ఏపీలో ఓటర్ల జాబితా విడుదల – మొత్తం ఎంతమంది ఓటర్లంటే?

ఏపీలో ఓటర్ల జాబితా విడుదల – మొత్తం ఎంతమంది ఓటర్లంటే?

ఆంధ్రప్రదేశ్‌ ముసాయిదా ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్‌ మీనా విడుదల చేశారు. ఈ మేరకు ఓటర్ల జాబితాను ఆన్‌లైన్‌లో ఉంచారు. ముసాయిదా ఓటర్ల జాబితాను అన్ని జిల్లాల్లోని రాజకీయ పార్టీలకు ఇవ్వాల్సిందిగా జిల్లా అధికారులకు ఈసీ సూచించింది. ఈసీ వెల్లడించిన జాబితా ప్రకారం.. 

2022 జనవరి 6 నుంచి 2023 ఆగస్ట్ 30 వరకూ అన్ని స్థాయిల్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ చేపట్టినట్లు ఈసీ వెల్లడించింది. 21,18,940 ఓట్ల తొలగింపు ప్రక్రియను పునఃపరిశీలన చేసినట్లు తెలిపింది. ఆగస్టులో చేపట్టిన ఇంటింటి సర్వేలో జీరో డోర్ నెంబర్లతో 2,51,767 ఓట్లు ఉన్నట్లు ఈసీ గుర్తించింది. అలాగే, 1,57,939 ఇళ్లల్లో 10 మంది కంటే ఎక్కువ మంది ఓటర్లు నమోదైనట్లు గుర్తించామని ఎన్నికల అధికారులు తెలిపారు. అయితే, ప్రత్యేక డ్రైవ్ ద్వారా జీరో డోర్ నెంబర్లలో నమోదైన ఓటర్లను 66,740కు కుదించామని, 10 మంది ఓటర్ల కంటే ఎక్కువ ఉన్న ఇళ్లను కూడా తనిఖీ చేసి 71,581కి తగ్గించినట్లు చెప్పారు. 

మొత్తం ఓటర్లు4,02,21,450 
మహిళా ఓటర్లు 2,03,85,851
పురుష ఓటర్లు1,98,31,791
సర్వీసు ఓటర్లు68,158
  •  ముసాయిదా జాబితాలోని అభ్యంతరాల స్వీకరణకు ఆఖరి తేదీ డిసెంబరు 9.
  • 2024 జనవరి 5న ఓటర్ల తుది జాబితా విడుదల.
  • 18-19 సంవత్సరాల కొత్త ఓటర్ల సంఖ్య 2,88,155
  • 2023 జనవరి 5 తేదీ తర్వాత ఓటర్లుగా నమోదైన వారి సంఖ్య 15,84,789
  • ముసాయిదా జాబితా ప్రకటించే నాటికి తొలగించిన ఓట్ల సంఖ్య 13,48,203
  • ఇందులో మృతి చెందిన ఓటర్ల సంఖ్య 7,10,000
  • ఇతర ప్రాంతాలకు బదిలీ అయిన ఓటర్లు 5,78,625
  • పునరావృతమైన ఓటర్ల సంఖ్య 81,185
  • రాష్ట్రంలో మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 46,165
  • అనంతపురం జిల్లాలో అత్యధికంగా 19,79,775 మంది ఓటర్లు
  • అత్యల్పంగా అల్లూరి జిల్లాలో 7,40,857 మంది ఓటర్లు 
  • 2022 జనవరి 6 నుంచి 2023 ఆగస్టు 30వరకు అన్ని స్థాయుల్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ చేపట్టినట్లు వెల్లడించిన ఈసీ
  • 21,18,940 ఓట్ల తొలగింపు ప్రక్రియను పునః పరిశీలన చేసినట్టు వెల్లడి. ఆగస్టులో చేపట్టిన ఇంటింటి సర్వేలో జీరో డోర్ నెంబర్లతో 2,51,767 ఓట్లు గుర్తించినట్టు స్పష్టం చేసిన ఈసీ
  • 1,57,939 ఇళ్లలో 10 మంది కంటే ఎక్కువ మంది ఓటర్లు నమోదైనట్టు గుర్తింపు. ప్రత్యేక డ్రైవ్ చేపట్టి జీరో డోర్ నెంబర్లలో నమోదైన ఓటర్లను 66,740కి కుదించామన్న ఈసీ.
  • 10 మంది ఓటర్ల కంటే ఎక్కువ ఉన్న ఇళ్లను కూడా తనిఖీ చేసి, దానిని 71,581కి తగ్గించినట్టు వెల్లడి.
  • 2023 సెప్టెంబరు 18 తేదీ నుంచి ఓటర్ల జాబితా ప్రక్రియను ఫ్రీజింగ్‌లో పెట్టడం వల్ల తనిఖీ ప్రక్రియ ముందుకు సాగలేదన్న ఈసీ.

