గుడ్ న్యూస్, ఈ ఫిబ్రవరి 28 2024 న PM కిసాన్ ₹2000 విడుదల, మూడవ విడత కేవలం PM కిసాన్ మాత్రమే ఉంటుంది.
Latest Update February 2024
రైతు భరోసా రెండో విడత అమౌంట్ విడుదల
వరుసగా ఐదో ఏడాది.. రెండో విడత వైఎస్సార్ రైతు భరోసా కింద ఒక్కొక్కరికి రూ.4,000 చొప్పున 53.53 లక్షల మంది రైతులకు రూ.2,204.77 కోట్ల రైతు భరోసా సాయాన్ని శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి పర్యటన లో భాగంగా మంగళవారం ముఖ్యమంత్రి జగనమోహన్ రెడ్డి బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది.
అక్టోబర్ నెలలో విడుదల చేయాల్సి ఉన్నటువంటి రెండో విడత అమౌంట్ ను ఈ నెల 7 న విడుదల చేయడం జరిగింది. ఇందులో రాష్ట్ర వాటా 2000 మరియు కేంద్ర ప్రభుత్వం వాటా 2000 ఉంటాయి.
RYTHU BHAROSA RELEASE DATE : November 07th 2023 [released]
ఎంత అమౌంట్ జమ అవుతుంది?
ఈ ఏడాదికి సంబంధించి రెండవ విడత వైఎస్సార్ రైతు భరోసా అమౌంట్ ₹4000 రూపాయల లో PM కిసాన్ ₹2000 మినహాయిస్తే రైతు భరోసా అమౌంట్ ₹2000 రైతుల ఖాతాలో నవంబర్ 7 న రాష్ట్ర ప్రభుత్వం జమ చేసినట్లు సమాచారం. ఇక మిగిలిన PM కిసాన్ ₹2000 అమౌంట్ కూడా త్వరలో కేంద్రం జమ చేయనుంది. దీంతో మొత్తంగా 4000 రూపాయలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఖాతాలో ఈ నెలలో జమ చేయనున్నాయి.
రైతు భరోసా లో భాగంగా కేంద్రం ప్రతి ఏటా 6000 మరియు రాష్ట్ర ప్రభుత్వం 7500 రూపాయలను జమ చేస్తుంది. మొదటి విడత గా 7500, రెండో విడత 4000, మూడో విడత గా 2000 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జమ చేస్తున్న విషయం మనకు తెలిసిందే.
వైయస్సార్ రైతు భరోసా కోసం కొత్త రిజిస్ట్రేషన్ లను గత నెల రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. వీరికి కూడా తాజాగా విడుదల కానున్నటువంటి అమౌంట్ ను రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది.
ఇక కేంద్ర ప్రభుత్వం జమ చేసేటటువంటి పీఎం కిసాన్ అమౌంట్ నిధులు గత విడతలో మాదిరిగానే ఈ కేవైసీ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే జమ అవుతుంది. ఒకవేళ ఈ కేవైసీ పూర్తి చేయని కారణంగా గత విడత అమౌంట్ పడని వారికి ఈ విడత అమౌంట్ తో కలిపి అందించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
రైతు భరోసా PM కిసాన్ స్టేటస్ ఇలా చెక్ చేయండి
వైయస్సార్ రైతు భరోసా మరియు పిఎం కిసాన్ స్టేటస్ ను కింది లింక్ ద్వారా చెక్ చేయండి .
దిగువ లింక్ లో ఇవ్వబడిన అధికారిక లింక్ ద్వారా మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి వెంటనే స్టేటస్ పొందవచ్చు.
Leave a Reply