ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేద మధ్యతరగతి వర్గాలను ఆర్థికంగా ఆదుకోవడానికి అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించడం జరిగింది.
అందులో భాగమైన విదేశాల్లో ని టాప్ యూనివర్సిటీలో ఉన్నత వ్యక్తిని అభ్యసించి పేద విద్యార్థులకు ఆర్థికంగా నిలబడటానికి జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని అమలు చేస్తుంది
సివిల్ సర్వీసెస్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహకాలను అందించడానికి ఉద్దేశించిన జగనన్న సివిల్ సర్వీసెస్ పేరుతో పథకాన్ని అమలు చేస్తుంది
నేడు విదేశాల్లో చదువుకుంటూ అర్హులైన 390 మంది విద్యార్థులకు 41.6 కోట్లను మరియు సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన 95 మంది, వారిలో తిరిగి మెయిన్స్ లో ఉత్తీర్ణత సాధించిన 11 మంది అభ్యర్థులకు ప్రోత్సాహకంగా 100.5 లక్షలను మొత్తం 42.6 కోట్లను, నేడు సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్న ప్రభుత్వం.
జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం
సివిల్ సర్వీస్ పరీక్షలో ప్రిలిమినరీ పరీక్ష పాసైన విద్యార్థులకు రూ.1లక్ష ప్రోత్సాహకం.. మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణులైతే అదనంగా మరో రూ.50 వేల ప్రోత్సాహకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. అలాగే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాల అభ్యర్థులు తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన శిక్షణతోపాటు వారు సొంతంగా ప్రిపేర్ అయ్యేందుకు ఆర్థికంగా తోడ్పాటునందిస్తోంది. అభ్యర్థులు ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలు పాసైన ప్రతిసారీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నగదు ప్రోత్సాహకం అందిస్తోంది.
జగనన్న విదేశీ విద్యాదీవెన
కేవలం శ్రీమంతుల పిల్లలకే అందుబాటులో ఉన్న విదేశీ విద్యను పేద విద్యార్థులు సైతం అభ్యసించే వీలు కల్పిస్తూ.. వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్/ టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ ప్రకారం ఇంజనీరింగ్, మెడిసిన్, లా, జర్నలిజం తదితర 21 ఫ్యాకల్టీలలో ప్రవేశం పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు రూ.1.25 కోట్ల వరకు, ఇతర
విద్యార్థులకు రూ.1 కోటి వరకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ తోపాటు విమాన ప్రయాణం, వీసా ఖర్చులను ప్రభుత్వం భరిస్తోంది. దీనిద్వారా ప్రపంచంలోని టాప్-320కి పైగా అత్యుత్తమ కళాశాలల్లో ఉచితంగా చదువుకునేందుకు రాష్ట్ర విద్యార్థులకు అవకాశం కల్పిస్తోంది. ఇక గడిచిన 10 నెలల్లో కేవలం ‘జగనన్న విదేశీ విద్యాదీవెన’ కింద 408 మంది విద్యార్థులకు ప్రభుత్వం రూ.107.08 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించింది.
.