జనము పోందారా?
సమాధానం : అవును / కాదు
పై ప్రశ్నకు సమాధానం కాదు అయితే వెంటనే కింద ప్రశ్న అడుగుతుంది అవును అయితే రెండవ ప్రశ్నకు వెళ్తుంది.
ప్రశ్న 1.a :మీకు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకం మరియు ఈ పథకం యొక్క పయో్ర జనాలు గురించి అవగాహన ఉందా ?
సమాధానం : అవును / కాదు
ప్రశ్న 2 : పజ్రలందరికీ సమగ్ర ఆరోగ్య సంరక్షణ కోసం జగనన్న పభ్రుత్వం అందిస్తున్న అనేక సేవలు ఇవి.
వీటిలో మీరు ఏ సేవలను వినియోగించుకున్నారు?
ప్రశ్న 3 : మీ మొబైల్ ఫోన్ లో ఆరోగ్య శ్రీ సిటిజన్ యాప్ ఉందా?
సమాధానం : అవును / కాదు. ( సమాధానం కాదు అయితే, వారిఫోన్ లో యాప్ డౌన్ లోడ్ చేయడంలో స హాయం
చేయండి)
ప్రశ్న 4 : మీరు మీ సమీపంలోని గ్రామీణ/పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఎప్పు డైనా సందర్శించారా?
సమాధానం : అవును / కాదు
సిటిజెన్ నుంచి అన్ని ప్రశ్నలకు సమాధానం తీసుకున్న తర్వాత వాలంటీర్ వారు సంబంధిత ఇంటి నుండి ఎవరో ఒకరి ఈ కేవైసీ ని తీసుకోవాలి. eKYC కు బయోమెట్రిక్ / ఐరిష్ / ఫేస్ /OTP ఆప్షన్ లు ఉంటాయి.
రౌండ్ 2 సర్వేకు సంబంధించి గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు శిబిరానికి ఏడు రోజుల ముందు సర్వేను చేయవలసి ఉంటుంది. ముందుగా చెప్పుకున్న విధంగా ఆరోగ్య సురక్ష ఆప్షన్లో ఇంటిని సెలెక్ట్ చేసుకున్న తరువాత POST VISIT అనే ఆప్షన్ ఎంచుకోవాలి. సర్వేలో మొత్తం ఐదు ప్రశ్నలు అడుగుతుంది.
ప్రశ్న 1 : జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా మెడికల్ స్క్రీనింగ్ కోసం ANM లేదా CHO మీ ఇంటికి వచ్చారా ?
సమాధానం : వచ్చినట్టయితే అవును అని రాకపోతే కాదు అని సెలెక్ట్ చేయాలి.
ప్రశ్న 1.a : మీ ఇంటిలో కింద సభ్యులలో ఎవరైనా ఉన్నారా ?
సమాధానం : ఈ ప్రశ్నకు గాను ఇంటిలో ఉన్నటువంటి అందరి పేర్లు చూపిస్తుంది పక్కనే వారి యొక్క ప్రస్తుత స్థితి అనగా గర్భవతుల / శిశువుల / కౌమార బాలికల / లేదా ఇతరుల అని సెలెక్ట్ చేయాలి.
ప్రశ్న 2 : ఈ సందర్శన సమయంలో ANM లేదా చూడు మీ ఇంటిలోని వారికి ఎవరైనా రాపిడ్ టెస్ట్ నిర్వహించారా?
సమాధానం : టెస్టులు చేసినట్టయితే అవును అని టెస్టులు చెయ్యకపోతే కాదు అని సెలెక్ట్ చేయాలి.
ప్రశ్న 3 : మీ సచివాలయంలో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు జరిగే తేదీ మరియు వేదికతో కూడిన టోకెన్ స్లిప్పు మీకు అందిందా ?
సమాధానం : అందినట్లయితే అవునా అని అందకపోతే కాదు అని సెలెక్ట్ చేయాలి.
ప్రశ్న 4 : జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుకు వస్తున్న సీనియర్ డాక్టర్ని కలవడానికి మీ టైం స్లాట్ తెలుసా ?
సమాధానం : తెలిసినట్లయితే అవును అని తెలియకపోతే కాదు అని సెలెక్ట్ చేయాలి.
ప్రశ్న 5 : అవసరమైన సర్టిఫికెట్లు మరియు పత్రాలు నిర్ధారించడానికి మీరు గతంలో నిర్వహించిన జగనన్న సురక్ష క్యాంపుకు హాజరయ్యారా ?
సమాధానం : హాజరు అయితే అవును అని అవ్వకపోతే కాదు అని సెలెక్ట్ చేయాలి.
పై ప్రశ్నలు అన్నిటికీ సమాధానం ఇచ్చిన తరువాత సంబంధిత ఇంటికి సంబంధించి ఎవరిదైనా ఈ కేవైసీను తీసుకోవాలి. ఇంతటితో వాలంటీర్లకు సంబంధించి మొబైల్ అప్లికేషన్ లో పని పూర్తి అయినట్టు.
ఈ క్యాంపులను పాఠశాల ప్రాంగణంలో కానీ లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిసరాలలో నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ మరియు సన్నద్దత అంతా కూడా సెప్టెంబర్ ఐదు నుంచి ప్రారంభమవుతుంది.
ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 15 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. రిపోర్టింగ్ కోసం ప్రస్తుతం జగనన్న సురక్ష యాప్ ను ఇందుకోసం ఉపయోగించనున్నారు. అదేవిధంగా వాలంటీర్లను కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తారు.
తొలి ఆరోగ్య సురక్ష క్యాంపును సెప్టెంబర్ 30న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుంది.