ఏపీలో కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్న అంగన్ వాడీ హెల్పర్లు,వర్కర్లకు వైసీపీ సర్కార్ ఇవాళ గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా అంగీకరించిన రెండు కీలక డిమాండ్లకు సంబంధించి ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో అంగన్ వాడీ హెల్పర్లను వర్కర్లుగా ప్రమోషన్లు ఇచ్చేందుకు వయో పరిమితి పెంపుతో పాటు మరో ఉత్తర్వు కూడా ఉంది. తాజాగా మంత్రుల కమిటీతో జరిపిన చర్చల మేరకు ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలో అంగన్ వాడీ హెల్పర్లకు అంగన్వాడీ వర్కర్లుగా ప్రమోషన్ ఇచ్చేందుకు వయోపరిమితి పెంచుతూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఇకపై అంగన్ వాడీ హెల్పర్లకు అంగన్వాడీ వర్కర్లుగా ప్రమోషన్ ఇచ్చేందుకు ప్రస్తుతం ఉన్న వయో పరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు ప్రభుత్వం పెంచింది. సహాయకులను వర్కర్లుగా ప్రమోట్ చేసే వయో పరిమితిని 50 ఏళ్లకు పెంచింది. అంగన్వాడీ వర్కర్ల వన్ టైం బెనిఫిట్ రూ.లక్షకు పెంచింది. అంగన్వాడీ సహాయకుల వన్ టైం బెనిఫిట్ రూ. 40వేలకు పెంచింది. వర్కర్లు, హెల్పర్ల సేవల విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచింది.
అలాగే అంగన్వాడీ వర్కర్లు,హెల్పర్లకు టీఏ, డీఏ లు చెల్లించేందుకు ఉద్దేశించిన మరో ఉత్తర్వు కూడా జారీ చేసింది..