ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటిఐ, డిప్లమా, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్ , మెడిసిన్ తదితర కోర్సులు చదువుతున్నటువంటి వారికి ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన మరియు వసతి దీవెన పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం విద్యా దీవెన మరియు వసతి దీవెన అమౌంట్ ను డీబీటీ పద్ధతిలో తల్లుల ఖాతాలో జమ చేస్తూ వస్తున్న ప్రభుత్వం, ఇకపై స్టూడెంట్స్ తమ తల్లితో కలిసి ఓపెన్ చేసే జాయింట్ బ్యాంక్ ఖాతా లో జమ చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది.
Click here for JVD FAQ – జాయింట్ అకౌంట్ కి సంబంధించి ప్రశ్నలు – సమాధానాలు
Click above link for JVD FAQ on joint account
Joint Bank Accounts to be opened for Jagananna Vidya deevena and Vasathi deevena beneficiaries.
తల్లి మరియు స్టూడెంట్ పేరున జాయింట్ ఖాతా
జగనన్న వసతి దీవెన మరియు జగనన్న విద్యా దీవెన అమౌంట్ ఇకపై స్టూడెంట్ మరియు తల్లి జాయింట్ ఖాతాలో డిబిటి పద్ధతిలో ప్రభుత్వం జమ చేయనుంది.
ఈ జాయింట్ ఖాతా కి సంబంధించి కీలక అంశాలు
- ఈ జాయింట్ ఖాతాని 24 నవంబర్ లోపు ఓపెన్ చేసేలా చూడాలని ప్రభుత్వము ఆదేశాలు.
- ఈ ఖాతాలో ప్రైమరీ అనగా ప్రధాన ఖాతాదారుడు గా స్టూడెంట్ ఉంటాడు. జాయింట్ ఖాతాదారులుగా తల్లి ఉంటారు.
- ఈ ఖాతాకి ఎటువంటి డెబిట్ కార్డు ఉండదు. నేరుగా బ్యాంకు నుంచి తల్లి మరియు విద్యార్థి ఇద్దరు సంతకం పెడితేనే అమౌంట్ డ్రా చేయడం జరుగుతుంది.
- తల్లి లేని వారు తండ్రి, తల్లిదండ్రులు ఇద్దరు లేనివారు గార్డియన్ తో కలిసి జాయింట్ ఖాతా తెరవవచ్చు.
- ఈ ఖాతాను జీరో బాలన్స్ ఖాతాగా తెరవడం జరుగుతుంది. కాబట్టి ఇందులో జీరో బ్యాలెన్స్ ఉన్నప్పటికి ఎటువంటి పెనాల్టీ ఉండదు.
- ఈ ఖాతాకు సంబంధించి ఎటువంటి ఆన్లైన్ బ్యాంకింగ్ సదుపాయాలు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యం కల్పించడం జరగదు.
సచివాలయాల అధ్వర్యంలో బ్యాంక్ లో ఖాతాలు
జాయింట్ ఖాతాల ఓపెనింగ్ విషయంలో సచివాలయాలకు కీలక ఆదేశాలను గ్రామ వార్డు సచివాలయ శాఖ జారీ చేయడం జరిగింది.
ప్రస్తుతం సచివాలయాల వద్ద అర్హులైన వారి జాబితాలను సచివాలయాలు సంబంధిత బ్యాంక్ కోఆర్డినేటర్ కు తెలియజేస్తాయి.
బ్యాంకు కోఆర్డినేటర్లు సంబంధిత బ్యాంకులో ప్రతిరోజు నిర్దిష్ట సంఖ్యలో ఈ ఖాతాలను తెరవడం జరుగుతుంది.
సచివాలయాలలో పనిచేస్తున్నటువంటి WEA/WEDPS/HWO ఉద్యోగులు సంబంధిత లబ్ధిదారులతో సంప్రదించి, వారికి ఈ వివరాలను తెలియపరచి బ్యాంక్ ఖాతా తెరిచేటప్పుడు వారి సంతకాల కోసం తల్లి మరియు స్టూడెంట్ ని బ్యాంకు తీసుకువెళ్లి ఖాతా తెరిచేందుకు సహకరించడం జరుగుతుంది.
Download JVD Joint Bank Account instructions .. Click here
Issued by government of AP
జగనన్న విద్యా దీవెన మరియు వసతి దీవెనకి సంబంధించినటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం కింది లింక్స్ ఫాలో అవ్వండి.
Leave a Reply