YSR Aasara: ఏపీ ప్రభుత్వం ప్రజల కోసం అనేక పథకాలను తీసుకొచ్చింది. ముఖ్యంగా నవరత్నాల పేరుతో ప్రతీ ఇంటికి ఏదో ఒక లబ్ది జరిగేలా చూస్తున్నారు. ఇక ఇప్పటికే ఏపీ ప్రభుత్వం మూడు విడతలుగా వైఎస్సార్ ఆసరా నిధులను అందజేసింది. ఇక తాజాగా వైఎస్సార్ ఆసరా నాలుగో విడత నిధుల జమకు ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది.
జనవరి 23-31 వరకు వైఎస్ఆర్ ఆసరా
జనవరి 23న ఈ డబ్బుల జమ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు.
జనవరి 31 వరకు అన్ని నియోజకవర్గాల్లో ఎంపీ, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ నగదు పంపిణీ కార్యక్రమం సంబరంగా జరగనుంది.
గతంలో ఆసరా అమౌంట్ విడుదల కార్యక్రమాన్ని జనవరి 20 నుండి 30 వరకు జరపాలని భావించినప్పటికీ పలు కారణాల చేత జనవరి 23 కి వాయిదా వేశారు.