మార్చిలో ఏపీ ఎన్నికల నోటిఫికేషన్‌!

రాష్ట్రంలో సాధారణ ఎన్నికల నిర్వహణకు మార్చిలో నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్‌కుమార్‌ మీనా తెలిపారు. సచివాలయంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. తాజా జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,02,21,450. వచ్చే ఏడాది జనవరి 1 నాటికి పూర్తి స్థాయి జాబితా ప్రకటించే క్రమంలో భాగంగా ఎన్నికల సంఘం కొత్త ఓటర్లను చేర్చుకోవడం, మరణించిన వారి పేర్లు తొలగించడం, ఒక నియోజకవర్గం నుంచి మరోచోటకు బదిలీ వంటి ప్రక్రియ చేపట్టింది. దీనికి సంబంధించి ముసాయిదా జాబితాను మీనా విడుదల చేశారు. ‘ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లోనూ ముసాయిదా అందుబాటులో ఉంచాం. డిసెంబరు 9 వరకు ఎవరైనా తమ అభ్యంతరాలు తెలియజేయవచ్చు. డిసెంబరు 26 లోగా వాటిని పరిష్కరిస్తాం. ఆ తర్వాత తుది ఓటర్ల జాబితాను 2024 జనవరి 5న ప్రకటిస్తాం’ అని తెలిపారు.

కొత్త ఓటర్లు నమోదు కావచ్చు

2023 జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయసు నిండిన వారెవరైనా ఓటరుగా నమోదయ్యేందుకు గతంలో దరఖాస్తు చేసుకోపోతే డిసెంబరు 9 వరకు దరఖాస్తు చేసుకునే వీలుంది. ఆన్‌లైన్‌లో కూడా చేసుకోవచ్చు. 2024 ఏప్రిల్‌ 1 లేదా జులై 1 లేదా అక్టోబరు 1 నాటికి 18 ఏళ్లు నిండేవారెవరైనా కూడా ముందస్తు దరఖాస్తు చేసుకోవచ్చు.

పోలింగు కేంద్రాల వద్ద ప్రత్యేక కార్యక్రమాలు..

ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, తప్పులు సరిదిద్దుకునేందుకు డిసెంబరు 9 వరకు అవకాశం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రతి పోలింగ్‌ బూత్‌ వద్ద ఇందుకు రెండుసార్లు ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. నవంబరు 4, 5, డిసెంబరు 2, 3 తేదీల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. అక్కడకు వెళ్లి జాబితాలో అభ్యంతరాలు, తప్పుల సవరణకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

మీ ఓటు ఉందా?.. చెక్‌ చేసుకోండి

1. ముందుగా బ్రౌజర్‌లో అధికారిక నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్ వెబ్‌సైట్ voters.eci.gov.in లోకి వెళ్లాలి.

2. వెబ్‌సైట్ ఓపెన్ అయ్యాక మెయిన్ పేజీలో సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్ (Search in Electoral Roll) అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

3. ఆ ఆప్షన్ క్లిక్ చేశాక మరో పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో రెండు విధాలుగా ఓటర్ లిస్ట్‌లో మీ పేరును చెక్ చేసుకోవచ్చు.

4. మొదటి ఆప్షన్ సెర్చ్ బై డిటల్స్‌లో.. మీ పేరు, వయసు/పుట్టిన తేదీ, రాష్ట్రం, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం, తండ్రి/భర్త పేరు లాంటి వివరాలు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత చివర్లో క్యాప్చా (Captcha) కోడ్‌ను అక్కడ ఉన్నట్టే ఎంటర్ చేయాలి. ఆ తర్వాత అక్కడే కింద ఉండే సెర్చ్ బటన్‌పై క్లిక్ చేస్తే ఓటరు జాబితాలో ఉన్న మీ వివరాలు వస్తాయి.

5. ఒకవేళ మీ వద్ద ఓటరు కార్డు నంబర్ (EPIC Number) ఉంటే దాని ద్వారా కూడా ఓటరు లిస్ట్‌లో మీ వివరాలను చెక్ చేసుకోవచ్చు. అందుకోసం Search by EPIC No. అనే ఆప్షన్ అదే పేజీలో ఉంటుంది.

6. అందులోకి వెళ్లి ఓటరు కార్డు నంబర్, రాష్ట్రం, అక్కడే ఉన్న కోడ్‌ను ఎంటర్ చేసి.. సెర్చ్ బటన్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఓటర్ లిస్ట్‌లోని మీ పేరు వివరాలు వస్తాయి.

Click here to Share

One response to “ఏపీలో ఓటర్ల జాబితా విడుదల – మొత్తం ఎంతమంది ఓటర్లంటే?”

  1. Ch sasikumar Avatar
    Ch sasikumar

    My vote

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page