రాష్ట్రంలో అమలు చేయబడుతున్నటువంటి సంక్షేమ పథకాలకి సంబంధించి ఎప్పుడు ఏ పథకాన్ని అమలు చేయనున్నారో తెలుపుతూ ప్రతి ఏటా ప్రభుత్వం సంక్షేమ క్యాలెండర్ విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.. అయితే ఈ క్యాలెండర్ లో పేర్కొన్నటువంటి పథకాల అమలుకు సంబంధించి మరియు వాటి తేదీలకు సంబంధించి ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ ప్రతినెల ప్రభుత్వం మరో షెడ్యూల్ ని విడుదల చేస్తూ వస్తుంది. ప్రస్తుతం నవంబర్ నెలకి సంబంధించి ఏ ఏ సంక్షేమ పథకాలను అమలు చేయనున్నారు అనే దానిపై ప్రభుత్వం వివరాలను తెలిపింది.
తాజా సమాచారం ప్రకారం నవంబర్ నెలలో అమలు చేయనున్న సంక్షేమ పథకాలు ఏమిటి? ఏ రోజున ఏ పథకాన్ని అమలు చేస్తారు అనే డీటైల్స్ ఇప్పుడు చూద్దాం. ఈ నెలలో ప్రభుత్వం 4 పథకాల లబ్ధిదారులకు నిధులను విడుదల చేయనున్నట్లు పేర్కొంది.
ఆ పథకాల వివరాలు. [List of Welfare schemes to be implemented in November 2023]
1. YSR రైతు భరోసా
2. భూ పంపిణీ మరియు యాజమాన్య హక్కుల కార్యక్రమం
3. జగనన్న విద్యా దీవెన
4. వైయస్సార్ కళ్యాణమస్తు షాది తోఫా
నవంబర్ 7న వైఎస్ఆర్ రైతు భరోసా
రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ప్రతి ఏడాది రైతు భరోసా ద్వారా 7500 మరియు పిఎం కిసాన్ ద్వారా 6000 రూపాయలను రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రతి ఏడాది మే నెలలో అక్టోబర్ నెలలో మరియు జనవరి నెలలో ఈ అమౌంట్ ని ప్రభుత్వం విడుదల చేస్తూ వస్తుంది.
తాజాగా అక్టోబర్ నెలకి సంబంధించి విడుదల కావలసి ఉన్నటువంటి నాలుగు వేల రూపాయలు అనగా కేంద్ర ప్రభుత్వం వాటా ₹2,000 మరియు రాష్ట్ర ప్రభుత్వ వాటా 2 వేల రూపాయలు కలిపి నాలుగు వేల రూపాయల మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాల్సి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను నవంబర్ 7న జమ చేయనున్నట్లు ప్రకటించింది.
నవంబర్ 15న అసైన్డ్ భూ హక్కు, భూ పంపిణీ కార్యక్రమం
ఇక రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన పేదవారికి భూ పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 15న చేపట్టనుంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అసైన్డ్ భూములకు సంబంధించి కూడా పూర్తి యాజమాన్య హక్కులను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 15న ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా సుమారు 54 వేల ఎకరాలకు సంబంధించి వ్యవసాయ భూమిని బలహీన వర్గాలకు ప్రభుత్వం పంపిణీ చేయనుంది. అదే విధంగా అసైన్డ్ రైతులకు లేదా వారి వారసులకు( లీగల్ హైర్) కు అసైన్డ్ వ్యవసాయ భూములపై పూర్తి హక్కులు కల్పించనుంది.
ఈ పథకానికి సంబంధించిన మరింత సమాచారం కోసం కింది లింక్ పై క్లిక్ చేయండి.
జగనన్న విద్యా దీవెన – నవంబర్ 28న
రాష్ట్ర వ్యాప్తంగా ఐటిఐ, డిప్లమా, డిగ్రీ, ఇంజనీరింగ్, ఎంబిబిఎస్ తదితర కోర్సులు చదువుతున్నటువంటి కళాశాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా పూర్తి ఫీజ్ రియంబర్స్మెంట్ ను 4 విడతలలో చెల్లిస్తున్న విషయం మనకు తెలిసిందే.
జూలై – సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విద్యా దీవెన ద్వారా ఫీజు రియంబర్స్మెంట్ అయితే అమౌంట్ ను నేరుగా తల్లుల ఖాతాలో జమ చేయనుంది.
విద్యా దీవెన సంబంధించినటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం కింది లింక్ ని క్లిక్ చేయండి.
నవంబర్ 30న – వైయస్సార్ కళ్యాణ మస్తు, షాది తోఫా
రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులు మరియు భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలలో ఆడపిల్ల వివాహానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుండగా, వరుసగా ఈ ఏడాది మూడో విడత అమౌంట్ ను ప్రభుత్వం నవంబర్ 30న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాది తోఫా అప్డేట్స్ కోసం కింది లింక్ ని క్లిక్ చేయండి.
Leave a Reply