కర్ణాటకలో ఈ ఏడాది కొలువుతీరిన కాంగ్రెస్ ప్రభుత్వం, తాము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వరుసగా నెరవేర్చుకుంటూ దూసుకుపోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఐదు హామీలలో ఇప్పటికే మూడు హామీలు నెరవేర్చగా తాజాగా నాల్గవ హామీ అయిన గృహ లక్ష్మీ పథకాన్ని రాఖీ పౌర్ణమి సందర్భంగా రాహుల్ గాంధీ ప్రారంభించారు.
గృహలక్ష్మి పథకం ద్వారా ప్రతి నెల ₹2000 రూపాయలు
దేశంలోనే మహిళల కోసం రూపొందించబడిన అతిపెద్ద సంక్షేమ పథకంగా పేర్కొనబడినటువంటి గృహలక్ష్మి పథకాన్ని కర్ణాటక ప్రభుత్వం బుధవారం అట్టహాసంగా ప్రారంభించింది.
ఈ పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడినటువంటి బిపిఎల్ కుటుంబాలకు చెందినటువంటి మహిళలకు ప్రతినెల 2000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం తమ ఖాతాలో నేరుగా జమ చేయనుంది.
ఈ పథకాన్ని రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరియు మల్లికార్జున ఖర్గే సంయుక్తంగా ప్రారంభించారు.
ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కోటి 20 లక్షల మంది మహిళలు లబ్ధి పొందుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
మైసూర్ లో ఈ పథకానికి శ్రీకారం చుట్టిన రాహుల్ గాంధీ, తాము అమలు చేసేవే చెప్తామని అమలు చేయలేనివి చెప్పమని పేర్కొన్నారు. ఇప్పటికే ఐదు హామీలలో నాలుగో హామీలు నెరవేర్చినట్లు వెల్లడించారు.
మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ రాయితీ, 10 కేజీల ఉచిత బియ్యం పథకమైనటువంటి అన్న భాగ్య పథకాలను ఇప్పటికే ప్రారంభించినటువంటి కర్ణాటక ప్రభుత్వం ప్రస్తుతం నాలుగవ హామీ అయినటువంటి గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది. దీని తర్వాత నిరుద్యోగుల కోసం రూపొందించబడినటువంటి యువనిధి పథకానికి కూడా త్వరలో శ్రీకారం చుట్టునున్నట్లు తెలుస్తోంది.
కర్ణాటక గృహలక్ష్మి పథకానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని కింది లింకు ద్వారా మీరు తెలుసుకోవచ్చు.
Leave a Reply